Advertisement
Google Ads BL

నాకు కలర్స్ నచ్చవు: సినిమాటోగ్రాఫర్ విందా


గ్రహణం సినిమాతో కెరీర్ మొదలు పెట్టి దాదాపు ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలన్నింటికీ సినిమాటోగ్రాఫర్ గా పని చేసి పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్ తో రెండు సినిమాలు చేసే అవకాశం పొంది తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు సినిమాటోగ్రాఫర్ పి.జి.విందా. నాని హీరోగా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'జెంటిల్ మన్' సినిమాను కూడా తన కెమెరాతో క్యాప్చుర్ చేసి హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న పి.జి.విందా విలేకర్లతో ముచ్చటించారు. 

Advertisement
CJ Advs

పెయింటింగ్ ఇష్టం..

చిన్నప్పటి నుండి నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ లో కూడా పాల్గొన్నాను. నా అసలు పేరు పి.గోవిందా. కానీ పెయింటింగ్స్ మీద పి.జి.విందా అని రాసేవాడిని. అదే పేరు కంటిన్యూ అవుతూ వచ్చింది. 

ఆ సినిమాలు పెయింటింగ్ లా కనిపించేవి..

మాది మెహబూబ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామం. స్కూల్ డేస్ లో బాగా చదవడంతో ఇంట్లో వాళ్లంతా.. డాక్టర్ అవుతాననుకునేవారు. కానీ నాకేమో పెయింటింగ్ ఇష్టం. శివ, అంజలి, రోజా, గీతాంజలి ఈ సినిమాలన్నీ చూస్తుంటే పెయింటింగ్ లాగా కనిపించేవి. పెయింటింగ్ స్కూల్ లో అడ్మిషన్ ప్రయత్నించాను కానీ ఇంట్లో వాళ్ళ వలన కుదరలేదు. డిగ్రీ పూర్తయిన తరువాత హైద్రాబాద్ వచ్చాను. జె.ఎన్.టి.యు లో ఫొటోగ్రఫీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. 

మోహన్ కృష్ణ గారితో గ్రహణం సినిమా చేశా..

కె.ఎం.రాధాకృష్ణతో నాకు స్నేహం ఉండేది. తను ఆ సమయంలో సినిమాలో పాటలు పాడుతూ ఉండేవాడు. తరచు తనను కలిసి సినిమాల గురించి డిస్కస్ చేసే వాడిని. ఫొటోగ్రఫీలో మాస్టర్ అయిన మధు అంబట్ గారి దగ్గర పని చేయాలనుకున్నాను. ఆయన లజ్జ అనే సినిమాతో బిజీగా ఉన్నారని తెలిసి కలవడానికి వెళ్ళాను. మనీషా కొయిరాలా, అజయ్ దేవగన్, మాదిరి దీక్షిత్ అందరికి నా వర్క్ నచ్చింది. ఆ తరువాత మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారితో గ్రహణం అనే సినిమాకు పని చేశాను. ఆ తరువాత మోహన్ గారితో ఛాయా సినిమాకు ట్రావెల్ చేశాను. నీలకంఠ గారితో అనుమానాస్పదం సినిమా చేశాను. 

చాలా ఆఫర్లు వచ్చాయి..

'అష్టా చమ్మా', 'వినాయకుడు' సినిమాలు ఒకే సంవత్సరంలో రిలీజ్ అయ్యాయి. రెండు హిట్ సినిమాలు కావడంతో చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే నేను మాత్రం 'లోటస్ పాండ్' అనే సినిమా చేశాను. ఆ సినిమాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ నేనే. ఆ సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా నా బాధ్యత మరింత పెరిగింది. 

నా వర్క్ ఇంప్రూవ్ అయింది..

మోహన్ తో వరుసగా సినిమాలు చేయడం వలన నా వర్క్ ఇంప్రూవ్ అయింది. తనకు నాకు ఇప్పటివరకు ఎలాంటి ఇష్యుస్ రాలేదు. తనతో వర్క్ చేయడం ఎంజాయ్ చేస్తాను. పైగా మోహన్ మన సలహాలను స్వీకరిస్తాడు. 

పూరితో రెండు సినిమాలు చేశాను..

పూరి గారితో నాకు లాంగ్ కనెక్షన్ ఉండేది. బద్రి సినిమా హిందీ రీమేక్ కు నేను అసిస్టెంట్ కెమెరామెన్ గా పని చేశాను. ఎప్పుడైనా మనం సినిమా చేద్దామని అప్పుడే చెప్పారు. జ్యోతిలక్ష్మి, లోఫర్ సినిమాలకు నాకు అవకాశం ఇచ్చారు. ఆయనతో పని చేసాక.. తొందరగా సినిమా చేయడం నేర్చుకున్నాను. 

థ్రిల్లర్ చేయగలరని అప్పుడే అనుకున్నా..

మోహన్ గారు 'చలి' అనే షార్ట్ ఫిల్మ్ చేశారు. యూట్యూబ్ లేనప్పుడు సీడీల రూపంలో ఆ సినిమాను చాలా మంచి కొనుక్కున్నారు. అప్పుడే మోహన్ గారి థ్రిల్లర్ సబ్జెక్ట్స్ చేయగలరనుకున్నాను. 

నాకు కలర్స్ నచ్చవు..

ఒక పెయింటర్ గా నాకు కలర్స్ నచ్చవు. బ్లాక్, గ్రే కలర్స్ తోనే అందాన్ని చుపించాలనుకుంటాను. నాకు గ్రీనరీ అసలు నచ్చదు. పొవర్టీలో ఉండే రిచ్ నెస్ ను చూపించాలంటే నాకిష్టం. 

కాంప్లిమెంట్స్ వచ్చాయి..

జెంటిల్ మన్ సినిమా చూసిన చాలా మంది దర్శకులు నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నేను కలిసి పని చేయాలనుకున్న దర్శకులు కూడా నాతో సినిమా చేయడానికి మక్కువ చూపుతున్నారు. సినిమా ఇంత క్వాలిటీతో రావడానికి కారణం నిర్మాతే. ఎక్కడా.. కాంప్రమైజ్ కాకుండా అడిగిన ప్రతీది ఇచ్చారు. 

డైరెక్ట్ చేస్తా..

అన్నీ కుదిరితే మరోసారి దర్శకత్వం చేస్తాను. చాలా కథలు రాసుకున్నాను. కానీ రెగులర్ గా ఉండవు. పాటలు, డ్రామా లేకుండా ఉండే కథలు. ఎక్కువగా సమాజ సమస్యల మీద, గ్లోబలైజేషన్ మీద ఉండే కథలివి. యూనివెర్సల్ సబ్జెక్ట్స్. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ఇంకా ఏది కమిట్ కాలేదు కానీ మోహన్ కృష్ణ గారితో ఓ సినిమా ఉంటుందంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs