Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ: చాందిని చౌదరి


సుధాకర్ కొమ్మాకుల, సుదీర్ వర్మ, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్రరావు బి.ఎ సమర్పణలో ఎస్.ఎల్.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ముళ్ళపూడి వరా దర్శకత్వంలో జి.అనిల్ కుమార్ రాజు, జి.వంశీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'కుందనపు బొమ్మ'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. హీరోయిన్ చాందిని చౌదరితో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

షార్ట్ ఫిల్మ్ నచ్చి ఛాన్స్ ఇచ్చారు..

మాది వైజాగ్. నేను చదువుకుంది మాత్రం బెంగుళూరులో. అక్కడే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. 2013 మధురం నా లాస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్. ప్రొడ్యూసర్స్ కి ఆ సినిమా బాగా నచ్చి 'కుందనపు బొమ్మ' సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో నేను చదువుకుంటున్నాను. టీమ్ కూడా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల కొంచెం డిలే అయింది. అది నాకు కలిసొచ్చింది. 2015 జనవరిలో సినిమాను ప్రారంభించారు. 

తెలుగమ్మాయిలను తీసుకోవట్లేదు..

నాకు నటన అంటే ఇష్టం. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలను తీసుకోకుండా బయటనుండి హీరోయిన్స్ ను ఎందుకు తీసుకువస్తున్నారో అర్ధం కాలేదు. భాష తెలిసి, డైలాగ్ లు చెప్పే వారు ఉన్నప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడడం ఎందుకు. నేను ఇండస్ట్రీలోకి వెళ్తాను అన్నప్పుడు నా పేరెంట్స్ చదువుని కంప్లీట్ చేసిన తరువాత యాక్టింగ్ లోకి వెల్లు అని చెప్పారు. అందుకే డిగ్రీ పూర్తి చేసిన తరువాతే సినిమాల్లోకి వచ్చాను. 

వారితో కలిసి పని చేయడం గొప్ప విషయం..

కీరవాణి, రాఘావేంద్రరావు, వరా ముళ్ళపూడి వంటి వ్యక్తులతో అసోసియేట్ అవ్వడం నా అదృష్టం. అందుకే సినిమా ఒప్పుకున్నాను. అంతేకాదు నాకు కథ కూడా బాగా నచ్చింది. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమా. 

ఇకపై ఎవరిని నమ్మను..

నేను ఎవరిని నమ్మకూడదని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి ఫ్రాంక్ గా ఉండడం అలవాటు. కానీ ఇక్కడ అలా ఉండకూడదని అర్ధమయింది. ఒక సినిమా కోసం సుమారుగా రెండేళ్లు వైట్ చేయించారు ఆ సమయంలో మరే సినిమా చేయకుండా చేశారు. చాలా హిట్ సినిమాలు పోగొట్టుకున్నాను. ఇప్పటికీ చాలా బాధగా ఉంటుంది. 

అమ్మాయి సమస్యలే సినిమా..

ఈ సినిమాలో నా పాత్ర పేరు సుచి. మహాదేవరాజు గారి గారాల పట్టి. ఇంట్లో ఉన్న వాళ్లందరికీ తనంటే ముద్దు. మంచి మనసున్న అమ్మాయి. అలాంటి అమ్మాయికి కొన్ని సమస్యలు ఉంటాయి. తన బావ గోపి, వాసు అనే మరో వ్యక్తి తన జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తారు. సుచి సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి అనేదే సినిమా. 

సిస్టర్ రోల్స్ చేయను.. 

బ్రహ్మోత్సవం సినిమాలో నేను నటించిన సన్నివేశాలు ఎడిట్ చేసేసారు. నా పాత్రకు చాలా డైలాగ్స్ ఉంటాయి. మొదట ఆ పఃత్రలో నటించాలా..? వొద్దా..? అని చాలా ఆలోచించాను. కానీ శ్రీకాంత్ అడ్డాల గారు నన్ను ఒప్పించారు. నాకు సిస్టర్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం ఇష్టం లేదు. హీరోయిన్ గానే నటిస్తాను. నాకు వెర్సటైల్ రోల్స్ చేయాలనుంది. నటిగా నన్ను నేను నిరూపించుకోవాలి. 

రజినీకాంత్ అంటే ఇష్టం..

నాకు రజినీకాంత్ గారంటే చాలా ఇష్టం. ఒక్కసారైనా ఆయనకు మీట్ అవ్వాలనేది నా ఆశ. కానీ ఆయనకు నేనెవరో తెలియాలి. నేను ఆ స్టేజ్ కు వచ్చినప్పుడే కలుస్తాను. 

కన్నడలో అవకాశాలు వచ్చాయి..

నేను బెంగుళూరులో చదువుకున్నాను కాబట్టి నాకు కన్నడ భాష తెలుసు. అక్కడ చాలా అవకాశాలు వచ్చాయి. కానీ కుదరలేదు. ఏ భాషలో నటించడానికైనా... సిద్ధంగా ఉన్నాను. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

రాహుల్ రవీంద్రన్ హీరోగా, రేవన్ యాదు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అలానే మధురం షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఫనీంద్రతో 'మను' అనే సినిమాలో నటిస్తున్నాను. ఆ సినిమాలో పాటలు ఉండవు. డిఫరెంట్ ఫిల్మ్. ఇండియాలో ఉన్న బెస్ట్ టెక్నీషియన్స్ ఆ సినిమాకు పని చేస్తున్నారు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs