Advertisement
Google Ads BL

అలా చెప్పుకోవడానికి అర్హత ఉండాలి: నీహారిక


ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుండి హీరోలే వచ్చారు. తొలిసారిగా మెగా వారసురాలు నాగబాబు కూతురు అయిన నీహారిక కొణిదల తెరంగేట్రం చేయనుంది. నాగ శౌర్య హీరోగా, రామరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా.. నీహారిక విలేకర్లతో ముచ్చటించారు.

Advertisement
CJ Advs

సంధ్య పాత్ర ఆకట్టుకుంది..

నేను హీరోయిన్ గా చేయబోయే సినిమా కోసం చాలా కథలు విన్నాను. ఒకట్రెండు కథలు నచ్చాయి కూడా. కాని ఎందుకో ఆ పాత్రల్లో నన్ను నేను ఊహించుకోలేకపోయాను. ఎప్పుడైతే రామరాజు గారు 'ఒక మనసు' కథ చెప్పారో.. మరో విషయం ఆలోచించకుండా.. నేను నటిస్తానని చెప్పేసాను. సంధ్య అనే పాత్ర నన్ను అంతగా ఆకట్టుకుంది. ఆ పాత్ర్రను నేను పోట్రేట్ చేయగలననే నమ్మకం కలిగింది. ఇలాంటి ఓ మంచి పాత్రతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నందుకు గర్వంగా కూడా ఉంది. 

పెదనాన్నతో డిస్కస్ చేశాం..

ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీస్ నుండి చాలా మంది హీరోయిన్స్ వచ్చారు. కాని ఎక్కువ సినిమాలు చేయలేదు. నాకు నటించాలనిపించినప్పుడు ఇది కరెక్టా.. కాదా..? అనుకున్నాను. కాని ప్రొడక్షన్ మీద మొదటి నుండి ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తి కాస్త సినిమాల మీద పడింది. నటించాలని నిర్ణయం తీసుకున్నాను. నాన్నకు మొదట చెప్పాను. ఆ తరువాత పెదనాన్న చిరంజీవి గారితో డిస్కస్ చేశాం. వాళ్ళంతా.. హీరోస్ ఎలా అయినా.. నెగ్గుకు రాగలరు.. హీరోయిన్ గా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. గుడ్ ఆర్ బ్యాడ్ కామెంట్స్ వినాల్సి వస్తుదని చెప్పారు. చివరిగా నీ లైఫ్ నీకు కరెక్ట్ అనిపించింది చెయ్ అని ప్రోత్సహించారు. 

స్వచ్చమైన ప్రేమకథ..

ఈ సినిమాలో ప్యూర్ లవ్ ను చూపించారు. మరోచరిత్ర, గీతాంజలి రెండు చిత్రాలకు దగ్గరగా అనిపిస్తుంది. కాని ఎక్కడా.. సిమిలారిటీస్ ఉండవు. ఎనభై శాతం సినిమా సంధ్య, సూర్య ల చుట్టూనే తిరుగుతుంది. స్వచ్చమైన ప్రేమ కథ కనిపిస్తుంది. ప్రేమ కథ అనేసరికి తల్లి తండ్రులు వారి పిల్లలతో చూడడానికి ఇబ్బంది పడతారు. కాని ఈ సినిమాలో ఏ ఒక్క సన్నివేశం అలా ఉండదు. సంధ్య లాంటి ఆడపిల్ల భార్యగా వస్తే బావుంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. 

ఫ్యాన్స్ ఒత్తిడి నా వరకు రాలేదు.. 

నేను సినిమాల్లోకి వస్తానన్నప్పుడు ఫ్యాన్స్ ఒత్తిడి చేసారని విన్నాను. అయితే నా వరకు రాలేదు. పైగా నన్ను ప్రోత్సహించారు. నాన్నను కలవడానికి ఓ పది మంది అభిమానులు వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూ.. నాన్న నాకు ఫోన్ చేసి స్పీకర్ పెట్టారు. అప్పటివరకు నాకున్న అభద్రతా భావం వాళ్ళతో మాట్లాడిన తరువాత పోయిందనే చెప్పాలి. వాళ్ళ మాటలతో నాకు బలన్నిచ్చారు. గ్లామర్ ఫీల్డ్ లో అమ్మాయిలను ఎలా చూస్తారో.. అందరికీ తెలిసిందే. కాని మెగా అభిమానులు మాత్రం నీకు మేము సపోర్ట్ చేస్తాం.. మా ఇంటి బిడ్డగా చూసుకుంటామని నాకు ప్రోత్సాహం అందించారు. 

యాక్టింగ్ నచ్చకపోతే ఎవరు చూడరు.. 

నేను మెగా కుటుంబం నుండి వచ్చినా.. నా నటన నచ్చకపోతే ఎవరు సినిమా చూడరు. అభిమానం కోసం ఒకసారి చూస్తారేమో.. కాని తర్వాత తర్వాత పట్టించుకోరు. నేను కూడా అంతే.. నాకు నచ్చితేనే సినిమా చూస్తాను.. నచ్చకపోతే అసలు చూడను. అది మా అన్నయ్య సినిమా అయినా అలానే చేస్తాను. మొదట టాలెంట్ ను నిరూపించుకోవాలి. ప్రేక్షకులను థియేటర్ వరకు రప్పించాలి. 

నాకు గ్లామర్ రోల్స్ నచ్చవు.. 

ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు గ్లామర్ ను, యాక్టింగ్ ను బ్యాలన్స్ చేసుకుంటూ.. నటిస్తున్నారు. స్క్రిప్ట్స్ డిమాండ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు నటిస్తారు. నా వరకు నేను గ్లామరస్ రోల్స్ లో నటించను. మొదట స్క్రిప్ట్ వినే ముందు రెండు విషయాలను గుర్తుపెట్టుకుంటా.. ఒకటి మా నాన్న, రెండు మా అభిమానులు. వారిని దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్ ఓకే చేస్తాను. వాళ్లకు చూడడానికి ఇబ్బంది కలిగించే పాత్రల్లో నేను నటించను. 

లాంగ్ టర్మ్ గోల్స్ లేవు.. 

నేనేదో ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండాలని.. దాని కోసం ఏ పాత్రలో పడితే ఆ పాత్రలో నటించను. నాకు లాంగ్ టర్మ్ గోల్స్ లేవు. నటించినవి రెండు, మూడు సినిమాలైనా.. నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మంచి సినిమాల్లో నటించాననే తృప్తి ఉండాలి. అయినా.. నేను మలయాళం, తమిళంలో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. సో.. ఆఫర్స్ వస్తాయనే అనుకుంటున్నాను. నేను టీవీ షోలతోనే పాపులర్ అయ్యాను. దాన్ని వదిలేస్తానని చెప్పను గానీ.. ప్రస్తుతం సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నాను. 

నా రోల్ మోడల్ ఆయనే.. 

నాకు ఇప్పటికీ, ఎప్పటికీ రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవి నాన్నే.. మా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా కమల్ హాసన్ గారు, కాజోల్ అంటే నాకు బాగా ఇష్టం. 

శౌర్య బాగా హెల్ప్ చేశాడు..

మొదట నాగశౌర్య చాలా రిజర్వ్డ్ అనుకున్నాను. చాలా కామ్ గా ఉండేవాడు. రాను.. రాను.. మంచి ఫ్రెండ్ అయిపోయాడు. కొన్ని సీన్స్ లో నేను నటించడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు కో స్టార్ గా ఎంతో హెల్ప్ చేశాడు. 

అందరం కలిసే సినిమా చూస్తాం..

మెగా హీరోయిన్ అనిపించుకోవడానికి ఓ అర్హత ఉండాలి. నాకు ఆ అర్హత వచ్చినప్పుడు నేనే స్వయంగా చెప్పుకుంటాను. అయితే మా ఫ్యామిలీలో ప్రతి సినిమా అందరం కలిసే చూస్తాం. చిరంజీవి నాన్న, కళ్యాణ్ బాబాయ్ ఇలా అందరం కలిసి ప్రివ్యూ షో చూస్తాం. ఈ సినిమాను జూన్ 23 లేదా 24న చూస్తాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs