'పిల్లా నువ్వు లేని జీవితం','సుబ్రమణ్యం ఫర్ సేల్' వంట్టి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం తను నటించిన 'సుప్రీమ్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. హీరో సాయి ధరమ్ తేజ్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
పక్కా కమర్షియల్ సినిమా..
నేను నటించిన 'రేయ్' సినిమా మ్యూజికల్ ఎంటర్టైనర్ అయితే.. 'పిల్లా నువ్వు లేని జీవితం' లవ్ ఎంటర్టైనర్. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన సినిమా. 'సుప్రీమ్' మాత్రం పక్కా కమర్షియల్ సినిమా. సినిమా మొదలయినప్పటినుండి చివరి వరకు అందరు నవ్వుతూనే ఉంటారు.
హార్న్ కొడితే హారరే..
ఈ సినిమాలో నేను బాలు అనే క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాను. వెనుక నుండి ఎవరైనా హార్న్ కొడితే హారర్ సినిమా చూపించే టైప్. ఎందుకు అలా చేస్తున్నాడో.. తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!
రీమిక్స్ ఆలోచన డైరెక్టర్ గారిదే..
ఈ సినిమాలో 'సుప్రీమ్' సాంగ్ ను రీమిక్స్ చేయాలనే ఆలోచన అనిల్ రావిపూడి గారిదే. సుప్రీమ్ టైటిల్ పెట్టుకొని ఆ పాటను రీమిక్స్ చేయకపోతే ఎలా అనుకున్నాడు. ఒరిజినల్ సాంగ్ కు ఏ మాత్రం తగ్గకుండా చాలా క్వాలిటీతో సినిమా షూట్ చేశారు. రీమిక్స్ పాటలు చేయడానికి నేను వ్యతిరేకిని కాదు.. అలా అని అనుకూలము కూడా కాదు. అది డైరెక్టర్స్ ఇష్టానికే వదిలేస్తాను.
కసితో పని చేశాను..
మొదట సుప్రీమ్ టైటిల్ పెట్టినప్పుడు చాలా భయం వేసింది. మావయ్య(చిరంజీవి) దగ్గరకు వెళ్లి విషయం చెప్పాను. ఆయన కష్టపడమని ప్రోత్సహించారు. ప్రతి సినిమాకు కష్టపడే దానికంటే ఇంకా ఎక్కువ కష్టపడి కసితో ఈ సిన్మాకు పని చేశాను.
క్లారిటీ ఉన్న దర్శకుడు..
అనిల్ రావిపూడి కథ మీద క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. ఎమోషన్స్ ను, కమర్షియల్ ఎలిమెంట్స్ ను బాగా బ్యాలన్స్ చేయగలడు.
ఉన్న కంపారిజన్స్ చాలు..
గ్యాంగ్ లీడర్ సినిమాను స్పూర్తిగా తీసుకొని ఈ సినిమా చేసారనే వార్తలు వస్తున్నాయి. కాని అలా చేయలేదు. ఇప్పటికి ఉన్న కంపారిజన్స్ చాలు. కొత్తగా ఏమి క్రియేట్ చేయొద్దు. స్టొరీకు తగ్గట్లు డ్రైవర్ పాత్రలో నటించాను.
ఆ ఎమోషన్ నన్ను ఆకట్టుకుంది..
సుప్రీమ్ పక్కా కమర్షియల్ సినిమా అయినా.. ఒక ఎమోషన్ క్యారీ అవుతూ ఉంటుంది. నేను ఈ సినిమా అంగీకరించడానికి కారణం కూడా అదే. అలానే ఈ సినిమాలో ఒక చైల్డ్ సెంటిమెంట్ ఉంటుంది. ఆ పాత్రలో నటించిన పిల్లాడు అధ్బుతంగా నటిచాడు.
రెగ్యులర్ హీరోయిన్ కాదు..
ఈ సినిమాలో రాశి రెగ్యులర్ హీరోయిన్స్ కు భిన్నంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో తను కామెడీ ఎక్కువ చేసింది. తనలో మంచి కామెడీ టైమింగ్ ఉంది.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
తిక్క సినిమాలో నటిస్తున్నాను. అలానే గోపీచంద్ మలినేని గారి డైరెక్షన్ లో మరో సినిమా అంగీకరించాను. రీసెంట్ గా ఆ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు.