Advertisement
Google Ads BL

బాలీవుడ్ ఆలోచనలు లేవు: రాశిఖన్నా


'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన పంజాబీ ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఆ తరువాత జిల్, బెంగాల్ టైగర్ వంటి హిట్ సినిమాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సరసన 'సుప్రీమ్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ రాశి ఖన్నాతో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

కామెడీ యాక్టర్ గా పేరొస్తుంది..

ఈ సినిమాలో బెల్లం శ్రీదేవి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాను. కామెడీ ఎటాచ్ ఉన్న క్యారెక్టర్. ఈ సినిమాతో నాకు కామెడీ యాక్టర్ గా మంచి పేరొస్తుంది. సినిమాలో ఉండే ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉండేలా డిజైన్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఎక్కువ శాతం ఉంటుంది. 

చాలా సినిమాలు చూశాను..

మొదటిసారి కామెడీ రోల్ ఎక్కువగా ఉన్న పాత్రలో నటించాను. బాడీ లాంగ్వేజ్ కోసం, డిక్షన్ కోసం చాలా సినిమాలు చూశాను. కామెడీ జోనర్ అనేది చాలా కష్టమైనది. నేను చాలెంజింగ్ గా ఫీల్ అయిన క్యారెక్టర్ ఇది. నేను కామెడీ చేస్తుంటే నాకే సర్ప్రైజింగ్ గా అనిపించింది. నటిగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోగలిగాను.

యాక్షన్ సీన్స్ చేశాను..

ఈ సినిమాలో నేను యాక్షన్ సీన్స్ చేశాను. నా ఇంట్రడక్షన్ సీన్ లో పెద్ద యాక్షన్ సీన్ ఉంటుంది. నేను ఫైట్ చేస్తుంటే సాయి ధరమ్ తేజ్ వెనుక నుండి షాకింగ్ గా చూస్తూ ఉన్నాడు.  

తన స్టెప్స్ కు మ్యాచ్ అయ్యాననే అనుకుంటున్నా..

అందం హిందోళం అనే పాటను రీమిక్స్ చేశారు. మొదట ఒరిజినల్ సాంగ్ ను చూసినప్పుడు దానికి తగ్గట్లు డాన్స్ చేయడం కష్టమనిపించింది. ఒక్క ఫ్రేములో కూడా రాధ గారు చిరంజీవి గారు సెపరేట్ గా కనిపించరు. సాయి ధరమ్ తేజ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. తన స్టెప్స్ కు నేను మ్యాచ్ అయ్యాననే అనుకుంటున్నాను.

అందుకే ఈ సినిమా స్పెషల్..

సాధారణంగా హీరోకు ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటుంది. కాని ఈ సినిమాలో హీరోయిన్ కు ఉంటుంది. అమ్మాయి  యాక్షన్ సీన్స్ చేయడమే సుప్రీమ్ స్పెషల్. 

కొంచెం తగ్గాను..

ఈ సినిమా కోసమని కాదు.. నార్మల్ గానే బరువు తగ్గాను. కాని ఎంత తగ్గానో నేను మెజర్ చేసుకోను.

ఒకదానికే స్టిక్ అవ్వకూడదు..

హీరోయిన్ గా ఒకదానికే స్టిక్ అయ్యి నటించకూడదు. నేను కేవలం గ్లామరస్ రోల్స్ చేస్తే అలాంటి పాత్రలే వస్తాయి. గ్లామర్, పెర్ఫార్మన్స్ ను బ్యాలన్స్ చేసుకుంటూ.. నటించాలి. 

తేజు సూపర్బ్ డాన్సర్..

తేజు మంచి డాన్సర్. సీన్ చెప్పే వరకు చాలా కామ్ గా ఉంటాడు. ఒక్కసారి చెప్పిన తరువాత తన స్టైల్ లో నటిస్తాడు. కామ్ గా ఉంటేనే ఫోకస్ చేసి బాగా నటించగలమని ఆలోచిస్తుంటాడు.

కవిత్వం రాస్తున్నా..

ఖాళీగా ఉన్నప్పుడు కవిత్వం రాస్తుంటాను. త్వరలోనే దాన్ని ప్రచురించాలని భావిస్తున్నాను.

హైదరాబాద్ లో సెటిల్ అయిపోయా..

రీసెంట్ గా హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కున్నాను. ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. బాలీవుడ్ కు వెళ్ళే ఆలోచన లేదు. కాని తమిళంలో మాత్రం చేయాలనుంది. మంచి స్క్రిప్ట్స్ కోసం ఎదురుచూస్తున్నా..

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

గోపీచంద్ హీరోగా 'ఆక్సిజన్' సినిమాలో నటిస్తున్నాను. అది కాకుండా రవితేజ గారి సినిమా ఒప్పుకున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs