సినిమా ఇండస్ట్రీ ఏర్పడి సుమారుగా ఎనభై సంవత్సరాలు దాటింది. ఇండస్ట్రీలో ఎందరో పెద్దలు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. చడువున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, డబ్బులేని వాళ్ళు, కులమత ప్రాంతీయ విభేదం లేకుండా ఎంతోమంది మహానుభావుల్ని కళామ్మ తల్లి ఒడిలో అక్కున చేర్చుకొంది. మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇలా ఎన్నో డేస్ ఉన్నాయి. అందుకే మనకు ఒక సినిమా డే కావాలని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు తమ ఆలోచనను తెలియజేశారు. 2001 లో ఫైట్ మాస్టర్స్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వీరిద్దరూ సుమారుగా 1000 కి పైగా ఫైట్స్ ను కంపోజ్ చేశారు. 150 సినిమాలకు పని చేశారు. ఐదు నంది అవార్డ్స్ ను అందుకున్నారు. హీరోలుగా, డైరెక్టర్ గా కూడా సినిమాలు తీశారు. ఇంత చేసిన సినీ ఇండస్ట్రీకు ఒక వేదికపై శిరస్సు వంచి నమస్కారం చేసి ఒక పండుగలా జరుపుకోవాలనేదే వారి ఆలోచన. నేటి నుండి ఈ ఆలోచనను ఇండస్ట్రీ పెద్దలకు చేరవేసి త్వరలోనే సినిమా డే అనేరోజు రావడానికి కృషి చేస్తామని తెలిపారు.