Advertisement
Google Ads BL

జూనియర్ ఆర్టిస్ట్ గా అయినా పర్లేదు: తారకరత్న


'ఒకటో నంబర్ కుర్రోడు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి హీరో తారకరత్న కెరీర్ అనుకున్నంత సాఫీగా లేదు. చెప్పుకోదగ్గ ఒక్క హిట్టు సినిమాలో కూడా నటించలేదు. తను విలన్ గా నటించిన 'అమరావతి' సినిమాకు మాత్రం నంది అవార్డు అందుకున్నాడు. అయితే మరోసారి విలన్ గా ప్రేక్షకుల్ని మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. నారా రోహిత్, తారకరత్న ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'రాజా చెయ్యి వేస్తే' సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. తారకరత్నతో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలి..

ఈ సినిమాలో నటించమని సాయి కొర్రపాటి గారు నన్ను అడిగారు. డైరెక్టర్ కథ చెప్పినప్పుడు చాలా పవర్ ఫుల్ రోల్ అనిపించింది. కాని విలన్ గా నటించాలా..? వద్దా..? అనే డైలామాలో ఉన్నప్పుడు సాయి గారు ఈ రోల్ లో నువ్వు ఖచ్చితంగా నటించాలని చెప్పారు. నా పాత్ర కూడా బాగా నచ్చింది. నటుడిగా అన్ని రకాల పాత్రల్లో నటించాలి.

నేను రోహిత్ అనగానే హైప్ వచ్చింది..

మా ఫ్యామిలీ నుండి నేను రోహిత్ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నామన్నప్పుడు సినిమాకు బాగా హైప్ వచ్చింది. రోహిత్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. మూడు, నాలుగు రోజులు పడుకోకుండా నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొనేవాడు. తరచూ మేము కలుస్తూ.. ఉంటాం. ఈ సినిమాతో మరింత దగ్గరయ్యాం.

అవార్డు వస్తాదంటేనే సినిమా చేశా...

అమరావతి సినిమాలో విలన్ రోల్ లో కనిపించాను. ఆ సినిమాకు నంది అవార్డు కూడా వచ్చింది. క్రెడిట్ అంతా రావిబాబుకే చెందుతుంది. సినిమా కథ చెప్పినప్పుడే నీకు అవార్డు తెప్పించే సినిమా అని చెప్పారు. అది నమ్మే సినిమా చేశాను. అమరావతికి ఈ సినిమాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. విలన్ అనే వాడు ఎలా ఉండాలో 'రాజా చెయ్యి వేస్తే' సినిమాలో చూపించారు.

తనకు నచ్చిందే చేసే క్యారెక్టర్..

ఈ సినిమాలో నాకు తల్లితండ్రులు ఉండరు. చిన్నప్పటినుండి తనకు నచ్చింది చేస్తూ పెరుగుతాడు. కాని తను కరెక్ట్ అనుకొని చేసే ఏ పని కూడా తన చుట్టూ ఉండేవారికి నచ్చదు. తను మాత్రం ఎవరి కోసం మారడు. మొండిగా, తనను తను నమ్ముకొని ఉండే పాత్ర.

నటుడ్ని కాబట్టే ఈ స్థానంలో ఉన్నాను..

నా కెరీర్ లో అసంతృప్తి చెందలేదు. హార్డ్ వర్క్ తో పాటు.. టైం కూడా కలిసి రావాలి. నేను ఎలాంటి హార్డ్ వర్క్ చేయకుండా ఈరోజు ఈ స్థానంలో ఉండలేను కదా.. నాలో మంచి నటుడు ఉన్నాడు కాబట్టే ఇంకా నేను సినిమాలు చేస్తున్నాను. 

సబ్జెక్ట్స్ సరిగ్గా ఎన్నుకోలేదు..

నా కెరీర్ ప్రాభించిన మొదట్లో స్క్రిప్ట్స్ సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేకపోయాను. ఫాస్ట్ గా సినిమాలు చేసేసాను. ఇక మీదట అలా కాకుండా మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఈ సినిమా నన్ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు. 

వంద మందిలో పది మందికి నచ్చినా.. ఓకే..

తాతయ్య ఎన్.టి.రామారావు గారి పేరు ఇండస్ట్రీలో రావడానికి సహాయం చేసింది. నాకంటే టాలెంటెడ్ పెర్సన్స్ చాలా మంది ఉంటారు. కాని వారు ఇండస్ట్రీలో రావడానికి కష్టపడుతుంటారు.. ఆ అవకాశం నాకు సులభంగా వచ్చింది. అయితే ఇక్కడకి వచ్చిన తరువాత మాత్రం మన టాలెంట్ మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. తాతాగారికి రేంజ్ కి ఎదగడం చాలా కష్టం. కనీసం ఆయన లెవెల్ కు రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తాం. కాని అనవసరంగా నెగెటివ్ కామెంట్స్ చేసి మమల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. నెగెటివ్ కామెంట్స్ చేసేవారు ముందు వాళ్ళని చూసుకొని తరువాత వేరే వాళ్ళని కామెంట్ చేయాలి. నా వరకు నా సినిమాలు వంద మందిలో పది మందికి నచ్చినా.. ఓకే.

ఇంట్లోనే కలుస్తుంటాం..

మా కుటుంబ సభ్యలు అందరం తరచూ ఇంట్లోనే కలుస్తుంటాం. ఎవరి పనుల్లో వారి బిజీగా ఉంటారు.  ఖాళీ దొరికినప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇలా అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. మేము బయటకి కనిపించనంత మాత్రానా.. కలిసి లేమనుకుంటే ఎలా..?

మొదట సెటిల్ అవ్వాలి..

నటుడిగా నేను సెటిల్ అయిన తరువాత ప్రొడక్షన్ గురించి ఆలోచించాలని అనుకుంటున్నాను. మొదట సక్సెస్ ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నా..

బాబాయ్ సినిమాలో ఏదైనా ఓకే..

బాబాయ్ వందవ సినిమాలో నేను కనిపిస్తున్నానని వార్తలు వచ్చాయి. అయితే ఏ విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆయన సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో అయినా నేను నటించడానికి రెడీ..

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ఎవరు..? అనే సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs