Advertisement
Google Ads BL

రీమిక్స్ చేయడం నచ్చదు: తమన్


'బాయ్స్' సినిమాలో నటించి ఆ తరువాత కొన్ని చిత్రాలకు కీ బోర్డు ప్రోగ్రామింగ్ చేసి 'కిక్' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయమయిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్. మాస్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తమన్ ఎన్నో హిట్ చిత్రాలకు పని చేశాడు. ప్రస్తుతం తమన్ మ్యూజిక్ అందించిన 'సరైనోడు' సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలయిన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది..

ఈ సినిమా కోసం బన్నీతో కలిసి వర్క్ చేశాను. తనతో పని చేస్తుంటే తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. స్టోరీకు తగ్గట్లుగా పాట సిట్యుయేషన్ కరెక్ట్ గా చూసుకుంటాడు. కొరియోగ్రఫీ, లిరిక్స్, లొకేషన్స్ మీద శ్రద్ధ తీసుకుంటాడు. ఒక హీరోకి అభిమాని అయితే సక్సెస్ ఫుల్ ట్యూన్స్ ఇవ్వగలం. 

బన్నీకి మంచి కమాండింగ్ ఉంది..

ఈ సినిమా ట్యూన్స్ చేస్తున్నప్పుడు బన్నీ సిట్టింగ్స్ లో కూర్చోలేదు. పార్టీ సాంగ్ కి మాత్రం కూర్చున్నాడు. బన్నీకి టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ. ఇంటర్నేషనల్ వరల్డ్ టాప్ డీజె.. ఇడియమ్స్ మీద మంచి కమాండింగ్ ఉన్న వ్యక్తి. సినిమాలో పాటలకు మాస్ తో పాటు క్లాస్ టచ్ ఉండేలా చూసుకున్నాం. బన్నీ స్టైలిష్ స్టార్ కదా.. ఆ స్టైల్ కూడా ఉండేలా చూసుకున్నాం.

స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ తెప్పించాం..

మ్యూజిక్ చేయడానికి లుథియానా నుండి ప్రత్యేకంగా చేసిన డ్రమ్స్, అలానే 'బ్లాకు బాస్టర్' పాట కోసం ఆంధ్రలో ఉండే రూరల్ ఏరియాస్ నుండి స్పెషల్ డ్రమ్స్ తెప్పించాం.

రిజక్టడ్ ట్యూన్సే రెడీమేడ్ ట్యూన్స్..

తమన్ దగ్గర రెడీమేడ్ ట్యూన్స్ ఉంటాయని అనుకుంటారు. కానీ నా రెడీమేడ్ ట్యూన్స్ రిజక్టడ్ ట్యూన్స్. ఒక సినిమా కోసం చేసిన ట్యూన్స్ డైరెక్టర్ కు నచ్చకపోతే పక్కన పెట్టేస్తాం. అవే ట్యూన్స్ వేరే డైరెక్టర్ కు నచ్చుతాయి. అయితే నేను చీట్ చేసి ఆ ట్యూన్స్ వినిపించను. నా అధ్రుష్టమేమిటంటే నేను ట్యూన్స్ అందించిన దర్శకుడే వేరే డైరెక్టర్ కు తమన్ చేసిన ట్యూన్స్ నాకు సెట్ కాలేదు కాని ఒకసారి మీరు వినండని చెప్పేవారు. సో.. ట్యూన్స్ విన్నప్పుడు ఆ డైరెక్టర్ కు తెలిసే వినేవారు.

నా వాయిస్ ఉండాలనుకోను..

నేను మ్యూజిక్ చేసే సినిమాలో నా వాయిస్ ఉండాలనుకోను. అలా ఫోర్స్ కూడా చేయను. నిజంగా పాటకు నా వాయిస్ బావుండి.. డైరెక్టర్ చెప్తేనే పాడతాను. ఆ విధంగానే రవితేజ గారికి కొన్ని పాటలు పాడాను.

బోయపాటి గారంటే భయపడ్డాను..

బోయపాటి గారి భద్ర సినిమాకు దేవి మ్యూజిక్ చేశారు. ఆ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ దగ్గర కీ బోర్డు ప్రోగ్రామింగ్ చేశాను. సుమారుగా దేవికు ఇరవై సినిమాలకు కీ బోర్డు ప్రోగ్రామింగ్ చేశాను. అయితే 'సరైనోడు' సినిమా బోయపాటి గారి డైరెక్షన్ లో మ్యూజిక్ చేయాలంటే మొదట భయపడ్డాను. కాని సినిమా మొదలు పెట్టిన వారం రోజుల వ్యవధిలో మేము మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. 10 రోజుల్లోనే మూడు ట్యూన్స్ చేసేశాను. 

ఐటెం సాంగ్ అంటే టార్చర్..

ఐటెం సాంగ్ కు ట్యూన్స్ చేయడమంటే కష్టం. మిగిలిన పాటలకు సులభంగా చేయొచ్చు కాని ఐటెం సాంగ్ అంటే టార్చర్. దేవి, బన్నీ కోసం రింగా.. రింగా.. సాంగ్ అలానే టాపు లేచిపోద్ది వంటి పాటలు చేశాడు. తమన్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో.. అనే ప్రెషర్ ఉంటుంది. కాని కాంపిటిషన్ లేని ఊర్లో ఉండడం కష్టం. 

బాయ్స్ 2 ప్లాన్ చేస్తున్నాం..

అట్లీ అసోసియేట్ ఒకరిదగ్గర స్టోరీ విన్నాం. ఆ కథతో బాయ్స్ 2 సినిమా ప్లాన్ చేస్తున్నాం. మరో రెండు నెలల్లో ఆ ప్రాజెక్ట్ ఫైనల్ అవుతుంది. ఆ సినిమాకు కూడా మ్యూజిక్ నేనే చేయాలనుకుంటున్నాను.

క్రికెట్ ఖచ్చితంగా ఉండాలి..

నా హాలిడే క్రికెట్ తో గడిచిపోతుంది. క్రికెట్ ఆడితే రిఫ్రెష్ అయిపోతాను. చెన్నైలో మాకు క్రికెట్ టీం ఉంది. అందరూ సంగీత దర్శకులే. మా కెప్టైన్ మున్నికృష్ణన్. జూన్ నెలలో కేరళ టీంతో ఓ గేమ్ ఆడబోతున్నాం.

బాలీవుడ్ ఆలోచన ఉంది..

బాలీవుడ్ కు వెళ్ళాలనే ఆలోచన ఉంది. అయితే అక్కడ దర్శకులతో క్లారిటీ, కమ్యూనికేషన్ నాకు లేదు. అందుకే ఇక్కడ నుండి బాలీవుడ్ వెళ్లి సినిమా చేసే దర్శకుల సినిమాలకు మ్యూజిక్ చేయాలనుకుంటున్నాను.

లవ్ స్టోరీకి మ్యూజిక్ చేయాలనుంది..

ఇప్పటివరకు నేను హై స్టాండర్డ్స్ కమర్షియల్ సినిమాలకే మ్యూజిక్ చేశాను. కాని ఏదో ఒక రోజు ఖచ్చితంగా లవ్ స్టోరీకు మ్యూజిక్ చేస్తాను. 

స్లిమ్ అవ్వడం నా వల్ల కాదు..

స్లిమ్ అవ్వాలంటే జిమ్ కు వెళ్ళాలి. జిమ్ కు వెళ్ళడం నా వల్ల కాదు. అందుకే ఆ ఆలోచన పెట్టుకోలేదు.

థ్రిల్లర్ సినిమా చేయాలంటే ఇష్టం..

నాకు వ్యక్తిగతంగా థ్రిల్లర్ సినిమాలకు మ్యూజిక్ చేయడమంటే చాలా ఇష్టం. ప్రస్తుతం అంటే ఆ తరహా సినిమాలు చెయ్యట్లేదు. మంచి కాన్సెప్ట్ తో ఉండే సినిమా వస్తే చేస్తాను.

రీమిక్స్ చేయడం నచ్చదు..

పాటలను రీమిక్స్ చేస్తే కంపారిజన్స్ వస్తాయి. పది సినిమాలకు వచ్చే టెన్షన్ ఒక్క రీమిక్ పాటకు వస్తుంది. 'శుభలేఖ' పాటను రీమిక్స్ చేసినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. రీమిక్స్ చేయడమనేది చాలా కష్టం.

ఆల్బం ప్లాన్ చేస్తున్నా..

మనిషి జీవితంలో ప్రేమను ఎలా డివైడ్ చేస్తామనే దానిపై ఒక ఆల్బం చేస్తున్నాను. దాన్ని మూడు నెలలకొకసారి పార్ట్, పార్టులుగా రిలీజ్ చేసి మొత్తం ఆల్బంను 2017లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

గోపీచంద్ మలినేని, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకు మ్యూజిక్ చేస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.  

 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs