క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి రమ్య శ్రీ. సుమారుగా ఎనిమిది భాషల్లో నటించిన రమ్యశ్రీ దర్శకురాలిగా మారి సొంతంగా నిర్మించిన చిత్రం 'ఓ మల్లి'. ఎట్టకేలకు ఈ సినిమా ఏప్రిల్ 15న విడుదలవుతుంది. ఈ సందర్భంగా రమ్యశ్రీ విలేకర్లతో ముచ్చటించారు.
''నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు ఒక సిట్యుయేషన్ చూశాను. అది నా మైండ్ లో అలా ఉండిపోయింది. ఇక నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత అదే పరిస్థితిని కథగా మలిచి సినిమా చేయాలనుకున్నాను. 10 సంవత్సరాలుగా ఈ సినిమా చేయాలనేది నా ఆలోచన. ప్రస్తుతం ఉన్న ఆడవాళ్ళు ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటున్నారనే కాన్సెప్ట్ తో సినిమా చేశాను. నేనొక గిరిజన యువతి పాత్రలో నటించాను. ఇప్పటివరకు ఎవరు ఇలాంటి పాత్రలో నటించలేదు. ఏ నటి కూడా ఇలాంటి పెర్ఫార్మన్స్ చేయలేదు. సినిమా చూసిన వాళ్ళందరూ.. బావుందని అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిన తరువాత కూడా రిలీజ్ చేయడానికి లేట్ అయింది. నా వ్యక్తిగత కారణాల వలన, సినిమాకు థియేటర్స్ దొరకకపోవడం వలనే వాయిదా వేశాను. సుమారుగా 100 థియేటర్లలో ఏప్రిల్ 15 న సినిమా రిలీజ్ చేస్తున్నాను. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో సినిమా రిలీజ్ అవుతోందని'' తెలిపారు.