Advertisement
Google Ads BL

డైరెక్షన్ లో పవన్ ఇన్వాల్వ్ కాలేదు: బాబీ


అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి 'బాడీ గార్డ్','మిస్టర్ పెర్ఫెక్ట్','డాన్ శీను' వంటి చిత్రాలకు స్క్రీన్ రైటర్ గా పని చేసి 'పవర్' సినిమాతో దర్శకుడిగా మారాడు కె.ఎస్.రవీంద్ర(బాబీ). ఒక్క సినిమాతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. బాబీ, పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వస్తోన్న 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ఏప్రిల్ 8న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబీతో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

స్క్రిప్ట్ ను అడాప్ట్ చేసుకున్నాను..

నేను డైరెక్ట్ చేసిన 'పవర్' సినిమా 2014 సెప్టెంబర్ లో రిలీజ్ అయింది. అదే సంవత్సరం నవంబర్ లో నిర్మాత శరత్ మరార్ దగ్గర నుండి నాకు ఫోన్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారితో సినిమా అనగానే నాకు కలలా అనిపించింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు నేను కలనే అనుకున్నాను. కళ్యాణ్ గారు చెప్పిన స్క్రిప్ట్ ను అడాప్ట్ చేసుకోవడానికి సుమారుగా నాకు 5 నెలలు సమయం పట్టింది. 2015 ఏప్రిల్ లో షూటింగ్ మొదలు పెట్టాం. ఈ సంవత్సరం ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నాం. సినిమా చేయడానికి సంవత్సరంన్నర కాలం పట్టింది.

మొదట భయపడ్డాను..

కళ్యాన్ గారు కథ చెప్పే ముందు చాలా భయపడ్డాను. గబ్బర్ సింగ్ పేరుతో సినిమా వస్తోంది. ఆ సినిమాకు మించి ఈ కథ ఉండాలి. కాని కథ విన్న వంటనే తృప్తిగా అనిపించింది. పెద్ద స్పాన్ ఉన్న సినిమా. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. 

రచయితగా హెల్ప్ చేశారు..

ఈ సినిమా దర్శకత్వం విషయంలో కళ్యాన్ గారు ఇన్వాల్వ్ అయ్యారని వార్తలు వినిపించాయి. రచయితగా ఆయన సినిమా చిత్రీకరణ సమయంలో నాకు ఎంతో హెల్ప్ చేశారు. కాని డైరెక్షన్, ఫోటోగ్రఫీ పనుల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. డైరెక్టర్ గా నాకు చాలా ఫ్రీడం ఇచ్చారు. 

ఆయనకు భరించాల్సిన అవసరం లేదు..

కళ్యాన్ గారికి నాకు వేవ్ లెంగ్థ్స్ మ్యాచ్ కాకపోతే ఆయనకు నన్ను భరించాల్సిన అవసరం లేదు. వెంటనే వేరే నిర్ణయం తీసుకుంటారు. కాని మాకు ఆ సమస్య రాలేదు.

ట్రైలర్ లోనే కథ చెప్పాలనుకున్నాం..

కళ్యాన్ గారి సినిమా అంటే విపరీతమైన అంచనాలు ఉంటాయి. అందుకే ఒక లైన్ లో కథ చెప్పాలని ట్రైలర్ కట్ చేశాం. విజువల్ గా థియేటర్ లో ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వాలని అలా చేశాం. బాలీవుడ్, హాలీవుడ్ లలో ఇదే ప్రాసెస్ ను ఫాలో అవుతూ ఉంటారు. కథ చెప్పకుండా మాయ చేయొచ్చు కాని అలా చేయాలని మేము అనుకోలేదు. 

ఏప్రిల్ రిలీజ్ అనగానే టెన్షన్ పడ్డాం..

2015 ఏప్రిల్ నుండి 2016 జనవరి వరకు సినిమా షూటింగ్ ఆడుతూ పడుతూ చేశాం. జనవరిలో కళ్యాన్ గారు పిలిపించి ఏప్రిల్ లో మానం సినిమా ఎందుకు రిలీజ్ చేయకూడదని అడిగారు. నేను, శరత్ గారు టెన్షన్ పడ్డాం. కాని ఒకసారి నమ్మి చూద్దామని తొందరగా పనులు చేయడం మొదలుపెట్టాం. నిర్విరామంగా సినిమాను చిత్రీకరించాం. రీసెంట్ గా సెన్సార్ కి వెళ్లాం. సాంగ్స్ బ్యాలన్స్ ఉన్నాయనే మాట అవాస్తవం. నిన్ననే స్విట్జర్ ల్యాండ్ లో సినిమా పాటలు షూటింగ్ అయిపోయాయి. దాన్ని ఎప్పటికప్పుడు ఎడిట్ కూడా చేసేసాం. సెన్సార్ సభ్యుల నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

కళ్యాణ్ గారిచ్చే బలం వేరేగా ఉంటుంది..

పవన్ కళ్యాణ్ తో కలిసి వర్క్ చేయడం అంత సులువు కాదు. ఆయనతో పని చేసిన తరువాత నాలో సహనం పెరిగింది. ఆయన్ను తట్టుకుంటే వచ్చే కిక్కే వేరు. ఆయన అప్రిసియేషన్, పొగడ్త, బలం వేరేగా ఉంటుంది. నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. ఆయన దగ్గరకు వెళ్లి పవన్ కళ్యాన్ గారు బాబీ చాలా బాగా డైరెక్ట్ చేస్తున్నాడని.. నువ్వు కూడా తనతో సినిమా చెయ్ అన్నయ్యా అని చెప్పారంట. అదే పెద్ద అప్రిసియేషన్ నాకు.

హిందీలో చేయాలనేది ఆయన ఆలోచనే..

ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయాలని కళ్యాన్ గారు, ప్రొడ్యూసర్ శరత్ గారు అనుకున్నారు. దానికోసం ప్రత్యేకంగా ఒక టీం ను కూడా నియమించాం.

కలిసిన 15 నిమిషాలకే చెప్పేశారు..

కళ్యాన్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలనుకున్నాను. కాని ఆయనను కలిసిన 15 నిమిషాలకే నువ్వే సినిమా డైరెక్టర్ అని చెప్పారు. ఆ సమయంలో కూడా కళ్యాన్ గారు తన ఫాం హౌస్ లో మొక్కలను నాటుతున్నారు. 

రవితేజ గారికే చెప్పాను..

ఈ సినిమాకు డైరెక్టర్ గా కన్ఫర్మ్ అయిన వెంటనే నేను మొదట రవితేజ గారినే కలిశాను. ఆయన నన్ను సొంత తమ్ముడుగా చూస్తారు. చాలా సంతోషించారు.

పవన్ గారి దగ్గరే నేర్చుకున్నాను..

కళ్యాన్ గారు మల్టీ టాస్కింగ్ పెర్సన్. సినిమాలో నటిస్తూనే.. ప్రజల సమస్యల గురించి కూడా ఆలోచిస్తారు. నేను ఆయన దగ్గర నేర్చుకున్న విషయమేమిటంటే మల్టీ టాస్కింగ్.

అలాంటి డైలాగ్స్ లేవు..

ఈ సినిమాలో ప్రత్యేకంగా పొలిటికల్ డైలాగ్స్ అయితే లేవు. కాని ఆయనొక పార్టీకు లీడర్ కాబట్టి వినేవారికి డైలాగ్స్ అలా కనెక్ట్ అవ్వొచ్చు.

చిరుని టచ్ చేయాలనుకున్నాం..

ఈ సినిమాలో చిరు గారిని టచ్ చేసేలా ఏదైనా చేయాలనుకున్నాం. చిరంజీవి గారి పాట చూపించాలనుకున్నాం. ఆయన చేసిన వీణ స్టెప్ బాగా ఫేమస్. ఆ స్టెప్ కళ్యాన్ గారు చేస్తే ఎలా ఉంటుందో.. స్క్రీన్ మీద చూపించాం.

బోర్ కొట్టే వరకు అవే చేస్తా..

నా డైరెక్షన్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ తో ఉండే మాస్ మసాలా ఫిల్మ్స్ చేస్తాను. అవి బోర్ కొడితే అప్పుడు ఆలోచిస్తాను..

రెస్ట్ తీసుకుంటా..

ఈ సినిమా తరువాత ఒక నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. నా భార్యకు కాస్త టైం కేటాయించాలని అనుకుంటున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs