Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ-నారా రోహిత్


'బాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన హీరో నారా రోహిత్. మొదటినుండి పాత్రల ఎంపికలో వైవిధ్యత చూపిస్తూ... తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నారా రోహిత్ నటించిన 'తుంటరి' సినిమా మార్చి 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

నేను ఇప్పటివరకు చేయని జోనర్ ఇది..

తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాను తెలుగులో 'తుంటరి' పేరుతో రీమేక్ చేస్తున్నాం. ఇప్పటివరకు నేను చేయని జోనర్ ఇది. ఫుల్ లెంగ్థ్ ఎంటర్టైనర్. తమిళంలో ఈ సినిమా చూడగానే చాలా నచ్చింది. పాత్రను ప్రేమించి నటించాను. కథలో ఫాంటసీ ఎలిమెంట్ హైలైట్ అవుతుందనే సినిమా చేశాం. 

మార్పులు చేశాం..

ఒరిజినల్ సినిమా కథకు మా సినిమాకు చాలా మార్పులు చేశాం. కంప్లీట్ లవ్ ట్రాక్ ను చేంజ్ చేశాం. అలానే ఎమోషనల్ కంటెంట్ ఇంకాస్త పెంచాం. 

ప్రొఫెషనల్ బాక్సింగ్ కాదు..

ఈ సినిమాలో బాక్సర్ గా కనిపిస్తాను. కాని సినిమాలో అది పార్ట్ మాత్రమే. నిజమైన బాక్సర్ ను కాదు. కొందరు అలా అపార్ధం చేసుకుంటారు. బాక్సింగ్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. ఆథెంటిక్ బాక్సింగ్ కాదు. సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.

కుమార్ కు టాలెంట్ ఉంది..

కుమార్ డైరెక్ట్ చేసిన 'జోరు' సినిమా ఫ్లాప్ అయిందని ఆయనతో సినిమా చేయడం రిస్క్ అనుకోను. ఆయన డైరెక్ట్ చేసిన 'గుండెల్లో గోదారి' సినిమాను ప్రేక్షకులు ఆదరించారు కదా.. తనలో మంచి టాలెంట్ ఉంది. సినిమాను తీయగలిగే సామర్ధ్యం ఉంది. ఈ సినిమాను కూడా చాలా బాగా తీశాడు.

నాకు ఎలాంటి కన్ఫ్యూషన్ లేదు..

వరుసగా సినిమాలు చేస్తున్నానని నేను ఎలాంటి కన్ఫ్యూషన్ లో పడలేదు. ప్రతి పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. అంతేకాకుండా నేను డైరెక్టర్స్ తో ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటాను. సో.. నాకు ఎలాంటి సమస్య ఉండదు. ఇదివరకు సంవత్సరానికి ఒక సినిమా చేసేవాడ్ని. అప్పుడు కూడా ఎక్కువ సినిమాలు చేయాలనుకునేవాడ్ని. కాని ఇప్పుడు టైం కుదిరింది అంతే..

రెండు వారాల గ్యాప్ ఉంటే సరిపోతుంది.. 

ఈరోజుల్లో సినిమా లైఫ్ రెండు వారాలు మాత్రమే. కాబట్టి సినిమా సినిమాకు మధ్య రెండు వారాలు గ్యాప్ ఉంటే సరిపోతుంది. నా సినిమాలు కూడా అలానే రిలీజ్ చేస్తున్నాను. మార్చి 11న ఈ సినిమాను రిలీజ్ చేస్తుంటే.. మార్చి 25న మరో సినిమాను రిలీజ్ చేస్తున్నాను. అయినా.. ఏ సినిమాకు ఆ సినిమా ప్రత్యేకత ఉంటుంది.

పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు..

మా పెదనాన్న ముఖ్యమంత్రి కదా అని నేను అనుకున్నట్లుగా ఏది జరిపించలేను కదా..! పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే రాజమౌళి, పెద్ద పెద్ద దర్శకులతో పని చేస్తూ ఉండేవాడిని. నేను కథలను నమ్ముతాను. కథ నచ్చితేనే సినిమాల్లో నటిస్తాను. 

సిక్స్ ప్యాక్ చేయాలి..

ఇది వరకు సిక్స్ ప్యాక్ చేస్తానని చెప్పాను కాని చేయలేదు. కాని జూన్ నుండి ఓ సినిమా మొదలవుతుంది. ఆ సినిమా కోసం ఖచ్చితంగా నా బరువు తగ్గించాలి. లేదంటే ఆ సినిమా చేయలేము. నేను అంగీకరించిన సినిమాలన్నీ మే చివరి వారానికి పూర్తవుతాయి కాబట్టి జూన్ నాటికి నేను సిక్స్ ప్యాక్ ఖచ్చితంగా చేయాలి.

ఇప్పుడు పెళ్ళంటే విడాకులే..

నేను చాలా సినిమాలు కమిట్ అయి ఉన్నాను. ఈ సమయంలో పెళ్లి చేసుకుంటే విడాకులు ఇచ్చేస్తారు(నవ్వుతూ..).కాబట్టి ఈ సంవత్సరంలో మాత్రం పెళ్లి ప్రస్తావన ఉండదు.

ఏ పాత్ర అయినా చేస్తా..

బాలకృష్ణ గారి సినిమాలో నటిస్తున్నానని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆ విషయంలో నాకు ఇంకా క్లారిటీ లేదు. కాని సినిమాలో నటించమని అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తా.. ఏ పాత్ర అని కూడా ఆలోచించను.

నేనెప్పుడు జాగ్రత్తగానే మాట్లాడతా..

నాకు చిన్నప్పటినుండి తక్కువ మాట్లాడడం అలవాటు. మాట్లాడే పదాల్లో చాలా పర్టిక్యులర్ గా ఉంటాను. అందరి అటెంన్షన్ మన మీద ఉన్నప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. 

నాకు బాగా నచ్చిన పాత్ర..

సావిత్రి సినిమాలో పాత్ర నాకు బాగా దగ్గరైన క్యారెక్టర్. తుంటరి సినిమాలో మాత్రం కష్టపడి నటించాను. అలానే 'అప్పట్లో ఒకడుండేవాడు' నేను బాగా స్ట్రెస్ ఫీల్ అయి చేసిన సినిమా.

ఈ సినిమాలో డాన్సులు చేశా..

ఈ సినిమాలో సుమారుగా అన్ని పాటల్లో డాన్సులు చేశాను. చేయక తప్పలేదు(నవ్వుతూ..)

నెక్స్ట్ ఫిల్మ్స్..

సావిత్రి సినిమా త్వరలోనే విడుదల కానుంది. 'పండగలా వచ్చాడు' సినిమా జూన్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలానే 'అప్పట్లో ఒకడుండేవాడు','నీది నాది ఒకే కథ' సినిమాలు చిత్రీకరణ పూర్తవుతున్నాయి. ఈ సినిమాల తరువాత మరో ఆరు స్క్రిప్ట్స్ ఫైనలైజ్ చేశాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs