Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ: వామికా


'భలే మంచి రోజు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన నటి వామికా గబ్బి. తొలి చిత్రంతోనే హిట్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. బాల‌కృష్ణ కోలా, వామికా జంట‌గా గీతాంజ‌లి శ్రీరాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'న‌న్ను వ‌ద‌లి నీవు పోలేవులే'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ వామికాతో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

తమిళంలో మంచి రెస్పాన్స్ వస్తోంది..

ఈ సినిమాలో తమిళంలో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా నా పెర్ఫార్మన్స్ కు మంచి ఆదరణ లభించింది. అదే విధంగా తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.

డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించా..

ఈ సినిమాలో నా పాత్ర పేరు మనోజ. మోడరన్ గా ఉండే అమ్మాయి. కాని ట్రెడిషనల్ గా ఆలోచిస్తుంటుంది. పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాను. 'నన్ను వదిలి నీవు పోలేవులే' సినిమా పెళ్లి బంధానికి సంబంధించిన కథ. సంక్లిష్టమైన ప్రేమకథ, ఎమోషన్స్ సినిమాలో ఉంటాయి. చాలా రియలిస్టిక్ గా ఉంటుంది.

కథలో భాగంగా ఉంటాయి..

సినిమా కథ అమేజింగ్ గా ఉంటుంది. అనవసరమైన సన్నివేశాలు, పాటలు, రోమాన్స్ ఉండవు. అన్ని కథలో భాగంగా ఉంటాయి. ఈ సినిమాకు లేడీ డైరెక్టర్ కావడంతో నాకు వర్క్ చేయడం చాలా సులువు అనిపించింది. ఆమెతో అన్ని డిస్కస్ చేసేదాన్ని. లేడీ డైరెక్టర్ కావడం వలన అదొక ప్లస్ పాయింట్. 

మొదట ఈ అవకాసం వొదులుకున్నా..

నిజానికి తెలుగులో ఇది నా మొదటి సినిమా కావాల్సింది. భలే మంచి రోజు సినిమా కంటే ఈ సినిమా షూటింగ్ ముందు జరిగింది. మొదట ఈ సినిమాలో నటించమని అవకాసం వచ్చినప్పుడు నటించకూడదని అనుకున్నాను. నేను పంజాబీ, హిందీ చిత్రాలలో నటించాను. నాకు సౌత్ గురించి అవగాహన లేదు. భాష రాదు. డైలాగ్స్ చెప్పడానికి నాకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశ్యంతో అసలు సౌత్ సినిమాలో నటించకూడదు అనుకున్నాను. ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఒకసారి ఆడిషన్ ఇచ్చి వెళ్ళండి.. నచ్చితేనే నటించండి లేకపోతే లేదు అనడంతో ఆడిషన్ ఇవ్వడానికి వచ్చాను. సెల్వ రాఘవన్ సర్ కి నా నటన నచ్చడంతో సినిమాలో నటించడానికి అంగీకరించాను. ప్లాన్ చేసుకొని అయితే ఏది చేయలేదు. 

నటన పరంగా ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి..

స్టార్ హీరోయిన్ గా నాకు పేరు తెచ్చుకోవాలనే ఆశ లేదు. మంచి పాత్రల్లో నటించాలి. పెర్ఫార్మన్స్ పరంగా ప్రేక్షకులు నన్ను గుర్తుపెట్టుకోవాలి. నాకంటే నా పాత్ర గుర్తుంటే నేను చాలా సంతోషంగా భావిస్తాను. 

నా రెండు చిత్రాలకు మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు..

నిర్మాత కోలా భాస్కర్ గారు నన్ను ఫ్యామిలీ మెంబర్ లా చూసుకున్నారు. చాలా కూల్ గా ఉంటారు. భలే మంచి రోజు, అలానే ఈ సినిమాకు నిర్మాతలు ఎలా ఉండాలని భావిస్తారో.. అలాంటి నిర్మాతలు దొరికారు.

నా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలి..

నేను నటించే చిత్రాల్లో నా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలి. అలానే కథ నాకు నచ్చాలి. అప్పుడైతేనే నటించగలను. సౌత్ లో నాకు అలాంటి అవకాశాలు బాగా వస్తున్నాయి. ఈ సినిమాలో నా చుట్టూ, హీరో చుట్టూనే కథ నడుస్తుంటుంది. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

మలయాళంలో స్పోర్ట్స్, కామెడీ చిత్రంలో నటిస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs