Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ-అనూప్ రూబెన్స్


కార్తిక్ రాజు, నిత్య శెట్టి, సామ్ ప్రధాన పాత్రల్లో అయాన్ క్రియేషన్స్ బ్యానర్ పై చునియా దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తోన్న చిత్రం 'పడేసావే'. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలయ్యింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

ఆ రెండు కారణాల వలన సినిమా చేశా..

చునియా కథ చెప్పినప్పుడు కథలో ఒక ఫ్రెష్ నెస్ కనిపించింది. నేను మ్యూజిక్ కంపోజ్ చేయడానికి సినిమాలో ఉండే సిట్యుయేషన్స్ నచ్చాయి. అందుకే సినిమా చేయడానికి అంగీకరించాను. ఇదొక మ్యూజికల్ ఫిలిం అని చెప్పొచ్చు. సినిమాలో మొత్తం ఆరు పాటలు, ఒక బిట్ సాంగ్ ఉంటుంది. ఆడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

ఫిమేల్ డైరెక్టర్స్ లో సెన్సిటివిటీ ఉంటుంది..

మేల్ డైరెక్టర్స్ తో వర్క్ చేసినా.. ఫిమేల్ డైరెక్టర్స్ తో వర్క్ చేసినా ఒకలానే ఉంటుంది. కాకపోతే లేడీ డైరెక్టర్స్ లో సెన్సిటివిటీ ఉంటుంది. ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేసే విధానం నీట్ గా ఉంటుంది. 

కథ నచ్చే చేశా..

ఈ సినిమాకు నాగార్జున గారు అసోసియేట్ అయ్యారని నేను ఈ సినిమా చేయలేదు. నేను అన్నపూర్ణ స్కూల్ స్టూడెంట్ ని. 'మనం' సినిమాతో నాగ్ సర్ తో మంచి ర్యాపో కుదిరింది. ఆ సినిమాతోనే చునియా గారు పరిచయమయ్యారు. ఈ సినిమా చేస్తే బావుంటుందని చునియా అడిగినప్పుడు కథ వింటాను.. నచ్చితే ఖచ్చితంగా చేస్తానని చెప్పాను. కథ నచ్చింది.. సినిమా చేశాను.

పెద్ద సినిమాలకు ఆ ఫ్రీడం ఉండదు..

పెద్ద సినిమాలకు పని చేయడమంటే స్టార్ హీరో ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని చేయాలి. అక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి. చిన్న సినిమాలకు పని చేయడంలో ఫ్రీడం ఉంటుంది. పెద్ద సినిమాలకు ఫ్రీడం ఉండదని నేను చెప్పట్లేదు.. కాని హీరో ఇమేజ్ మాత్రం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నాకు కొన్ని సౌత్ మెలోడీస్ చేయాలనిపిస్తుంది. అలాంటి అవకాశాలు చిన్న సినిమాల్లో దొరుకుతాయి.

నాగార్జున గారు అభినందించారు..

నాగార్జున గారు నేను ఈ సినిమా చేస్తున్నానని తెలుసుకొని 'వెరీ గుడ్' అనూప్ అని చెప్పారు. చిన్న సినిమా అని కమర్షియల్ గా ఆలోచించకుండా మంచి పని చేస్తున్నావని అభినందించారు. ఆయన సినిమా మొత్తం చూశారు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుందని చెప్పారు.

అమ్మతో లోగో లాంచ్ చేయాలనుకున్నా..

ఎప్పటినుండో నాకు ఒక లోగో ఉంటే బావుంటుందనుకున్నాను. అది కూడా మా అమ్మతో లాంచ్ చేయించాలనుకున్నాను. కాని దురదృష్టవశాత్తు ఆమె మరణించారు. నాగ సుశీల గారు ఆ లోగో లాంచ్ చేయడం కంఫర్ట్ గా అనిపించింది. 

ఈ సంవత్సరంలో సొంత ఆల్బం చేస్తా..

నా సొంత ఆల్బం చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. కాని హెక్టిక్ షెడ్యూల్స్ వలన చేయడం కుదరట్లేదు. ఈ సంవత్సరంలో ఆల్బం చేయాలనుకుంటున్నాను.

ఆ గిఫ్ట్ చూసి ఏడుస్తూ.. ఉండిపోయా..

2015 లో జరిగిన నా పుట్టినరోజుకి అమ్మ ఇచ్చిన కానుక చూసి 10 నిమిషాల పాటు ఏడుస్తూ.. ఉండిపోయాను. మ్యూజిక్ డైరెక్టర్ గా నా  కెరీర్ మొదలవ్వక ముందు నుండి నా పుట్టినరోజు వరకు నా లైఫ్ లో జరిగిన ప్రతి ఇంటర్వ్యూని పదిల పరిచి ఒక ఫైల్ మాదిరి చేసి ప్రెజంట్ చేశారు. కాని అదే గిఫ్ట్ అమ్మ ఇచ్చే చివరి గిఫ్ట్ అని అసలు అనుకోలేదు. 'మనం' సినిమాలో 'కనిపెంచినా.. మా అమ్మకు' అనే పాట అంటే అమ్మకు చాలా ఇష్టం.

నేను చేసింది ఒక్క శాతమే..

కెరీర్ పరంగా తృప్తిగా లేదు. నేను చేసింది ఒక్క శాతం మాత్రమే. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఖచ్చితంగా చేస్తాను. టైం కూడా దానికి సహకరించాలి. 

'పడేసావే' క్లీన్ ఎంటర్టైనర్..

పడేసావే సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికేట్ వచ్చింది. స్నేహం, ప్రేమ రెండు ఈ సినిమాలో ఉంటాయి. స్నేహం కోసం ఏదైనా చేయొచ్చని సినిమాలో చూపించాం. ఫుల్ ప్యాకేజ్డ్ ఫిలిం. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

సుశాంత్ హీరోగా నటిస్తోన్న సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. మరో రెండు ప్రాజెక్ట్స్ ప్రొడక్షన్ లో ఉన్నాయంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs