Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ-నరసింహ నంది


'1940 లో ఒక గ్రామం' అనే మొదటి సినిమాతో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న దర్శకుడు నరసింహ నంది. ఆ తరువాత 'హై స్కూల్','కమలతో నా ప్రయాణం' లాంటి చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు తాజాగా 'లజ్జ' అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. ఫిబ్రవరి 5న రిలీజ్ అయిన ఈ సినిమా గురించి నరసింహ నంది విలేకర్లతో ముచ్చటించారు.

Advertisement
CJ Advs

ఆలోచించే వాళ్ళకే ఈ సినిమా..

నేను కొన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేసి సినిమా చేస్తాను. మనుషుల్లో రెండు రకాలుంటారు. ఆలోచించే వాళ్ళు, ఆలోచించని వాళ్ళు. నా సినిమా ఎక్కువగా చదువుకున్న వాళ్లకి, ఇంగ్లీష్ సినిమాలు బాగా చూసేవారికి, ఎక్కువ ఆలోచించే వాళ్లకి మాత్రమే నచ్చుతాయి. రొటీన్ గా నాలుగు పాటలు, ఫైట్స్ ఉండే సినిమాలు చేయడం నాకు నచ్చదు. కొత్త కథలు అసలు రావట్లేదు. డిఫరెంట్ గా ఆలోచించి 'లజ్జ' అనే సినిమాను తెరకెక్కించాను.

డబ్బు కోసం సినిమా చేయను..

నా దృష్టిలో కమర్షియల్ హిట్ అంటే పెట్టుబడి తిరిగి వస్తే చాలు. సినిమా సక్సెస్ అయినట్లే. ఈ సినిమా కోసం చాలా తక్కువ పెట్టుబడి అనుకునే నిర్మించాం. మేము, సినిమా కొనుక్కున్న వారు సంతోషంగానే ఉన్నారు. ఇది వరకు బాలచందర్, బాపు, భారతీరాజా తక్కువ బడ్జెట్ లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసేవారు. అలానే మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాను తక్కువ బడ్జెట్ లో సినిమా చేయాలని బాగా ప్రెజంట్ చేయడానికి ట్రై చేశాం.

సినిమా ప్రేక్షకులు చూడాలనే చేస్తాను..

ప్రేక్షకులు చూడడానికే సినిమాలు చేస్తాను. అవార్డు కోసం సినిమాలు చేయను. ఈ సినిమా చేస్తే అవార్డు వస్తుందని సినిమా మొదలు పెట్టను. మంచి కథను ప్రేక్షకులకు అర్ధమయ్యేలా సినిమా చేయాలని మొదలుపెడతాను. అయితే మంచి థియేటర్స్ లో సినిమా పడితే అందరూ చూస్తారు. కాని మల్టిప్లెక్స్ లలో సినిమా రిలీజ్ చేయలేకపోవడం వలనే సమస్య వస్తోంది. నా తరఫున చేసే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. కాని థియేటర్ల దగ్గరకు వచ్చేసరికి ప్రాబ్లం వస్తోంది. 

మంచి రెస్పాన్స్ వస్తోంది..

పెళ్ళికి ముందు అమ్మాయి తప్పు చేసిందంటే అది తండ్రి పొరపాటు. పెళ్ళైన తరువాత తప్పు చేస్తే అది భర్తే తప్పనే చెప్పాలి. భార్య భర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవల వలన జీవితాలు నాశనమైపోతున్నాయి. ఆ సమయంలో అమ్మాయికి నచ్చిన వారితో తన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకోవడం. అక్కడ కూడా సంతోషంగా ఉండలేకపోవడం. చివరకు తన జీవితం ఏం అయిందో అనేదే ఈ 'లజ్జ' సినిమా. సమాజంలో ఉన్న ఆధిపత్యం గురించి చెప్పాను. చలం గారి మైదానం నవల ఆధారంగా సినిమాను రూపొందించాను.

హిందీ లో చేయమన్నారు..

ఈ సినిమా చేస్తున్నానని తెలిసిన ఓ హిందీ చిత్ర నిర్మాత బాలీవుడ్ లో ఈ సినిమా చేయమని అడిగారు. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు మరోసారి చేయలేను. రిస్క్ తో కూడుకున్న పని. రెండు సంవత్సరాలుగా స్ట్రగుల్ అయ్యి ఈ సినిమా చేశాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

'బుడ్డారెడ్డి పల్లి బ్రేకింగ్ న్యూస్' అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఉండే సినిమా. ఒక బర్రెకు సంబంధించిన సినిమా. మరో మూడు నెలల్లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs