Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ-శ్రీనివాస్ గవిరెడ్డి


రాజ్ తరుణ్, అర్థన జంటగా శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్ బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మించిన చిత్రం 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు'. ఈ చిత్రంతో శ్రీనివాస్ గవిరెడ్డి అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే ఆర్టిస్ట్స్ ను హ్యాండిల్ చేసే విధానం, తన కామెడీ డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. జనవరి 29 న రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్బంగా దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డితో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

నేపథ్యం..

నేను పుట్టింది, పెరిగింది నర్సీపట్నంలోనే(వైజాగ్). చిన్నప్పటినుండి చిరంజీవి గారంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. మా ఊరు నుండి వెళ్లి దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమాల్లోకి రావాలనుకున్నాను. మాది మధ్యతరగతి కుటుంబం. ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోయినా ఎలా అయినా డైరెక్టర్ అవ్వాలనే పట్టుదలతో ఇంటి నుండి బయటకి వచ్చేశాను. హైదరాబాద్ రాగానే కృష్ణానగర్ కష్టాలు తప్పలేదు. 2007 లో వచ్చిన 'నగరం' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. ఆ తరువాత దర్శకుడు మదన్ గారితో కలిసి ట్రావెల్ చేశాను. బన్నీ దగ్గర ఓ సంవత్సరం పాటు పని చేశాను. వ్యక్తిగతంగా ఎంతో సహాయం చేశారు. కథ, స్క్రిప్ట్ ఎలా రాయాలనే అంశాల్లో సలహాలు ఇచ్చేవారు.     

ఫ్యామిలీతో చూసే సినిమా చేయాలనుకున్నాను..

కొత్త కథ తీసుకొని చేయాలనుకోలేదు. కాని నేను అనుకున్న కథను కొత్తగా ప్రెజంట్ చేయాలనుకున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో చిన్ననాటి ప్రేమకథ ఉంటుంది. నా లైఫ్ లో కూడా ఉంది. అమ్మాయి బాధపడిందని తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ను వదిలేసిన అబ్బాయి తన ప్రేమ కోసం మళ్ళీ అదే క్రికెట్ ఆడతాడు. ఈ అంశాలను ఆధారంగా చేసుకొని కామెడీను, ఫ్యామిలీ ఎమోషన్స్ ను జోడించి సినిమా తీశాను. సెంటిమెంట్, ఎమోషన్ అందరికీ కనెక్ట్ అయ్యింది. ప్రేక్షకులు డిజప్పాయింట్ కాలేదు. 

మంచి రెస్పాన్స్ వస్తోంది..

కామెడీ బాగుంది. గ్రామీణ నేపథ్యంలో సినిమా కావడంతో కుటుంబమంతా కలసి సినిమాకు వెళ్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో క్రికెట్ ఎపిసోడ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని ఏరియాల నుంచి సినిమాకు మంచి స్పందన వస్తోంది. 

ప్రొడ్యూసర్స్ హ్యాపీ..

ముందు సంగీత దర్శకుడు గోపిసుందర్ చెప్పిన కథను చెప్పినట్టు తీశావని కాంప్లిమెంట్ ఇచ్చారు. అనుకున్న బడ్జెట్ లో అనుకున్న విధంగా సినిమా తీశాను. నిర్మాతలు చాలా హ్యాపీ. మల్టీప్లెక్స్ ధియేటర్లలో కాస్త మిశ్రమ స్పందన వచ్చింది. బి, సి సెంటర్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కలెక్షన్స్ బాగున్నాయి. 

తన కోసమే కథ రాసుకున్నా..

ఈ కథను రాజ్ తరుణ్ ని దృష్టిలో పెట్టుకొని రాశాను. 'సినిమా చూపిస్తా మావ' సమయంలో తనకు కథ చెప్పాను. ఐడియా నచ్చి ఓకే చెప్పాడు. చాలా రోజుల నుంచి తరుణ్, నేను స్నేహితులం. నాపై నమ్మకంతో నేను ఏం చెప్తే, అది చేశాడు. విడుదల తర్వాత తరుణ్ చాలా హ్యాపీగా ఉన్నాడు.      

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

'గరం' సినిమాకు కథ మాటలు అందించాను. అది ఫిబ్రవరి 12న విడుదల అవుతుంది. ఫ్యూచర్ లో నేను చేసే ప్రాజెక్ట్స్ కొత్తగా ఉంటాయని చెప్పను కాని కమర్షియల్ ఫార్మాట్ లో ఉండే కథలను తెరకెక్కిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs