Advertisement
Google Ads BL

హారర్ అంటే భయం కాని నటిస్తాను: హన్సిక


సిద్ధార్థ్, త్రిష, హన్సిక, పూనమ్ బాజ్వా, సుందర్.సి ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందించిన 'అరన్మణి 2' చిత్రాన్ని సర్వాంత రామ్ క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై జవ్వాజి రామాంజనేయులు సమర్పకుడుగా 'కళావతి' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. సుందర్.సి దర్శకుడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 29న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ హన్సిక మంగళవారం హైదరాబాద్ లోని విలేకర్లతో ముచ్చటించారు. 

Advertisement
CJ Advs

'చంద్రకళ' కు సీక్వెల్ గా..

అరణ్మని పార్ట్ 1 ఆఫర్ వచ్చినపుడు నేను నటించగలనా..? అనే అనుమానం ఉండేది. కాని సుందర్ సర్ నువ్వు చేయగలవు హన్సిక అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. నా హృదయానికి దగ్గరగా ఉండే పాత్ర అది. మొదటిసారిగా అందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించాను. తెలుగులో 'చంద్రకళ' పేరుతో రిలీజ్ అయిన ఆ సినిమా మంచి హిట్ అయింది. దానికి సీక్వెల్ గా వస్తోన్న ఈ చిత్రం 'కళావతి' పేరుతో జనవరి 29 న రిలీజ్ చేస్తున్నారు. 

గర్భవతిగా నటించాను..

ఈ సినిమాలో నేను గర్భవతిగా కనిపిస్తాను. ఆ పాత్రలో మొదటిసారిగా నటిస్తున్నాను. ఎలా కూర్చోవాలి..? ఎలా నడవాలి..? ఇలా ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకొని నటించాను. సుందర్ గారు కొన్ని సీన్స్ లో చాలా బాగా నటించావని చెప్పారు. నా బెస్ట్ కాంప్లిమెంట్స్ అవి. ఈ సినిమాలో నాకు ఇంటెంన్స్ సీన్స్ ఉంటాయి. 

ఈ సినిమాలో మేమిద్దరమే కామన్..

చంద్రకళ సినిమాకు ఈ సినిమాకు కామన్ నేను సుందర్ సర్. మిగిలిన వారంతా కొత్త వాళ్ళే. ఇదొక హారర్, కామెడీ ఫిలిం. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీశారు. డిఫరెంట్ స్క్రిప్ట్. 

తనతో నాకు ఎలాంటి గొడవలు లేవు..

ఈ సినిమాలో నాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కలిసి నటిస్తున్నారు. పూనమ్ కి నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. ఈ సినిమా ఒప్పుకున్న దగ్గర నుండి త్రిషకు నాకు మధ్య క్యాట్ ఫైట్స్ అవుతున్నాయని బయట గాసిప్స్ వినిపిస్తున్నాయి. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. తనతో నాకు ఎప్పటినుండో మంచి పరిచయం ఉంది. తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. 

'సంథింగ్ సంథింగ్' రెండో షెడ్యూల్ లా అనిపించింది..

సిద్ధార్థ్, సుందర్ సర్ లతో నాకు ఇది మూడవ సినిమా. ఇదివరకే సిద్ధార్థ్, నేను, సుందర్ సర్ కలిసి సంథింగ్ సంథింగ్ సినిమా చేశాం. ఈ సినిమా చేస్తున్నంత సేపు 'సంథింగ్ సంథింగ్' రెండో షెడ్యూల్ లా అనిపించింది. వాళ్ళిద్దరితో కలిసి మరోసారి వర్క్ చేయడం ఆనందంగా ఉంది.

తమిళంలో స్క్రిప్ట్స్ నచ్చుతున్నాయి..

తెలుగులో కంటే నాకు తమిళంలో వచ్చే స్క్రిప్ట్స్ బాగా నచ్చుతున్నాయి. అందుకే అక్కడే ఎక్కువ చిత్రాల్లో నటిస్తున్నాను. నాకు స్క్రిప్ట్ నచ్చి డేట్స్ కుదిరితే ఖచ్చితంగా తెలుగులో కూడా నటిస్తాను. ప్రస్తుతం నాకు తెలుగు, తమిళం రెండు భాషలు అర్ధమవుతాయి. కాని మాట్లాడలేను.

హారర్ సినిమాలంటే భయం..

13 సంవత్సరాల తరువాత నేను చూసిన హారర్ సినిమా 'చంద్రకళ'. ఆ తరువాత మరో సంవత్సరం గ్యాప్ లో 'కళావతి' చూశాను. నాకు హారర్ సినిమాలు చూడాలంటే చాలా భయం. కాని నటించగలను. 

గాసిప్స్ పట్టించుకోను..

నేను ఎలా నటిస్తున్నానని నా వర్క్ గురించి మాట్లాడితే ఓకే కాని నా పెర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం నచ్చదు. గాసిప్స్ మాట్లాడుకునే వాళ్ళు చాలా అనుకుంటారు. కాని అందులో నిజం ఉండదు. నా మీద వచ్చే గాసిప్స్ ను క్లియర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. చేయాలనుకుంటే నా ట్విట్టర్ ద్వారా తెలియజేస్తాను.

పెయింటింగ్ ఇంట్రెస్ట్..

ఖాళీ సమయాల్లో పెయింటింగ్ చేయడం నా హాబీ. రీసెంట్ గా ఆరడుగుల గురునానక్ ఫోటో పెయింటింగ్ వేశాను. అది మా అమ్మకు గిఫ్ట్ గా ఇచ్చాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ప్రస్తుతం తమిళంలో నాలుగు ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. తెలుగులో ఇంకా ఏది మెటీరియలైజ్ కాలేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs