Advertisement
Google Ads BL

ప్రభాస్ తో లవ్ స్టోరీ తీస్తాను-కృష్ణంరాజు


1966లో వచ్చిన 'చిలక గోరింక' చిత్రం ద్వారా తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమైన ఆరడుగుల అందగాడు ''కృష్ణంరాజు'' 2016తో తన సినీ ప్రస్థానంలో 50 ఏళ్ల మైలురాయిని దాటనున్నారు. జనవరి 20 న ఆయన పుట్టినరోజు సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు. 

Advertisement
CJ Advs

ఇంకా సంతృప్తి లేదు.. 

ఒక నటుడిగా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకూ ఎన్నో వందల పాత్రలు పోషించాను. అత్యద్బుతమైన చిత్రాల్లో నటించాను. కానీ.. ఇప్పటివరకు నాకు నటుడిగా మాత్రం సంతృప్తి లభించలేదు. ఇకపై కూడా లభించకపోవచ్చు. ఈ యాభై ఏళ్లలో చిత్ర పరిశ్రమ నాకు ఎన్నో మరపురాని అనుభూతులను ఇచ్చింది. ఇన్ని చిత్రాల్లో నటించినా.. ఇంకా ఏదో చేయాలనే ఉంటుంది. 

ఆయన కాంప్లిమెంట్ మర్చిపోలేను.. 

స్త్రీ విలువల నేపధ్యంలో నేను నటించి, నిర్మించిన 'కృష్ణవేణి' సినిమా ఫస్ట్ కాపీని మొదట అన్నగారు ఎన్టీయార్ కు చూపించాను. ఇంటర్వెల్ సైతం కాదని ఆయన సినిమాను చూశారు. సినిమా పూర్తయిన తర్వాత అభినందనలతో ముంచెత్తారు. ఆయన జడ్జ్ మెంట్ మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని విడుదల చేశాను. ఒక నటుడిగా నాకు తిరుగులేని గుర్తింపుతోపాటు.. నిర్మాతగా భారీ లాభాలు తెచ్చిపెట్టిన చిత్రమది. 

ప్రస్తుతం ఆ సినిమా పక్కన పెట్టా.. 

నా దర్శకత్వంలో తెరకేక్కిద్దామని 'ఒక్క అడుగు' పేరుతో ఓ సబ్జెక్ట్ రెడీ చేసుకొన్నాను. నేటి విద్యా విధానంలోని తప్పుల్ని తూర్పారబడుతూ ఈ కథను రాసుకొన్నాను. విద్యార్ధులకు కావాల్సింది ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అంతే కానీ.. ఇలా క్లాస్ రూమ్స్ లో కూర్చోబెట్టి బట్టికొట్టించడం వల్ల వాళ్లు నేర్చుకొనేది ఏమీ ఉండదు. అయితే.. ప్రస్తుతం ఈ సినిమాను పక్కన పెట్టాను. 

ప్రభాస్ తో ప్రేమ కథ..

ప్రభాస్ హీరోగా ఓ పవర్ ఫుల్ లవ్ స్టోరీ తెరకెక్కించాలన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. 'బాహుబలి 2' అనంతరం ఈ సినిమా సెట్స్ కు వెళుతుంది. 

ఇమేజ్ అనే చట్రంలో మేము ఇరుక్కోలేదు.. 

'బాహుబలి' వంటి ట్రెమండస్ హిట్ తర్వాత ప్రభాస్ ఓ సాధారణ ప్రేమకథా చిత్రంలో నటిస్తే చూడగలరా అని నన్ను చాలా మంది అడుతున్నారు. ఇమేజ్ అనే చట్రంలో నేను కానీ ప్రభాస్ కానీ ఎప్పుడూ ఇరుక్కోలేదు. "కృష్ణవేణి, అమర దీపం" లాంటి క్లాసికల్ హిట్స్ తర్వాత 'కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ' లాంటి మాస్ మూవీస్ లో నేను నటించాను. అదే విధంగా ప్రభాస్ కూడా 'బాహుబలి' అనంతరం ఒక మంచి ప్రేమకథతో అలరించగలడన్న నమ్మకం ఉంది. 

ప్రభాస్ పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు.. 

'ప్రభాస్ పెళ్లి ఎప్పుడు?' అని గత కొన్నేళ్లుగా అందరూ నన్ను అడుగుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి నాడు పెళ్లి చేసుకుంటానని నాకు ప్రామిస్ చేశాడు. అది లవ్ మ్యారేజా..? లేక పెద్దలు కుదిర్చిందా.? అనేది మాత్రం వాడి నిర్ణయానికే వదిలేశాను. 

సగటు ప్రేక్షకుడి కోసం నా ప్రయత్నం.. 

ప్రభుత్వం సహకారంతో ప్రతి వీధిలో థియేటర్లు ఏర్పరచాలనే ఆలోచన ఉంది. అప్పుడు ప్రతి ఒక్కరికీ సినిమా అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం మల్టీప్లెక్స్ లు జనాల్ని దారుణంగా దోచుకొంటున్నాయి. వారి దోపిడీ నుంచి సగటు ప్రేక్షకుడ్ని ఆదుకోవడం కోసమే ఈ ప్రయత్నం. 

సినిమాలకు నేను దూరం కాను.. 

సినిమాలకు నేనెప్పుడూ దూరమవ్వను. అర్ధవంతమైన పాత్రలు వస్తే.. నటించడానికి నేనెప్పుడూ రెడీ.

ఇక నుండి రాజకీయాలకు 70 శాతం.. 

ప్రస్తుతం బిజెపిలో యాక్టివ్ మెంబర్ గా ఉన్న నేను. ఇకపై క్రియాశీలకంగా రాజకీయాల్లో వ్యవహరించేందుకు సన్నద్ధమవుతున్నాను. ఇకనుంచి నా టైమ్ లో 70% రాజకీయాలకు, 30% సినిమాలకు కేటాయించనున్నాను. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs