Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ-సురభి!


శర్వానంద్, సురభి జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తోన్న చిత్రం 'ఎక్స్ ప్రెస్ రాజా'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సురభితో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి..?

సినిమాలో నా పాత్ర పేరు అమూల్య. పాజిటివ్ గా ఆలోచించే అమ్మాయి. తనకు పెట్స్ అంటే బాగా ఇష్టం. ఒక కుక్క ను పెంచుకుంటూ ఉంటుంది. క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్. నేను ఇప్పటివరకు నటించిన చిత్రాల్లో బెస్ట్ రోల్ ఇదే.

సినిమాలో యాక్షన్ సీన్స్ చేసారంట.. నిజమేనా..?

అవునండీ. నాకొక ఇంట్రడక్షన్ ఫైట్ కూడా ఉంటుంది. ఫైట్ మాస్టర్ జాషువా గారు తన టీం తో కలిసి నాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇంట్రడక్షన్ సీన్ కొంతమంది అబ్బాయిలు, హీరోయిన్ ను టీజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళను కొట్టడం మొదలు పెడుతుంది. సినిమాలో ప్రతి సీన్ కొత్తగా ఉంటుంది. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.

శర్వానంద్ తో కలిసి పని చేయడం ఎలా అనిపించింది..?

శర్వా అధ్బుతమైన నటుడు. తన వర్క్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. నేను తనను మీట్ అవ్వకముందే తను నటించిన అన్ని సినిమాలు చూశాను. 'మళ్ళి మళ్ళి ఇదిరానిరోజు','జర్నీ','రన్ రాజా రన్' ఇలా విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ.. వర్సటైల్ యాక్టర్ అనిపించుకున్నాడు. ఆడియన్స్ కి కూడా అదే నచ్చుతుంది. ఎంతో ఎనర్జీతో పని చేస్తాడు. సినిమాలో మా ఇద్దరి జంట కొత్తగా, ఫ్రెష్ గా ఉంటుంది.

సినిమాలో అవకాసం ఎలా వచ్చింది..?

తెలుగులో నా మొదటి సినిమా 'బీరువా', ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ గారి 'ఎటాక్' సినిమా ఒప్పుకున్నాను. కాని 'ఎక్స్ ప్రెస్ రాజా' నా రెండో సినిమాగా రిలీజ్ అవుతుంది. ఆడిషన్స్ చేసి నేనైతే పాత్రకు యాప్ట్ అనుకొని సెలెక్ట్ చేశారు. క్యారెక్టర్ బాగా నచ్చింది. శర్వానంద్ హీరో, మేర్లపాక గాంధి డైరెక్టర్, యు.వి.క్రియేషన్స్ బ్యానర్ ఇలా అన్ని పర్ఫెక్ట్ గా ఉండడంతో ఓకే చేశాను. 50 నుండి 52 రోజుల వరకు సినిమా షూట్ చేశాం. చాలా ఎంజాయ్ చేస్తూ.. వర్క్ చేశాం.

ఎలాంటి పాత్రల్లో నటించాలనుంది..?

ఇప్పటివరకు నేను అన్ని హోమ్లీగా ఉండే పాత్రల్లోనే నటించాను. యాక్ట్రస్ అనేవారు అన్ని రకాల పాత్రల్లో నటించగలగాలి. నాకు గ్లామరస్ పాత్రల్లో నటించాలనుంది. కాని వల్గర్ గా మాత్రం ఉండకూడదు. చేసే పాత్ర అర్ధవంతంగా ఉండాలి.

డైరెక్టర్ గాంధీ గారితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్..?

అమేజింగ్ ఎక్స్ పీరియన్స్. చాలా కూల్ గా ఉండే డైరెక్టర్. సెట్స్ లో నేను కంఫర్టబుల్ గా ఉండేలా చేశారు. ఆర్టిస్ట్స్ నుండి నటన రాబట్టుకోగల డైరెక్టర్. మరోసారి ఆయనతో వర్క్ చేయాలనుంది.

'ఎక్స్ ప్రెస్ రాజా' మీ కెరీర్ కు ఎలా హెల్ప్ అవుతుందనుకుంటున్నారు..?

సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. చాలా హార్డ్ వర్క్ చేసి పని చేశాం. అందరూ ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా. రషెస్ చూశాను. సినిమా మంచి హిట్ అవుతుందనే అనుకుంటున్నాను.

'ఎటాక్' సినిమాలో ఎలాంటి రోల్ లో కనిపిస్తారు..?

అదొక పొలిటికల్ యాక్షన్ బేస్డ్ సినిమా. నేనొక కార్ మెకానిక్ పాత్రలో నటించాను. 'ఎటాక్' ఒక ఇంటెన్స్ డ్రామా.

పెర్సనల్ గా సురభి ఎలా ఉంటుంది..?

లైఫ్ పట్ల చాలా ఎగ్జైటెడ్ గా ఉంటాను. వర్క్ అంటే కమిటెడ్ గా ఉంటాను. నా సంతోషం నాకు ముఖ్యం. సంతోషంగా ఉంటేనే ఏ పనైనా చేస్తాను. లేదంటే అస్సలు చేయను.

తెలుగులో ఇష్టమైన హీరోలు..?

ప్రభాస్ గారికి పెద్ద అభిమానిని. ఈ సినిమాలో కలర్ ఫుల్ చిలకా.. అనే పాటలో బావున్నానని ఆయన పెర్సనల్ గా చెప్పారు. చాలా ఆనందంగా అనిపించింది.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి దర్శకత్వంలో నాని హీరోగా చేస్తోన్న సినిమాలో నటిస్తున్నాను. తమిళంలో లో జై హీరోగా ఒక సినిమాలో నటించాను. అది ఫిబ్రవరిలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs