Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ- హీరోయిన్ అంజలి


'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' , 'గీతాంజలి' వంటి హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ అంజలి. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం అంజలి లీడ్ రోల్ లో నటించిన 'డిక్టేటర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ అంజలితో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

కొత్తగా కనిపిస్తా..

రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో ఉండే హీరోయిన్ లా కాకుండా 'డిక్టేటర్'లో కలర్ ఫుల్ గా ఫ్రెష్ గా కనిపిస్తాను. యంగ్ క్యారెక్టర్ నాది. ఇప్పటివరకు నేను నటించిన చిత్రాల్లో ఒక విధంగా కనిపిస్తే ఈ సినిమాలో మాత్రం నా లుక్, హెయిర్ స్టైల్ మొత్తం కొత్తగా కనిపించాలని శ్యాం కె నాయుడు గారు చాలా కేర్ తీసుకొని చూపించారు. ఆఫీస్ కు వెళ్ళే అమ్మాయి పాత్ర. ఈ సినిమా కమిట్ అయిన తరువాత సుమారుగా ఐదున్నర కేజీల బరువు తగ్గాను. 

మొదట టెన్షన్ పడ్డాను..

బాలకృష్ణ గారితో సినిమా అంటే మొదట చాలా టెన్షన్ పడ్డాను. పెద్ద స్టార్ హీరో ఆయనతో సమానంగా నటించగలనా అనే భయం ఉండేది. కాని ఆయన అందరితో ఫ్రీ గా ఉంటారు. చాలా స్వీట్ ఆయన. కో స్టార్ కు మంచి స్పేస్ ఇస్తారు. సెట్స్ లో ఉండే లైట్ మ్యాన్ నుండి అందరిని బాగా చూసుకుంటారు. బాలకృష్ణ గారికి క్రమశిక్షణ, నిబద్ధత ఎక్కువ. ఆయన దగ్గర నుండి క్రమశిక్షణ నేర్చుకున్నాను. సెట్స్ కి చెప్పిన సమయానికి వచ్చేసేవారు. ఒకానొక సమయంలో బాలకృష్ణ గారు నన్ను నటి సావిత్రితో పోల్చారు. చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడం పూర్తయిన తరువాత బాలయ్య గారు వచ్చి బాగా నటించావని చెప్పారు. 

ఆ రెండు సినిమాలు నేనే చేయాల్సింది..

బాలకృష్ణ గారితో 'లెజెండ్', 'లయన్' సినిమాలు నేనే చేయాల్సింది. కాని డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వలన చేయలేకపోయాను. 'డిక్టేటర్' సినిమా అవకాశం మిస్ చేయకూడదనే ఉద్దేశ్యంతో సినిమా ఒప్పుకున్నాను. స్టొరీ కూడా నాకు బాగా నచ్చింది. 

ఒకేసారి 10 సినిమాలు చేయకూడదు..

ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు నిలబడలేరని అంటుంటారు. కొన్ని పరిధులు ఉండడం వలన, మంచి ప్లాట్ ఫాం క్రియేట్ చేసుకోలేకపోవడం వలన అవకాశాలు తగ్గుతున్నాయి. అంతేకాని తెలుగమ్మాయిలు నిలబడలేకపోతున్నారని అనలేం. ఇండస్ట్రీలో అందరూ ప్రోతహిస్తునే ఉంటారు. ఇండస్ట్రీలో నేను లాంగ్ జర్నీ చేయడానికి కారణం కథల విషయంలో పర్టిక్యులర్ గా ఉండడమే. ఒకేసారి 10 సినిమాలు చేయడం నాకు నచ్చదు. స్టాండర్డ్ గా ఒక సినిమానే చేయాలి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేసి నాలుగు సంవత్సరాలయ్యింది. కాని ఇంకా ఆ సినిమాను ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. అలా గుర్తుండిపోయే పాత్రల్లోనే నటించాలనుకుంటాను.

స్క్రిప్ట్ అనేది చాలా ముఖ్యం..

తెలుగమ్మాయిలు తమిళంలో బాగా రాణిస్తారని అంటారు. తెలుగైనా, తమిలమయినా సినిమా హిట్, ఫ్లాప్ ను బట్టే అవకాశాలు ఉంటాయి. స్క్రిప్ట్ అనేది చాలా ముఖ్యం. నేను ఏం చేయగలనో నాకు క్లారిటీ ఉంది. పాత్రకు వంద శాతం న్యాయం చేయగలనని అనిపిస్తేనే నటించడానికి ఒప్పుకుంటాను. 

కాంట్రవర్సీ కూడా మంచిదే..

నా వరకు నేను ఇప్పటివరకు కాంట్రవర్సీలలో లేను. ఒకవేళ నా మీద ఏమైనా కాంట్రవర్సీ వచ్చినా.. బాధపడిపోయి సినిమాలను పక్కన పెట్టేయలేను కదా.. నా శ్రేయోభిలాషులు, స్నేహితులు కాంట్రవర్సీలు వస్తే మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంటుందని చెప్పేవారు. అందులో కూడా మంచినే తీసుకుంటాను. నేను బాధపడినప్పుడు మాత్రం ఫ్రెండ్స్ తో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను.

కోనగారు నాకోసమే రాశారు..

'డిక్టేటర్' స్టొరీలో నా పాత్ర రాసేప్పుడు కోనగారు నన్ను మైండ్ లో పెట్టుకునే రాశారు. శ్రీవాస్ గారితో ఈ పాత్రకు  అంజలి అయితేనే బావుంటుందని నాకు స్టొరీ నేరేట్ చేశారు. 

శ్రీవాస్ సామర్ధ్యం గలవారు..

ఈ సినిమాకు శ్రీవాస్ గారు దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. రెండు పనులు చేయగలిగే సామర్ధ్యం ఆయనలో ఉంది. ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటారు. ఆడియన్స్ థియేటర్ లో ఎంజాయ్ చేయాలనే విషయాన్ని మైండ్ లో పెట్టుకొని సినిమా తీశారు. సినిమా అంతా రిచ్ గా కనిపించాలని బాగా ఖర్చుపెట్టారు.

మార్కెట్ ఉన్నప్పుడే ఏదైనా..

మంచి రెమ్యునరేషన్ అంటే మనకు మార్కెట్ ఉన్నప్పుడే ఇస్తారు. అలానే మనం కూడా డిమాండ్ చేయగలం. మార్కెట్ తగ్గిపోతే నిర్మాతలు కూడా ఇవ్వరు కదా.. నాకు కథ నచ్చి నా పాత్ర నచ్చితే తక్కువ బడ్జెట్ సినిమా అయినా రెమ్యునరేషన్ విషయంలో కన్సిడర్ చేస్తాను.

నా పాత్ర బావుందన్నారు..

'శంకరాభరణం' సినిమా అనుకున్న స్థాయిలో రిజల్ట్ ఇవ్వకపోయినా అందరూ నా పాత్ర బావుందని, సినిమాను నిలబెట్టిందని చెప్పారు. నేను ఏదైతే రిసీవ్ చేసుకోవాలనుకున్నానో.. అది చేసుకున్నా. ఇంకేం కావాలి.

తోటి హీరోయిన్స్ తో గొడవపడను..

నా తోటి హీరోయిన్స్ తో నేనెప్పుడు గొడవపడను. అందరితో చాలా స్నేహంగా ఉంటాను. ఈ చిత్రంతో సోనాల్ తో కలిసి పని చేశాను. తను కూడా నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది.

డబ్బింగ్ నేనే చెప్తున్నా..

ప్రస్తుతానికి తెలుగు, తమిళ చిత్రాలకు నేనే డబ్బింగ్ చెబుతున్నాను. కన్నడ కూడా ట్రై చేశాను కాని కుదరలేదు. 

బన్నీతో స్పెషల్ సాంగ్..

బన్నీ నటిస్తోన్న సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నాను. అది ఐటెం సాంగ్ మాత్రం కాదు. ఎందుకంటే నా పాత్రతో కంటెంట్ లింక్ అయ్యి ఉంటుంది. బన్నీతో సమానంగా ఉండేలా నా పాత్రను డ్రైవ్ చేశారు. కథ నేరేట్ చేసిన తరువాత ఎలా అయిన ఈ సాంగ్ లో నటించాలనుకున్నాను.

హైపర్ క్యారెక్టర్ నాది..

నిజజీవితంలో నాది హైపర్ క్యారెక్టర్. డల్ గా ఉండడం అస్సలు నచ్చదు. సెట్స్ లో ఎప్పుడైనా కామ్ గా కుర్చున్నానంటే అందరూ ఎందుకు అలా ఉన్నావని అడుగుతూనే ఉంటారు. ఉన్నది ఒక్కటే జీవితం సంతోషంగా ఉండాలనేదే నేను నమ్ముతాను.

ఆయనను ఇప్పటివరకు కలవలేదు..

'రాజు గారి గది' సినిమా సీక్వెల్ లో నేను నటిస్తున్నాననే రూమర్స్ వినపడుతున్నాయి. నిజానికి నేను ఆ ప్రాజెక్ట్ కమిట్ అవ్వలేదు. అసలు ఓంకార్ అనే వ్యక్తిని నేను ఇప్పటివరకు కలవలేదు.

'చిత్రాంగద' ఫిబ్రవరిలో..

'చిత్రాంగద' సినిమా పూర్తయింది. క్రిస్మస్ కానుకగా డిశంబర్ లో రిలీజ్ చేయాల్సింది కాని చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయని రిలీజ్ డేట్ ఫిబ్రవరికి వాయిదా వేశారు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

తెలుగులో రెండు కథలు విన్నాను. అవి సైన్ చేయాలనుకుంటున్నాను. అవి కాకుండా తమిళంలో రెండు సినిమాలు కమిట్ అయ్యాను. మమ్ముట్టి గారితో నటిస్తున్నాను. మలయాళంలో మరో సినిమాలో నటిస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs