Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ-వామిక గబ్బి!


సుధీర్ బాబు, వామిక జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్ కుమార్, శశిధర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'భలే మంచి రోజు'. క్రిస్మస్ కానుకగా విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ వామిక తో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?

నేను పంజాబీ అమ్మాయిని. చిన్నప్పటినుండి నటన మీద ఆసక్తి ఉండేది. 'యో యో హనీ సింగ్' , 'తు మేరా 22 మే తేరా 22' వంటి పంజాబీ చిత్రాల్లో నటించాను. 'సిక్స్టీన్' అనే హిందీ సినిమాలో నటించాను. తమిళంలో నటించిన 'మాలై నేరతు మయక్కం' సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది..?

తెలుగులో నా మొదటి సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందనుకోలేదు. ప్రేక్షకుల నుండి అశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రాన్ని ఆడియన్స్ కు మరింత దగ్గర చేయడానికి సక్సెస్ టూర్ ను నిర్వహించాం. హైదరాబాద్ నుండి గుంటూరు, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఉన్న థియేటర్లకు వెళ్లి ప్రేక్షకుల రెస్పాన్స్ దగ్గర నుండి చూశాం. నాకు కార్ లో ఎక్కువ దూరం ప్రయాణాలు చేయడం నచ్చదు. కాని హైదరాబాద్ నుండి వైజాగ్ వరకు కార్ లోనే వెళ్లాం. ఈ సారి ట్రిప్ చాలా ఎంజాయ్ చేశాను. 

ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది..?

'మాలై నేరతు మయక్కం' అనే తమిళ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు 'భలే మంచి రోజు' మూవీ యూనిట్ నుండి ఫోన్ వచ్చింది. స్క్రిప్ట్ విని నచ్చడంతో ఓకే చెప్పాను. ఈ సినిమాలో నాకు ఎక్కువ డైలాగ్స్ ఉండవు. నా పాత్రకు డైలాగ్స్ ఎక్కువ ఉండాలి, రోల్ ఎక్కువసేపు ఉండాలని నేను అనుకోను. నా పాత్ర నచ్చితే ఎంత చిన్నదైనా.. దానికి నూటికి నోరు శాతం న్యాయం చేయాలనుకుంటాను. 

డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గురించి చెప్పండి..?

'భలే మంచి రోజు' సినిమా మొదలుపెట్టిన రోజు నుండి టీం అందరం ఫ్రెండ్స్ లాగా కలిసి పని చేశాం. శ్రీరామ్ ఆదిత్యకు ఇది మొదటి సినిమా అయినా ఎక్స్ పీరియన్స్ద్ డైరెక్టర్ లా చేశారు. ఏరోజు సెట్స్ మీద నేను డైరెక్టర్ ను నేను చెప్పిందే చేయాలనే ఈగోతో బిహేవ్ చేయలేదు. ఆయనతో ఏదైనా డిస్కస్ చేసి చేసేవాళ్ళం. చాలా హెల్ప్ చేశారు. నేను దర్శకుల నటిని. వారు ఎలా చెప్తే అలా చేస్తాను.

హిందీలో కాకుండా తమిల్, తెలుగులో నటించడానికి భాష సమస్య  అని ఎప్పుడు అనిపించలేదా..? 

తమిళంలో సినిమా ఒప్పుకొని మొదటిరోజు షూటింగ్ ప్రారంభించినప్పుడు నేను ఏడ్చేశాను. పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడం నా వాళ్ళ కాలేదు. నా స్నేహితులకు ఫోన్ చేసి నేను నటించలేనని చెప్పి ఏడుస్తుంటే.. సరే వదిలేసి వచ్చేయమని చెప్పారు. వెంటనే మా నాన్నకు ఫోన్ చేసి 'నేను వచ్చేస్తాను డాడీ.. నాకు డైలాగ్స్ చెప్పడం చేతకావట్లేదని చెప్పాను'. దానికి ఆయన 'నీ వల్ల కాదా..? నువ్వు చేయలేవా..? సరే వచ్చేయ్ నీ వల్ల కావట్లేదు కదా అని తక్కువ చేసి మాట్లాడారు. నేను వెంటనే నేను చేస్తాను.. నేను ఇంటికి రావట్లేదు అని చెప్పి ఇంక షూటింగ్ లో పాల్గొన్నాను. భాష విషయంలో నాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ బాగా హెల్ప్ చేసేవారు. నేను చక్కగా నటిస్తున్నానంటే కారణం వాళ్ళే. ఈ సినిమాలో నాకు పెద్దగా డైలాగ్స్ ఉండవు. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను.

ఎలాంటి పాత్రల్లో నటించాలనుకుంటున్నారు..?

గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాలనుంది. ఫైనల్ గా ఆడియన్స్ నన్ను ఒక మంచి నటిగా గుర్తుపెట్టుకోవాలి కాని మరో విధంగా కాదు.

ఇండస్ట్రీ నుండి ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా..?

సినిమాను రిలీజ్ కు ముందు ప్రభాస్ గారికి చూపించాం. నేను, డైరెక్టర్ శ్రీరామ్, శ్యాం దత్ ఇలా టీం అందరం కలిసే ఆయన దగ్గరకు వెళ్లాం. నా నటన చూసి చాలా బాగా చేసావని చెప్పారు. మా అందరిని ఆయన చాలా బాగా ట్రీట్ చేశారు. సున్నితమైన మనిషి. ఆయనకు నా నటన నచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించింది.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

'నన్ను వొదిలి నీవుపోలేవులే' అనే తెలుగు సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరే ప్రాజెక్ట్స్ ఫైనల్ చేయలేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs