Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ-రమేష్ వర్మ!


నాగశౌర్య, పాలక్ అల్వాని జంటగా జె.జి.సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్ పతాకాలపై రమేష్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జక్కం, కిరీటి, శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'అబ్బాయితో అమ్మాయి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ వర్మ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

చాలా గ్యాప్ తరువాత సినిమా చేస్తున్నట్లున్నారు..?

'వీర' సినిమా తరువాత ఓ మంచి లవ్ స్టొరీ చేయాలనుకున్నాను. నాగశౌర్య, నందిత కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ చేయడానికి అన్ని రెడీ చేసుకున్నాను. అయితే నేను బడ్జెట్ 4 నుండి 5 కోట్లు అనుకున్నాను. నాగాశౌర్య కొత్త హీరో కావడంతో అంత మొత్తం పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదు. నేను కాంప్రమైజ్ అవ్వాలనుకోలేదు. శౌర్య ను నేనే ఇంట్రడ్యూస్ చేయాల్సింది.. నాకోసం సంవత్సరం ఎదురుచూశాడు. ఆ సమయంలో తనకు 'ఊహలు గుసగుసలాడే' సినిమాలో అవకాశం వచ్చింది. శౌర్య, నందిత ఇద్దరు బిజీ అయిపోయారు. శౌర్య కోసం రాసుకున్న కథ కాబట్టి వేరే హీరోతో చేయలనుకోలేదు. తన కోసం రెండు సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పటికి సినిమా తీశాను. 

సినిమా గురించి చెప్పండి..?

సోషల్ మీడియా ఉన్నది మంచి కోసమని నేను భావిస్తాను. నిజ జీవితంలో అంతా డ్రామానే ఉంటుంది. రియలిస్టిక్ గా ఎవరు ప్రవర్తించట్లేదు. వాస్తవానికి, కల్పనకు మధ్య ఉన్న డిఫరెన్స్ ను ఈ సినిమాలో చూపిస్తున్నాం. కొత్త ఫీల్ ఉన్న లవ్ స్టొరీ ఇది. మొదటి నుండి చివరి వరకు చాలా ఎగ్జైట్మెంట్ తో సాగుతుంది. ఫ్యామిలీస్ కు, లేడీస్ కు, యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.  

ఈ రెండు సంవత్సరాల గ్యాప్ లో మరో కథ సిద్ధం చేసుకోలేదా..?

నిజానికి నేను రాసుకున్న కథ 'గుండెజారి గల్లంతయ్యిందే' కథ ఒక్కటే. ఒకేరకమైన ఐడియాలు ఇద్దరికీ రావొచ్చు. ఒకరి ఆలోచనలను మరొకరు దొంగిలించలేరు. ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. నేను స్క్రిప్ట్ కూడా రిజిస్టర్ చేయించలేదు. అందుకే ఆ కథను పక్కన పడేసి  'అబ్బాయితో అమ్మాయి' కథ రెడీ చేసుకున్నాను. 

'రైడ్' సినిమా తరువాత ఆ రేంజ్ లో హిట్ అందుకోకపోవడానికి కారణం ఏంటి..?

బేసిక్ గా నాకు లేజీనెస్ ఎక్కువ. నేను ఎగ్జైట్ అయితేనే గానీ, ఎక్కువ రోజులు ఆ కథతో ట్రావెల్ చేయలేను. 'రైడ్' సినిమా హిట్ అయ్యిందే కాబట్టి నాకు 'వీర' అవకాశం వచ్చింది. నిజానికి ఆ సినిమా నేను ప్రెజర్ తో చేశాను. వీర కథ బాలకృష్ణ గారికి సూట్ అవుతుందని రాసుకున్నాను. ఆయనతో సినిమా కూడా మొదలు పెట్టేశాను. కాని కెరీర్ మొదట్లోనే బాలకృష్ణ గారితో చేయడం కరెక్ట్ కాదని నేనే బ్యాక్ స్టెప్ వేశాను. రవితేజ గారితో హిందీ సినిమా 'రేస్' రీమేక్ చేయాలని ఆ సినిమా రైట్స్ కూడా కొన్నాం. 'రేస్' సినిమాలో ఇద్దరు హీరోలు ఉండాలి. గోపీచంద్ గారిని అడిగితే నెగెటివ్ షేడ్స్  ఉన్న పాత్రలో నటించనని చెప్పారు. ఇక ఆ ప్రాజెక్ట్ లేట్ అవుతుండడంతో రవితేజ గారు 'వీర' స్టొరీ నచ్చడంతో సినిమా చేద్దామని చెప్పారు. కొన్ని పరిస్థితుల కారణంగా ఆ సినిమా చేయాల్సివచ్చింది. 

ఇళయరాజా గారితో మ్యూజిక్ చేయించడం ఎలా సాధ్యమైంది..?

ఇళయరాజా గారితో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. నన్ను కూర్చోబెట్టి రెండు, మూడు గంటలు మాట్లాడుతూనే ఉంటారు. ఆయనకు 'వస్తా నీ వెనుక' అనే సినిమా కథ చెప్తే మ్యూజిక్ చేయడానికి ఓకే చెప్పారు. రీరికార్డింగ్ అంతా అయిపోయింది. ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు 'అబ్బాయితో.. అమ్మాయి' కథ వినిపించాను. వెంటనే ఆయన ఈ సినిమానే ముందుగా మొదలుపెట్టు అని సలహా ఇచ్చారు. తమిళంలో కూడా రిలీజ్ చేయమని చెప్పారు. ఇళయరాజా గారి వలనే ఈ సినిమా మొదలుపెట్టాను.  

నిర్మాతల గురించి చెప్పండి..?

ఈ సినిమా మొదలు పెట్టినపుడు నేను మూడు కోట్ల బడ్జెట్ అని మొదలుపెట్టాను. కాని ఆరు కోట్ల వరకు అయింది. అయినా ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. నాకు ఎంతో స్వేచ్చనిచ్చారు. ఇలాంటి నిర్మాతలతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనుంది.

'వస్తా నీ వెనుక' సినిమా ఎప్పుడు ఉంటుంది..?

ఓ పెద్ద హీరోతో సినిమా ప్లాన్ చేశాం. 'వస్తా నీ వెనుక' కాకుండా 'ఇదేదో బాగుందే చెలి' అనే టైటిల్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. ఒక ట్రైయాంగల్ లవ్ స్టొరీ. 2016 మార్చి నుండి సినిమా మొదలుపెట్టనున్నాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు.   

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs