Advertisement
Google Ads BL

బర్త్ డే స్పెషల్: లావణ్య త్రిపాఠి!


'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన నటి లావణ్య త్రిపాఠి. 'దూసుకెళ్తా','భలే భలే మగాడివోయ్' చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న ఈ భామ డిశంబర్15న పుట్టినరోజు జరుపుకోనుంది. ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

కథక్ నేర్చుకున్నా..

'దూసుకెళ్తా' సినిమా తరువాత అన్ని అదే పాత్ర తరహాలో ఉండే స్క్రిప్ట్స్ చెప్పారు. అందుకే చాలా గ్యాప్ తీసుకున్నాను. ఒకేరకమైన పాత్రల్లో నటిస్తే బోర్ కొట్టేస్తుంది. నేను వెయిట్ చేసినందుకు 'భలే భలే మగాడివోయ్' లాంటి మంచి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయినా.. ఆ సమయంలో నేను సమయం వృధా చేయకుండా కథక్ నేర్చుకున్నాను. 'భలే భలే మగాడివోయ్' సినిమాలో కూడా కథక్ చేసే సీన్స్ ఉంటాయి. 

మూడు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి..

'లచ్చిందేవికి ఓ లెక్కుంది' సినిమాలో మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాను. అంకాలమ్మ అనే పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. అందులో అందరిని భయపెట్టే ఒక పాట ఉంటుంది. ఆ సినిమా రిలీజ్ కోసం చాలా ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నాను. క్రైమ్, కామెడీ నేపధ్యంలో సాగే కథ.

శిరీష్ సినిమాలో నటిస్తున్నా..

అల్లు శిరీష్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాను. అందులో కాలేజీకు వెళ్ళే అమ్మాయి పాత్ర. డిఫరెంట్ రోల్ అని చెప్పలేను కాని నేను డిఫరెంట్ గా చేయడానికి ప్రయత్నించాను. చాలా న్యాచురల్ గా ఉంటుంది. సిటీ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ. డైరెక్టర్ కూడా బాగా డైరెక్ట్ చేస్తున్నాడు. 

సంప్రదాయకంగా కనిపిస్తా..

'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాలో సంప్రదాయకంగా కనిపిస్తాను. అమ్మయిలు చీరల్లో చాలా అందంగా కనిపిస్తారు. సినిమా మొదలయినప్పటినుండి చివరి వరకు నేను చీరల్లోనే కనిపిస్తాను. సినిమాలో మంచి ఎమోషన్స్ ఉంటాయి. అందుకే సెలక్ట్ చేసుకున్నాను.

అందరితో నటిస్తా..

నాగార్జున గారితో నటిస్తున్నాను కదా.. అని వాళ్ళ పిల్లలతో నటించనని నేను చెప్పను. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు ముందే నాగచైతన్య తో 'మనం' సినిమా చేసాను. అవకాశం వస్తే మరోసారి కూడా నటిస్తాను. అఖిల్ తో ఛాన్స్ వచ్చిన ఓకే చెప్తాను. నేను క్యారెక్టర్ మాత్రమే చూస్తాను. నచ్చితే ఎవరితో అయినా.. కలిసి నటిస్తాను. 

అవి రూమర్స్ మాత్రమే..

'బాహుబలి 2' సినిమాలో నటిస్తున్నాని వచ్చిన వార్తల్లో నిజం లేదు. అవన్నీ రూమర్స్ మాత్రమే. కాని నిజంగా రాజమౌళి గారు నటించమని అడిగితే ఏ పాత్రలో అయినా నటిస్తాను. బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నా పర్వాలేదు. 

డబ్బింగ్ ట్రై చేశా..

'అందాల రాక్షసి' సినిమాకు డబ్బింగ్ ట్రై చేశాను. కాని నా యాక్సెంట్ సెట్ కాలేదు. ఎప్పుడు చాన్స్ వచ్చిన ఖచ్చితంగా ప్రయత్నిస్తాను.

నా జర్నీలో హ్యాపీగా ఉన్నా..

నా మొదటి సినిమా తరువాత అలాంటి పాత్రలు మాత్రమే చేయగలనని అందరు అనుకున్నారు. కాని నేను భిన్నమైన పాత్రల్లో నటించాలనుకున్నాను. నేను అనుకున్నట్లుగానే అన్ని మంచి రోల్స్ వస్తున్నాయి. నా జర్నీలో చాలా సంతోషంగా ఉన్నాను.

కథే ముఖ్యం..

స్క్రిప్ట్స్ ఎన్నుకునేప్పుడు కథ, డైరెక్టర్ ను బట్టి సెలక్ట్ చేసుకుంటాను. ముందుగా కథ నన్ను తృప్తి పరచాలి. స్టొరీ నేను ఎంజాయ్ చేసే విధంగా ఉంటేనే ఒప్పుకుంటాను. 

తమిల్ కు సమయం లేదు..

తమిళంలో ఆఫర్లు వస్తున్నాయి కాని నాకు సమయం దొరకడం లేదు. తెలుగులోనే చేయాలనుంది. హిందీలో ఆఫర్లు వచ్చినా.. తెలుగులో మాత్రం నటించడం మానను.

సినిమాలు చూస్తా..

ఖాళీ సమయాల్లో సినిమాలు, టివి సిరీస్ చూస్తాను. రాత్రి పూట ఫ్రెండ్స్ తో తిరుగుతాను. 

హైదరాబాద్ నచ్చింది..

నాకు హైదరాబాద్ బాగా నచ్చింది. ఇక్కడ ఇల్లు కూడా కొనుక్కోవడానికి ప్లాన్ చేస్తున్నాం. ఉలవచారు బిరియాని ఇష్టంతో తింటాను. నేను శాఖాహారిని. చికెన్ బిరియానిలో చికెన్ తీసేసి బిరియాని తింటాను.  

కొత్త సినిమా ఓకే చేశాను..

కొత్త డైరెక్టర్ ఒకరు చెప్పిన స్టొరీ బాగా నచ్చింది. డిఫరెంట్ క్యారెక్టర్. రెగ్యులర్ గా ఉండే సినిమా కాదు. యాక్టింగ్ కు స్కోప్ ఉన్న సినిమా అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs