Advertisement
Google Ads BL

సినిమా అంటేనే పెద్ద రిస్క్: కె.కె.రాధామోహన్!


ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని అందించిన నిర్మాత కె కె రాధామోహన్.. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'బెంగాల్ టైగర్'. రవితేజ హీరోగా, రాశిఖన్నా, తమన్నాలు హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత రాధామోహన్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

సంపత్ కి హ్యాట్రిక్ హిట్..

డిశంబర్10న విడుదలయిన ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా మంచి స్పందన వస్తోంది. రవితేజ, సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన 'బెంగాల్ టైగర్' బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రమిది. ఈరోజు కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. సంపత్ కు హ్యాట్రిక్ హిట్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఇలానే జనవరి నెల వరకు సినిమా ఆడాలని కోరుకుంటున్నాను.

'కిక్2' ఎఫెక్ట్ లేదని చెప్పను..

భారీ అంచనాలతో విడుదలయిన కిక్2 చిత్రం ఆశించిన ఫలితాలను రాబట్టుకోలేకపోయింది. ఆ సినిమా హిట్ అయితే మాకు ప్లస్ అయ్యేది. దాని ఎఫెక్ట్ మా సినిమా బిజినెస్ మీద పడింది. డిస్ట్రిబ్యూటర్స్ అతి తక్కువ రేట్లకు సినిమాను కొన్నారు. 

ఇండస్ట్రీ మేలు కోసమే చేశాను..

'బెంగాల్ టైగర్' కాపీ అక్టోబర్ నెలలోనే రెడీ అయ్యింది. అయితే అన్ని సినిమాలు ఒకేసారి విడుదల చేసి నష్టపోవడం ఇష్టంలేక, ఇండస్ట్రీకు మేలు జరగాలనే ఉద్దేశ్యంతో సినిమా విడుదల తేదీ వాయిదా వేశాం. మేము అనుకున్నట్లుగా నవంబర్ నెలలో సినిమా రిలీజ్ చేసి ఉంటే వరదల కారణంగా కలెక్షన్స్ డల్ గా ఉండేవి. డిశంబర్ లో విడుదల చేయడం వలన కలిసొచ్చింది. డిలే అయిన కరెక్ట్ టైం కి సినిమా రిలీజ్ చేసాం.

కథను బట్టి ఖర్చు పెడతా..

సినిమాకు రవితేజ గారి బడ్జెట్ కు మించి ఎందుకు ఖర్చు పెడుతున్నారన్నారు. కాని నేను కథను బట్టి ఖర్చు పెడతాను. అయినా నా దృష్టిలో పెద్ద సినిమా, చిన్న సినిమా అని ఉండదు. కథ బావుంటే అదే మంచి సినిమా. అనుభవం కోసం రెండు చిన్న బడ్జెట్ లో సినిమాలు తీశాను. ఆ అనుభవంతో 'బెంగాల్ టైగర్' లాంటి బిగ్ బడ్జెట్ ఫిలిం తీయగలిగాను.

కథే సినిమాకు బ్యాక్ బోన్..

స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసేప్పుడు కథకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తూనే నాకు కూడా నచ్చే కథలను ఎన్నుకుంటాను. ఎందుకంటే కథే సినిమాకు బ్యాక్ బోన్. ఫ్యామిలీ, కామెడీ, యూత్, రోమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ కలగలిపే సినిమా అయితే బావుంటుంది. ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టంట్. కొత్తగా చూపించారు.

కాన్ఫిడెంట్ తో చేశా..

2006 నుండి సంపత్ తో మంచి పరిచయం ఉంది. 'ఏమైంది ఈ వేళ' లాంటి కాంటెంపరరీ సబ్జెక్టు తరువాత 'రచ్చ' లాంటి బిగ్ కాన్వాస్ ఉన్న సినిమా చేసాడు. సంవత్సరంన్నర పాటు పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసాడు. తన మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా చేశాను.

సినిమా అంటేనే రిస్క్..

సినిమా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. ప్యాషన్ తో, సినిమా మీద ఉండే పిచ్చితో చేస్తారు. ఇన్వెస్ట్ చేయడమనేది పెద్ద రిస్క్. నిర్మించగలిగే స్తోమత ఉంది కాబట్టి చేస్తున్నాను. చాలా కేర్ తీసుకోవాలి. నేను సినిమా మొదలు పెట్టినప్పుడే ఇన్వెస్ట్మెంట్ పోయిందనుకొని మొదలుపెడతా.. రిస్క్ తీసుకునే సినిమాలు చేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs