Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ-నిఖిల్


'స్వామి రారా', 'కార్తికేయ', 'సూర్య వర్సెస్ సూర్య' వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు నిఖిల్. ప్రస్తుతం తను హీరోగా నటించిన 'శంకరాభరణం' చిత్రం డిశంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

ఈ చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది..?

ఒకరోజు కోన వెంకట్ గారు ఫోన్ చేసి ఆఫీస్ కు రమ్మనగానే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. వెంటనే ఆఫీస్ కు వెళ్ళాను. నీతో కలిసి ఓ సినిమా చేయాలనుకుంటున్నానని నలభై నిముషాలు స్టొరీ నేరేట్ చేసారు. మొత్తం స్క్రిప్ట్ వినిపించగలరా..? అని అడగగానే కోన గారు ఈగో ఫీలింగ్ లేకుండా స్క్రిప్ట్ రెడీ అవ్వగానే వినిపిస్తానని చెప్పారు. కథ విన్నాక బాగా నచ్చడంతో ఓకే చెప్పాను. హిందీలో వచ్చిన 'ఫస్ గయారే ఒబామా' చిత్రం రీమేక్ రైట్స్ తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పటివరకు నేను ఇలాంటి సినిమాలో నటించలేదు. కోన గారి సినిమా, పెద్ద బ్యానర్ అని ఆలోచించి ఈ సినిమా చేయలేదు. మంచి ఎంటర్టైన్మెంట్ తో ఉండే కుటుంబ కథా చిత్రమిది. ఇప్పటి వరకు యూత్ ఫుల్ సినిమాలు చేసే నేను ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరవ్వచ్చు.

సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి..?

మొదట కోన గారు పిలిచినప్పుడు ఆయన చేసిన 'రెడీ, డీ' చిత్రాల మాదిరిగానే ఉండే స్క్రిప్ట్ అనుకున్నాను. కాని ఆయన ప్రత్యేకంగా బ్యానర్ స్థాపించింది భిన్నమైన చిత్రాలను నిర్మించడానికే. ఇంతకముందు 'గీతాంజలి' సినిమా చేసారు. ఇప్పుడు శంకరాభరణం అనే మరో వైవిధ్యమైన సబ్జెక్టు తీసుకున్నారు. ఈ చిత్రంలో నాదొక టిపికల్ ఎన్నారై పాత్ర. అలాంటి వాడు బిహార్ కి వచ్చి ఎలాంటి సంఘటనలను ఎదుర్కొన్నాడనేదే సినిమా. ఈ సినిమా కోసం ఒక్క సెట్ కూడా వేయలేదు. అన్ని రియల్ లోకేషన్స్ లోనే షూట్ చేసాం. నేచర్ కు బాగా దగ్గరగా ఉండే సినిమా. 

పాత్ర కోసం ఏమైనా హోం వర్క్ చేసారా..?

తిరుపతికి వెళ్లి తలనీలాలు ఇచ్చిన తరువాత నేను సడెన్ గా అమెరికా వెళ్లాను. అందరూ సడెన్ గా ఎందుకు వెళ్ళాడు అనుకున్నారు. నిజానికి యు.ఎస్ కి వెళ్లి న్యూయార్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో కోర్స్ చేసాను. ఈ సినిమాకు కావాల్సిన నా కాస్ట్యూమ్స్ అన్ని అక్కడే కొన్నాను. నా హెయిర్ కట్, లుక్ మొత్తం అన్ని ఫోటోలు తీసి కోన గారికి పంపేవాడిని. అలానే అమెరికాలో ఉండే తెలుగు వారితో ఇంటరాక్ట్ అయ్యాను. అక్కడ ఉండే తెలుగు వారి ఆలోచనా విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. యు.ఎస్ లో 5 రోజులు సినిమా షూట్ చేసాం.

టైటిల్ కు జస్టిఫికేషన్ ఏంటి..?

ఈ సినిమాలో ఫ్యామిలీ, యాక్షన్, లవ్, మాఫియా ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో.. నేను టైటిల్ కూడా ఆ ప్యాటర్న్ లోనే ఉంటుందనుకున్నాను. కాని కోన గారు మన సినిమా టైటిల్ 'శంకరాభరణం' అని చెప్పగానే షాక్ అయ్యాను. అందరికి తెలిసిన టైటిల్ అయితే ప్రేక్షకులకు తొందరగా రీచ్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ టైటిల్ పెట్టారు. బూతు సినిమా తీస్తే తప్పు కాని ఫ్యామిలీ సినిమాకు ఈ టైటిల్ పెట్టొచ్చని కోన గారు అన్నారు. విశ్వనాథ్ గారికి కూడా చెప్పారు. ఆయన సినిమా ఆడియో ఫంక్షన్ కి వచ్చి బ్లెస్ చేసారు కూడా. 

'ఫస్ గాయరే ఒబామా', 'శంకరాభరణం' ఒకే విధంగా ఉంటాయా..?

హిందీలో 'ఫస్ గయారే ఒబామా' పెద్ద హిట్. ఆ సినిమాలో మెయిన్ పాయింట్ తీసుకొని కోన గారు దాని చుట్టూ కథ అల్లారు. మొదటి భాగం ఒకే విధంగా ఉన్నా.. రెండో భాగం, క్లైమాక్స్ డిఫరెంట్ గా ఉంటాయి. 

కథ సెలెక్ట్ చేసేప్పుడు ఎలాంటి కేర్ తీసుకుంటారు..?

'ఆలస్యం అమృతం' సినిమా రిలీజ్ అప్పుడు నేను థియేటర్ దగ్గర ఉండగా ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి 'సినిమా బాలేదు బ్రదర్ నేను సెకండ్ హాఫ్ చూడకుండానే వెళ్ళిపోతున్నాను' అని చెప్పాడు. నేను చాలా బాధ పడ్డాను. అప్పటి నుండి రెగ్యులర్ వాటికి భిన్నంగా ఉండే సినిమాల్లోనే నటించాలని ఫిక్స్ అయ్యాను. కాని కథలు విన్నప్పుడు బ్రెయిన్ ఫ్రై అయిపోతుంది. నాకే కాదు ఏ హీరోదైనా అదే పరిస్థితి. కాని అలా కథలు వింటేనే నాకు సుదీర్ బాబు, చందు మొండేటి వంటి డైరెక్టర్స్ దొరికారు. నేను కూడా అన్ని ఒకేరకమైన చిత్రాల్లో నటిస్తుంటే.. నాకే కాదు, చూసే ప్రేక్షకులకు కూడా బోర్ కొడుతుంది. కాబట్టి కొత్తగా, భిన్నంగా ఉండే కథలనే ఎన్నుకుంటాను.

ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు..?

సుమారుగా 600 థియేటర్లకు పైగానే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. బిజినెస్ బాగా జరుగుతోంది. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

వి.ఐ.ఆనంద్ తో ఓ సినిమా కమిట్ అయ్యాను. ఫాంటసీ సబ్జెక్టు అది. స్టొరీ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ప్రస్తుతానికి అవికా గోర్ కన్ఫర్మ్ అయింది. అలానే 'కార్తికేయ2' చేయాలని ప్లాన్ చేస్తున్నాం. స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉంది. చందు 'కార్తికేయ' కంటే ఇంకా మంచి స్టొరీ రాసాడు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs