Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ- కోనవెంకట్‌


నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్, కామెడీ చిత్రం శంకరాభరణం. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. కోన వెంకట్ ఈ చిత్రానికి రచన చేస్తున్నారు. సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 4న విడుదవుతుంది. ఈ సందర్భంగా కోనవెంకట్‌తో సినీజోష్ ఇంటర్వ్యూ...

Advertisement
CJ Advs

టైటిల్ కు జస్టిఫికేషన్ ఏంటి..?

ఈ సినిమాను బీహర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తీశాం. కొత్త టైటిల్ కంటే ప్రేక్షకులకు బాగా తెలిసిన టైటిల్ అయితే తొందరగా రీచ్ అవుతుందనే ఉద్దేశ్యంతో 'శంకరాభరణం' అనే టైటిల్‌ ను సెలెక్ట్ చేసుకున్నాం. కాని మొదట ఎలాంటి జస్టిఫికేషన్ అనుకోకుండానే టైటిల్ పెట్టాను. తర్వాత టైటిల్‌కు తగిన విధంగా జస్టిఫికేషన్‌ చేసుకుంటూ వచ్చాం.

కె.విశ్వనాధ్ గారు టైటిల్ విషయంలో అభ్యంతరం చెప్పలేదా..?

'గీతాంజలి' తర్వాత నేను చేస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమా టైటిల్ 'శంకరాభరణం' అని అనుకోగానే మొదట కె.విశ్వనాధ్ గారిని కలిసి చెప్పాను. 'కారణం లేకుండా నువ్వలా పెట్టవని నాకు తెలుసు కదా' అని ఆయన అన్నారు.

నిఖిల్ పాత్ర ఎలా ఉంటుంది..?

సినిమాలో హీరో తండ్రి ఫారెన్ లో చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తాడు. తండ్రి కష్టపడ్డాడు కదా.. నేను సుఖపడతానని అనుకునే క్యారెక్టర్ నిఖిల్ ది. ఈ సినిమాలో నిఖిల్ పేరు గౌతమ్. గౌతమబుద్దుడికి జ్ఞానోదయం అయిన ప్రాంతం బీహార్ లోని గయ. అందుకే హీరోకు ఆ పేరు పెట్టాం.

నిఖిల్ నే హీరోగా పెట్టడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా..?

పెద్ద హీరోలు సైతం చేయగలిగే కంటెంట్ ఉన్న సబ్జెక్టు ఇది. అయితే స్టార్ హీరోలకు ఇమేజ్ అనే బ్యాగేజ్ ఉండడం వలన వాళ్ళు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తున్నారు. కొత్త స్క్రిప్ట్ తో సినిమా చేయాలంటే ఆలోచిస్తున్నారు. నిఖిల్ మాత్రం వైవిధ్యమైన సబ్జెక్ట్స్ ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. అందుకే ఈ సినిమాకు హీరోగా తనను ఎన్నుకోవడం జరిగింది.  నిఖిల్‌ కెరీర్‌కు 'శంకరాభరణం' ఒక 'దూకుడు' అవుతుంది.

బీహార్ నేపధ్యంలో సినిమా చేయడానికి రీజన్..?

ఓ హిందీ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పుడు బీహార్‌ లోని బీర్‌గంజ్‌ అనే గ్రామానికి వెళ్లాను. అక్కడ కిడ్నాపింగ్ అనేది మేజర్ బిజినెస్. నేపాల్‌ దేశానికి చాలా దగ్గరగా ఉండే ప్రాంతమది. ముఖ్యమైన వక్తులు, వస్తువు ఏవైనా అక్కడ కిడ్నాప్‌ చేసేస్తారు. పోలీసు వచ్చేలోపు వారు పక్కదేశానికి పారిపోతుంటారు. ఎందరో రాజకీయనాయకులు దాని వెనుక ఉన్నారని తెలిసి షాక్ అయ్యాను. ఈ బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉంటుందని సినిమా చేశాను. 'పస్‌ గయా ఒబామా' సినిమా చూసి అందులో ఒక ఆసక్తికరమైన పాయింట్ తీసుకొని దక్షినాది రీమేక్ ను పొంది సినిమా చేశాను. ప్రయోగంలా చేసిన ఈ సినిమా సక్సెస్ అయితే మరిన్ని సినిమాలు చేయొచ్చు.

డైరెక్టర్ ఉదయ్‌ గురించి చెప్పండి..?

ఒక సినిమా చేసేప్పుడు అందరి ఆలోచన ఒకే విధంగా ఉండాలి. దర్శకుడు ఉదయ్‌ నాతో పది సంవత్సరాలుగా ట్రావెల్‌ చేస్తున్నాడు. తనైతే ఈ చిత్రానికి న్యాయం చేయగలడని భావించి డైరెక్టర్ గా అవకాశం ఇచ్చాను. దర్శకుడికి చాలా బాధ్యతుంటాయి. ప్రతిది దగ్గరుండి చూసుకోవాలి.

అంజలి ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందా..?

ఈ చిత్రంలో ఉండే నలుగురు విలన్స్ లో ఒకరే అంజలి. ఒకప్పుడు శ్రీదేవి, విజయశాంతి లు గ్లామర్‌ పాత్రలలో నటిస్తూనే.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించేవారు. వాటి వల్ల వారికి మరింత గుర్తింపు వచ్చింది. ఈ చిత్రం ద్వారా అంజలికి అలాంటి గుర్తింపు లభిస్తుంది. తన రోల్‌ సినిమాలో 15 నిమిషాల పాటు ఉంటుంది. 

నందిత క్యారెక్టర్‌ గురించి చెప్పండి..?

ఈ చిత్రంలో నందిత బీహారీ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. హీరోతో పాటు హీరోయిన్‌ను కూడా  కిడ్నాప్‌ చేయడంతో అప్పటి వరకు బబ్లీగా సాగిన పాత్ర కాస్తా ఎమోషనల్‌గా మారిపోతుంది. ఇలాంటి పాత్రలో తెలుగు వచ్చిన అమ్మాయి అయితే బావుంటుందని నందితను సెలెక్ట్ చేసుకున్నాం.

శ్రీనువైట్లకు, మీకు బ్రూస్ లీ సినిమా విషయంలో మనస్పర్ధలు వచ్చాయనే మాటలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు..? 

నిజమే నాకు, శ్రీనువైట్లకు మధ్య మనస్పర్దలున్నాయి. అయితే ఆయనపై నేను లీగల్‌గా యాక్షన్ తీసుకుంటానని వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఎంత మంచి రిలేషన్ ఉన్నా.. గొడవలు రావడమనేది సహజమే. నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను అంతే. రేపు మళ్ళీ కలుసుకొని మాట్లాడుకోవచ్చు. 'బ్రూస్‌లీ' సినిమాకు 72 సీన్స్‌ను రాసిచ్చాను. రాసిన సీన్స్‌ను రాసినట్లుగా తీయాలనే రూల్ ఏమిలేదు. కాని రచయితగా నా పేరు వేయడంతో ఫీల్‌  అయ్యాను. 'దూకుడు' తర్వాత మా కాంబినేషన్‌లో మూవీ రావడంతో అందరిలో అంచనాలు, నమ్మకం బాగా ఉంటాయి. ఇప్పుడా నమ్మకం పోయింది. అందుకే నేను చాలా బాధ పడ్డాను.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనుకుంటున్నారు..?

తెలుగు సినీ ఇండస్ట్రీ అయోమయం స్థితిలో ఉంది. ఒకప్పుడు బాలీవుడ్‌ లో ఇలాంటి పరిస్థితి వచ్చినపుడు వాళ్ళు మల్టీప్లెక్స్‌, ఓవర్‌సీస్‌ బిజినెస్‌ ఉండేలా సినిమాలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ఏరియాల్లో బోజ్‌పురి సినిమాలు విడుదలై విజయం సాధించాయి. బోజ్‌పురి మార్కెట్‌ ఏర్పడింది. ఇప్పుడు మనం కూడా అలాంటి అయోమయ స్థితిలోనే ఉన్నాం. సినిమాలు చేసేటప్పుడు బి, సి సెంటర్స్‌ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేయాలా..? స్టైల్ మారుస్తారా..? అని చూడాలి. 'శ్రీమంతుడు' సినిమాలో కామెడి పెద్దగా లేకపోయినా ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. మనకు బి, సి ఆడియెన్స్‌ ఎక్కువగా ఉన్నారు.  ఒకవేళ మనం బాలీవుడ్‌ను ఫాలో అయితే బి, సి ఆడియెన్స్‌కు తగినట్లుగా సినిమాలు చేయాలి.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌..?

ప్రస్తుతం నేను రైటర్ గా 'డిక్టేటర్','సాహసం శ్వాసగా సాగిపో','సౌఖ్యం' చిత్రాలకు పని చేస్తున్నాను. వచ్చే సంవత్సరం నుండి కనీసం మూడు చిత్రాలను నిర్మించే విధంగా ప్లాన్ చేస్తున్నాను.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs