Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ-అక్కినేని అఖిల్


అక్కినేని అఖిల్, వినాయక్ దర్శకత్వం వహిస్తున్న 'అఖిల్' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయం కానున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దీపావళి కానుకగా నవంబర్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో అఖిల్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

చాలా నెర్వస్ గా ఉంది..

ఇది నా మొదటి సినిమా. రిలీజ్ డేట్ వాయిదా పడుతుందని అసలు అనుకోలేదు. దాని వలన నాపై స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. గ్రాఫిక్స్ వర్క్ అనేది మన చేతిలో ఉండదు. సి.జి. ఒక డిఫరెంట్ వరల్డ్. ఈ సినిమాలో అండర్ వరల్డ్ యాక్షన్ ఎపిసోడ్, క్లైమాక్స్ లో కదులుతున్న విమానంలో ఒక యాక్షన్ సీన్, చిరుత పులితో ఒక ఫైట్ ఉంటాయి. ఇవన్నీ న్యాచురల్ గా చేయలేము. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండకపోతే కథలో హైప్ ఉండదు. వినాయక్ గారు ఇప్పటివరకు ఎవరు చేయని యాక్షన్ ఎపిసోడ్స్ చేయాలని ఇలా డిజైన్ చేసారు. అవి సి.జి లో మాత్రమే సాధ్యం. గ్రాఫిక్స్ వర్క్ లేట్ అవ్వడం వలన సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేయాల్సి వచ్చింది. నా మొదటి సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వడం వలన చాలా నెర్వస్ గా ఉంది.

కథనే నమ్మాను..

ఈ సినిమాలో నాదొక టిపికల్ హీరో క్యారెక్టర్. పరిస్థితులకు తగ్గట్లుగా నడుచుకుంటూ ఉంటాడు. కథ మీదే డ్రైవ్ అవుతూ.. ఉండే పాత్ర. లార్జ్ స్కేల్ కాన్వాస్ కనిపించింది. క్యారెక్టర్ కంటే కథనే ఎక్కువగా నమ్మాను.

అవన్నీ రూమర్స్..

ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నేను నాన్నగారితో గొడవ పడ్డానని చాలా ఆర్టికల్స్ లో చదివాను. మేము ఈరోజు ఇంత కూల్ గా సినిమా రిలీజ్ చేస్తున్నామంటే దానికి కారణం నాన్నే. ఆయనతో నేను గొడవ పడ్డానని వినగానే జోక్ గా అనిపించింది. ఇది ఒక్కటే నీ జీవితం కాదు.. ఇంకా చాలా లైఫ్ ఉందని నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అనుకున్నదానికంటే లేట్ గా రిలీజ్ చేస్తున్నామని మేము కంగారు పడుతుంటే ఎన్నో డైరెక్షన్స్ ఇచ్చారు.

ఆ సాంగ్ ఒక్కటే 12 రోజులు షూట్ చేసాం..

ఇంట్రడక్షన్ సాంగ్ లో బాగా కనిపించాలని ప్రేక్షకులను ఆకట్టుకోవాలని కష్టపడి చేసాం. ఆ సాంగ్ ఒక్కటే సుమారుగా 12 రోజులు, రోజుకి 18 గంటల చొప్పున పని చేసాం. ఆ పాట నిడివి 5 నిమిషాలు ఉంటుంది. పాట కోసం రిహార్సల్స్ చేస్తునప్పుడు కళ్ళు తిరిగినట్లుగా అనిపించింది. స్పెషల్ డైట్ చేయడం వలన అలా అనిపించింది. సాంగ్ లో ఎక్కువ డాన్స్ ఉంటుంది.

ఒక జోనర్ లో చేయాలనుకోలేదు..

నా మొదటి సినిమా పలానా జోనర్ లో చేయాలని ఎప్పుడు ఆలోచించలేదు. నేను డెబ్యు హీరోను కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చే డైరెక్టర్ తో, కథ కన్విన్సింగ్ గా అనిపించే సినిమా చేయాలనుకున్నాను. అనుకున్నట్లుగానే మంచి కథతో, మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చే డైరెక్టర్ తో సినిమా చేసాను. ఆయన ఇచ్చిన నమ్మకం నాకు చాలా హెల్ప్ అయింది. ఈ మధ్యకాలంలో ఇంలాటి సినిమాలు రాలేదు. హీరోగా ఒక జోనర్ లో మాత్రమే సినిమాలు చేయాలనుకోవట్లేదు. అన్ని జోనర్స్ ను టచ్ చేయాలనుకుంటున్నాను. స్క్రిప్ట్ నచ్చితే ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటిస్తాను. అలానే మల్టీ స్టారర్ చిత్రాల్లో కూడా నటిస్తాను.

చిరంజీవి గారంటే ఇష్టం..

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డాన్సు విషయంలో నాకు చిరంజీవి గారంటే చాలా ఇష్టం. ఆ తరువాత ప్రభుదేవా గారు అలానే ఈ సినిమాతో జానీ మాస్టర్ బాగా నచ్చారు. నేను సినిమాలో ఇంత బాగా డాన్సు చేసానంటే క్రెడిట్ అంతా జానీ మాస్టర్ కే చెందుతుంది. నాన్నగారు నేను ఇప్పటివరకు డాన్సు చేయడం చూడలేదు. సినిమాలోనే మొదటిసారిగా చూసి నా కొడుకు ఇంత మంచి డాన్సరా అని షాక్ అయ్యారు. 

యాక్షన్ ఎపిసోడ్స్ అంటే ఇష్టం..

నాకు యాక్షన్ సీన్స్, స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. మూడు నాలుగు నెలలు థాయిలాండ్ లో కిచా అనే మాస్టర్ దగ్గర యాక్షన్ సీక్వెన్సెస్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. ఇది నా బిగినింగ్ స్టేజ్. సో.. ఒక్కొక సినిమా చొప్పున చేసుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాను. 

ఆయనొక ఎన్ సైక్లోపీడియా..

తాతగారు ఒక ఎన్ సైక్లోపీడియా. ఆయన నుండి ఒక సజెషన్ మాత్రమే తీసుకున్నానని చెప్ప్తే అది తప్పవుతుంది. ఆయన అనుభవం అంతా నేను గుర్తుంచుకుంటాను.

స్పోర్ట్స్ సినిమా చేస్తాను..

స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలో నటించాలనుంది కాని మంచి కథ కుదరాలి. స్పోర్ట్స్ కు సంబంధించిన ప్లేయర్స్ కావాలి. రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన 'సై' సినిమా ఒక్కటే మంచి స్పోర్ట్ కన్విన్సింగ్ చిత్రమనిపిస్తుంది. మంచి కథ దొరికితే ఖచ్చితంగా నటిస్తాను.

తెలుగుకే మొదటి ప్రాధాన్యత..

బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. కాని నా మొదటి ప్రాధాన్యత మాత్రం తెలుగుకే..

అమ్మ నటిస్తుందని నాకు తెలియదు..

అమ్మ(అమల) కమల్ హాసన్ గారితో నటించనుందని నాకు ఇంకా తెలియదు. 28 సంవత్సరాల తరువాత ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది.

సయేషా మంచి డాన్సర్..

సయేషా మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి. చాలా కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్. నాతో పోటీ పడి డాన్సు చేసింది. తనకు నాలుగైదు రకాలా డాన్సులు వచ్చు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs