Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ-మారుతి(బర్త్ డే స్పెషల్)


ఈరోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రం వంటి చిత్రాలను తెరకెక్కించి తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న దర్శకుడు మారుతి. రీసెంట్ గా ఆయన డైరెక్ట్ చేసిన భలే భలే మగాడివోయ్ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. అక్టోబర్ 8న మారుతి పుట్టినరోజు సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు.

Advertisement
CJ Advs

ఇంత పెద్ద సక్సెస్ అవుతుందనుకోలేదు..

భలే భలే మగాడివోయ్ కథ రాసుకొని డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించలేదు. నాని క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. మతిమరుపు నానికి మాత్రమే కాదని ప్రతి ఒక్కరికి ఉంటుందని నమ్మి మా సినిమాను ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేసారు. నేను చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొని ఓ బేసిక్ పాయింట్ తో కథ రాసుకున్నాను. నాని, లావణ్య త్రిపాఠి లను దృషిలో పెట్టుకునే కథ రెడీ చేశా.. ఆర్టిస్టులుగా వాళ్ళు పాత్రను పండించగలిగితేనే కథ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళగలదు. 

ఓవర్సీస్ లో సూపర్బ్ రెస్పాన్స్..

ఈ సినిమా ఏ సెంటర్స్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుందనుకున్నాం. ఓవర్సీస్ లో కూడా ప్లాన్ గా ఏం చేయలేదు. నా ఫ్రెండ్ తో కలిసి అక్కడ రిలీజ్ చేసాం. ఇప్పటివరకు ఓవర్సీస్ లో 50రోజులు ఏ సినిమా రన్ అవలేదు. భలే భలే మగాడివోయ్ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకోవడానికి సిద్ధమవుతుందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఓవర్సీస్ లో మాత్రమే కాదు కృష్ణా జిల్లాలో నాకు తెలిసిన ఫ్రెండ్స్ కు డిస్ట్రిబ్యూషన్ ఇప్పించాను. పదిలక్షలు వస్తే చాలనుకున్నాను. కాని అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి షాక్ అయ్యాను.

చరణ్ ఫోన్ చేసి అరగంటసేపు మాట్లాడాడు..

భలే భలే మగాడివోయ్ సినిమా హిట్ అవ్వగానే ఇండస్ట్రీ నుండి పెద్ద పెద్ద డైరెక్టర్ ఫోన్లు చేసి అప్రిషియేట్ చేసారు. మహేష్ బాబు, బన్నీ, ప్రభాస్ అందరూ సినిమా చూసి చాలా బావుందని చెప్పారు. రామ్ చరణ్ అయితే ఫోన్ చేసి అరగంట సేపు సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. నేను మొదట ఈ సినిమా కథ చిరంజీవి గారికి వినిపించాను. ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. సినిమా చూసి సంతోషపడ్డారు. 

నాలో చాలా కోణాలున్నాయి..

ఈరోజుల్లో, బస్ స్టాప్ చిత్రాలు ఒక జోనర్ కు చెందినవి. ప్రేమకథా చిత్రం ఓ కామెడీ, హారర్ ఫిలిం. ఆ తరువాత చేసిన కొత్త జంట క్లీన్ సినిమా. నాలో చాలా కోణాలున్నాయి. ఒకే జోనర్ కి పరిమితయ్యి సినిమాలు చేయను. అలా చేస్తే నేను ఇదే అని ముద్ర వేసేస్తారు. నేను అన్ని రకాలా సినిమాలు చేయగలను. నాలో ఉన్న ఆలోచనలను ఒక్కో సినిమాగా చేసుకుంటూ వెళ్తాను.

అదే నన్ను దర్శకునిగా మార్చింది..

ఆర్ట్ అసిస్టెంట్ గా పని చేసాను. అరటిపళ్ళు అమ్మేవాడిని. మెకానిక్ షెడ్ లో పని చేశా.. ఆఫీస్ బాయ్ గా చేసాను. నేను పుస్తకాలు చదవను. అయినా డైలాగ్స్ రాయగలుగుతున్నాను. దానికి కారణం నా జీవితంలో నేను ఎదుర్కొన్న దెబ్బలే. నా మీద ఆధారపడిన కుటుంబాలను నేను కాపాడుకోవాలి. వారిని రక్షించడానికి మనమేదైనా చేయగలం. అదే నన్ను దర్శకునిగా మార్చింది.

డైరెక్టర్ కంట్రోలర్ మాత్రమే.. 

నా సినిమాలో నాని, వెన్నెల కిషోర్ ఇలా అనుభవం ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు. నేను సీన్ నేరేట్ చేసేప్పుడు ఇలా చేస్తే ఇంకా బావుంటుంది సర్ అని నాకు సజెషన్స్ ఇచ్చేవారు. సినిమా అనేది టీం వర్క్. అందరూ ఇన్ పుట్స్ ఇస్తేనే సినిమా కంప్లీట్ అవుతుంది. డైరెక్టర్ అనేవాడు కంట్రోలర్ మాత్రమే. 

బన్నీతో సినిమా చేస్తా..

నా స్నేహితుల బ్యానర్ లో చేసిన ఈ సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. బన్నీ ఏమైనా కథ ఉంటే సినిమా చేద్దాం అనేవాడు. కాని డైరెక్టర్ గా నన్ను నేను ప్రూవ్ చేసుకొనే తనకు కథ చెప్పాలని నిర్ణయించుకున్నాను. బన్నీ కు కథ సిద్ధం చేస్తున్నా.. ఖచ్చితంగా సినిమా చేస్తాను. అరవింద్ గారు కూడా మంచి కథ ఉంటే చెప్పమన్నారు.

నాకు ఆర్ట్ అనేది ప్లస్..

సోషియో ఫాంటసి సినిమా చేయాలనుంది. అందులో ఎన్ని రకాలుంటాయో నాకు బాగా తెలుసు. స్టొరీ బోర్డింగ్ లెవెల్ నుండి అన్ని స్టెప్స్ మీద నాకు గ్రిప్ ఉంది. అంజి సినిమాకు పని చేసాను. డిక్యు ఎంటర్టైన్మెంట్స్ లో చాలా సంవత్సరాలు వర్క్ చేసాను. నాకు ఆర్ట్ అనేది బాగా ప్లస్ అయ్యేది. నా థాట్ ని ఆర్ట్ గా వేసి నాకు ఏం కావాలో చెప్పేవాడిని. 

ప్రొడ్యూసర్ గా సినిమాలు చెయ్యను..

నా స్నేహితులు కొంతమంది ప్రొడ్యూస్ చేయమని అడిగితే కథ కూడా వినకుండా చేసేసాను. అలా చేయడం వల్ల నాపై చాలా ప్రభావం చూపాయి. ప్రొడ్యూసర్ గా అయితే ఇంక సినిమాలు చేయను. కథ నచ్చితే మాత్రం ఆలోచిస్తాను.

చిన్న చిత్రాలపై అభిమానం ఉండదు.. 

ఈరోజుల్లో మూవీ రిలీజ్ అయిన తరువాత నాతో సినిమా చేయాలని చాలా మంది నిర్మతాలు అడిగారు. అందులో నా స్నేహితులే 10 మంది ఉన్నారు. బయటవారితో సినిమా ఎప్పుడు చేస్తానో.. తెలియదు. పెద్ద హీరోలతో సినిమా చేయడం సులభం. వారిని చూసే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అదే చిన్న సినిమా అయితే ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించడమే చాలా కష్టం. అందుకే కథను హైలైట్ గా చేస్తూ చిన్న సినిమా తీసి హిట్ కొట్టాలని నా కెరీర్ స్టార్ట్ చేసాను. చిన్న సినిమాలకు అభిమానం ఉండదు. కాని చిన్న సినిమాలు బ్రతికితేనే ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది. క్వాలిటీ తో వచ్చిన ఏ చిన్న సినిమాలు ఫ్లాప్ కాలేదు. చిన్న సినిమా సక్సెస్ అయితే ప్రాఫిట్ డబ్బు పెద్ద సినిమాకు రాదు.

హిందీ లో మంచి సినిమాతో ఎంట్రీ ఇవ్వాలి..

నేను డైరెక్ట్ చేసిన ప్రేమకథా చిత్రం సినిమా హిందీలో చేయాలనుకున్నాం. కాని అక్కడ ఆర్టిస్టుల డేట్స్ కుదరక లేట్ అవుతూ వస్తుంది. నాకు తెలుగంటేనే ఇష్టం. తెలుగులోనే సినిమాలు చేస్తాను. హిందీలో చేస్తే మాత్రం మంచి సినిమాతో ఎంట్రీ ఇవ్వాలి.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

కథలు సిద్ధం చేసుకుంటున్నాను. రాజ్ తరుణ్ తో జిఏ2 ప్రొడక్షన్స్ తో కలిసి సినిమా చేస్తున్నాం. అది కేవలం ప్రొడక్షన్ మాత్రమే. డైరెక్ట్ చెయ్యట్లేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs