Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ-రామ్


ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందిన చిత్రం శివమ్. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో రామ్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

శివమ్ చిత్రం ఎలా ఉండబోతోంది..?

ఇదొక మంచి కంటెంట్ ఉన్న హై ఓల్టేజ్ లవ్ స్టోరి. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ. చాలా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. సినిమాలో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కథలో భాగంగా ఉంటాయి. ఇందులో నా పాత్ర పేరు శివ. డెప్త్ ఉన్న అగ్రెసివ్ క్యారెక్టర్. తను అనుకున్నది ముందు చేసేసి  తరువాత ఆలోచిస్తూ ఉంటాడు. సినిమాలో మెయిన్ పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. 

కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?

ఆయన స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. కేవలం కథ నచ్చి ఆయనతో సినిమా చేయడానికి ఓకే చెప్పాను. ఆయన ఈ సినిమాకు కొత్త వారైనా షూట్ లో చుట్టూ ఉండే వారంతా మంచి ఎక్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ ఉండేలా జాగ్రత్త పడ్డాం. నాకు ఏం చెప్పారో స్క్రీన్ పై అదే ప్రెజంట్ చేసారు. కొత్త డైరెక్టర్ అయినా చాలా బాగా డైరెక్ట్ చేసాడు.

కాస్ట్యూమ్స్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు..?

ఎక్కువగా ఫారెన్ లోనే కాస్ట్యూమ్స్ కొంటాను. ట్రెండీగా కనిపించే ప్రతి ఒక్కటి తీసుకుంటాను. ఈ చిత్రానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ మొత్తం పోర్చుగల్ లో తీసుకున్నాను. నేను ధరించే ప్రతిది యూత్ ఫుల్ గా ఉండేలా జాగ్రత్త పడతాను.

ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా..?

శ్రీ స్రవంతి మూవీస్ మా సొంత బ్యానర్. ఈరోజు బ్యానర్ స్థాపించి ముప్పై సంవత్సరాలయినందుకు చాలా సంతోషంగా ఉంది. సెపరేట్ గా నేను ప్రొడ్యూస్ చేసే ఆలోచన లేదు. ఈ బ్యానర్ లోనే కొన్ని పనుల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను. పెదనాన్న(రవికిషోర్) గారు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. నేను దానికి బ్రేకులు వేస్తూ ఉంటా. ఆయన కంటెంట్ ను నమ్మే సినిమాలు చేస్తారు. కేవలం హీరో మీద ఆధారపడి అయితే అసలు చేయరు.

స్క్రిప్ట్ లో విషయంలో ఏమైనా సజెషన్స్ ఇస్తారా..?

నాకు కథ చెప్పినప్పుడే ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటాను. ఒక్కసారి స్క్రిప్ట్ లాక్ చేసాక ఇంకేం సజెషన్స్ ఇవ్వను. 

ప్రయోగాత్మక చిత్రాల్లో నటించే ఆలోచనలు ఉన్నాయా..?

ఎక్స్ పెరిమెంట్స్ చేస్తుంటే వర్క్ అవుట్ అవ్వట్లేదు. టివి లో మాత్రమే చూస్తున్నారు. కమర్షియల్ హిట్స్ రావట్లేదు. అందుకే కమర్షియల్ సినిమాలే చేయాలని డిసైడ్ అయ్యాను. కమర్షియల్ ఫార్మాట్ లో ఉన్న ఎక్స్ పెరిమెంటల్ ఫిలింలో అయితే నటిస్తాను.

సినిమాలో హైలైట్స్ ఏంటి..?

సాంగ్స్ పిక్చరైజేషన్, క్లైమాక్స్ మేజర్ హైలైట్స్ గా నిలుస్తాయి. సాంగ్స్ విజువల్ గా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమాలో ఓ ఇంటరెస్టింగ్ పాయింట్ ఉంటుంది. అది ఖచ్చితంగా అందరికి రీచ్ అవుతుంది.  

రాశి ఖన్నా మీతో పోటీ పడి డాన్సు చేయగలిగిందా..?

తను మంచి యాక్ట్రస్ అండ్ డాన్సర్. సినిమాలో చివరి పాటలో వచ్చే మాసివ్ స్టెప్స్ బాగా చేసింది. లవ్ స్టొరీ కనుక హీరో, హీరోయిన్ ఇద్దరికీ ఇంపార్టన్స్ ఉంటుంది. మొదట్లో రాశి కాస్త నర్వస్ గా ఫీల్ అయినా తరువాత నుండి మాత్రం డాన్సు, నటన అన్ని బాగా చేసింది. 

ఆడియోకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది..?

జగడం, రెడీ సినిమాల తరువాత మరలా దేవిశ్రీప్రసాద్ గారితో వర్క్ చేయాలనుకున్నాను. కాని వాయిదా పడుతూ వస్తున్నాయి. సో.. ఈ సినిమాకు నా నెక్స్ట్ సినిమా రెండింటికి ఆయన మ్యూజిక్ చేసేలా ప్లాన్ చేసుకున్నాను. ఓ సూపర్ హిట్ ఆల్బం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆయనతో కలిసి వర్క్ చేసాం. ఆడియో కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

వేరే భాషల్లో ఏమైనా సినిమాలు చేస్తున్నారా..?

తమిళంలో నటించమని చాలా సంవత్సరాలుగా ఆఫర్స్ వస్తున్నాయి. కాని ఫస్ట్ మూవీ ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలి. సో.. మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

హరికథ అనే చిత్రంలో నటిస్తున్నాను. కంటెంట్ ఉన్న మంచి కమర్షియల్ ఫిలిం అది. రియలిస్టిక్ గా ఉండే లవ్ స్టొరీ అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs