Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ-హరీష్ శంకర్


మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌, రెజీనా జంటగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం సుబ్రమణ్యం ఫర్‌సేల్‌. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

సినిమా గురించి చెప్పండి..?

ఇదొక మంచి ఎంటర్టైనింగ్ మూవీ. హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. సినిమాలో ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. క్లైమాక్స్ సీన్స్ లో హీరో ఫైట్ చేయడు. ఎమోషనల్ సన్నివేశంతో సినిమా ఎండ్ అవుతుంది. నేను ఏ సినిమాకు ఇప్పటివరకు గ్లిజరిన్ వాడలేదు. ఈ సినిమా కోసం చాలా ఎక్కువగా ఉపయోగించాను. అన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. కథ పాతదే అయిన స్క్రీన్ ప్లే మాత్రం కొత్తగా ఉంటుంది.  

దిల్ రాజు గారి బ్యానర్ లో మీరు చేసిన సినిమా ఫ్లాప్ వచ్చింది కదా.. మీ ఇద్దరి మధ్య రిలేషన్ బానే ఉందా..?

ఆయన బ్యానర్ లో నేను చేసిన సినిమా రామయ్య వస్తావయ్య తో డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది నష్టపోయారు. తక్కువ సమయంలో అనుకున్న బడ్జెట్ లో సినిమా తీసాం. ప్రొడ్యూసర్ గా దిల్ రాజు గారికి ఆ సినిమాతో నష్టాలు రాలేదు. ఫ్లాప్ అనే విషయం మా మధ్య ఎలాంటి డిస్టర్బన్స్ క్రియేట్ చేయలేదు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కాకపోతే షూటింగ్ అమెరికాలో చేసేవాళ్ళం కాదు. కథ ప్రకారం షూటింగ్ చాలా భాగం అమెరికాలోనే చేయాలి. హిందీలో ఎన్నారై బేస్డ్ మూవీస్ చాలా వచ్చాయి. తెలుగులో పూర్తి స్థాయిలో వచ్చిన ఎన్నారై బేస్డ్ మూవీ ఇదే అవుతుంది. దిల్ రాజు గారితో మరో సినిమా కూడా చేసే ప్లాన్ లో ఉన్నాను.

సాయిధరమ్‌తేజ్‌ ను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం..?

నేను ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు స్టార్ హీరోలతో చేయాలనుకోలేదు. రేయ్ సినిమా ట్రైలర్ చూసి తేజ్ అయితే నా స్క్రిప్ట్ కు కరెక్ట్ గా సూట్ అవుతాడనిపించింది. తేజ్ నటించిన రేయ్, పిల్లా నువ్వులేని జీవితం సినిమాలు రిలీజ్ కు ముందే తనకు స్టొరీ వినిపించాను. ఈ సినిమాలో చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. లుక్ పరంగా చాలా కేర్ తీసుకున్నాం. తన డాన్సులు, ఫైట్స్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటాయి.

టైటిల్ లో సేల్ అని ఎందుకు పెట్టారు..?

ప్రస్తుతం ప్రతి దాంట్లో విపరీతమైన కాంపిటిషన్ ఉంది. దానికి తగ్గట్లుగానే మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. ఆషాడం సేల్, అక్షయతృతీయ సేల్ అని రకరకాల సేల్స్ పెడుతున్నారు. సినిమాలో మా హీరో అమెరికాలో ఒక్కడే ఉంటాడు. మా సినిమాను మేమే మార్కెటింగ్ చేసుకోవాలి కదా అందుకే ఆ టైటిల్ పెట్టాను. మిరపకాయ్ సినిమా టైంలోనే ఆ టైటిల్ అనుకున్నాను.

రెజీనా ఎలా పెర్ఫార్మ్ చేసింది..?

మొదట ఈ సినిమాకు హీరోయిన్ గా రెజీనా అనుకోలేదు. అప్పటికే రెజీనా, తేజ్ కలిసి పిల్లా నువ్వులేని జీవితం సినిమా చేసారు. అందుకే కొత్త అమ్మాయిని పెట్టాలనుకున్నాను. పవర్ సినిమాలో రేజీనా పెర్ఫార్మన్స్ నాకు చాలా నచ్చింది. సాధారణంగా నా సినిమా హీరో మీద ఓపెన్ అయ్యి హీరో మీదే కట్ అవుతుంది. కాని ఈ సినిమా అంతా హీరోయిన్ మీద నడుస్తుంటుంది. తన లైఫ్ లోకి హీరో వస్తాడు. సీత పాత్రలో రెజీనా సెట్ అవుతుందనిపించింది. పిల్లా నువ్వులేని జీవితం తరువాత రేయ్ సినిమా రిలీజ్ అయింది. ఓ సినిమా గ్యాప్ ఉందని రెజీనా నే సెలెక్ట్ చేసుకున్నాను. తను డైలాగ్స్ మాత్రమే కాకుండా సెట్స్ లో కూడా తెలుగు మాట్లాడుతుంది. ఈ సినిమాలో హీరోతో పాటు సమానంగా నటించింది. 

ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ చేసే ఆలోచన ఏమైనా ఉందా..?

నేనెప్పుడూ అధ్బుతమైన కథ చెప్పాలనుకోను. ప్రేక్షకులకు అర్ధమయ్యే కథ చెప్పలనుకుంటాను. ఇప్పటివరకు ప్రయోగాత్మక చిత్రాలు చేయలేదు. షాక్ సినిమానే నాకు పెద్ద షాక్ ఇచ్చింది. నాలుగు సంవత్సరాలు నన్ను ఇంట్లో కూర్చోబెట్టింది. సో.. ఎక్స్ పెరిమెంటల్ ఫిల్మ్స్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు.

గబ్బర్ సింగ్ తరువాత పవన్ కళ్యాన్ గారిని కలిసారా..?

గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయిన మూడు రోజులకు పవన్ గారిని కలిసాను. ఆయన సినిమా టాక్ ఏంటి..? కలెక్షన్స్ ఎలా ఉన్నాయని అడగకుండా ఏం పుస్తకాలు చదివావు. నెక్స్ట్ ఏం చేయబోతున్నావనే అడిగారు. ఆయనతో జర్నీ చాలా ఎంజాయ్ చేసాను. గబ్బర్ సింగ్ సినిమాతో నాకు చాలా ఎక్స్పోజర్ వచ్చింది. ఆ సినిమా హిట్ తో నాకు చాలా ఆటిట్యూడ్ వచ్చిందని కొందరు అన్నారు. ఆటిట్యూడ్ ఉండడం వలనే నాకు గబ్బర్ సింగ్ వచ్చిందని చెప్పాను. ఆ సినిమాతో నాకు ఎలాంటి హ్యాంగ్ ఓవర్ రాలేదు.

సర్దార్ గబ్బర్ సింగ్ మీరు చేయలేకపోతున్నారని ఫీల్ అవుతున్నారా..?

అసలు లేదు. మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఒకవేళ గబ్బర్ సింగ్2 చేయాల్సి వస్తే చాలా ప్రెజర్ గా ఫీల్ అయ్యేవాడిని. బాబీ నాకు మంచి ఫ్రెండ్. సర్దార్ గబ్బర్ సింగ్ ను చాలా బాగా డైరెక్ట్ చేయగలడు. ఖచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంది.

ఈ కథకు ఇన్స్పిరేషన్ ఏంటి..?

నన్ను చాలా సినిమాలు, ఇన్సిడెంట్స్, క్యారెక్టర్స్ ఇన్స్పైర్ చేస్తాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను. ఈ సినిమా కూడా అలానే చేసాయి. మంచి పాటలు, మంచి సంభాషణలు, ఎమోషనల్ క్లైమాక్స్ ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే డైలాగ్స్ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

పవన్ కళ్యాన్ గారికి స్క్రిప్ట్ రాస్తున్నాను. రవితేజ గారితో సినిమా చేయాలనుకుంటున్నాను. ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను. మంచి కథ రెడీ చేసుకొని తనకు వినిపిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs