Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ- హీరోయిన్ రెజీనా


మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌, రెజీనా జంటగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం సుబ్రమణ్యం ఫర్‌సేల్‌. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ రెజీనా తో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి..?

ఈ చిత్రంలో సీత అనే పాత్ర పోషించాను. పెద్ద ఫ్యామిలీలో అందరి అనుబంధాలతో పెరిగిన అమ్మాయి. బేసిక్ గా తను చాలా అమాయకురాలు. కాని బయటకి అలా కనిపిస్తే తనని ఎవరైనా మోసం చేస్తారని అమయాకంగా కనిపించకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంటుంది.

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఎలా ఉండబోతోంది..?

ఇదొక కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. సినిమాలో హీరో కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే అమెరికా వెళ్తాడు. హీరోయిన్ కొన్ని అనివార్య కారణాల వలన అమెరికా వెళ్తుంది. తనకొక సమస్య రావడంతో హీరో డబ్బు ఇస్తే సమస్య పరిష్కరిస్తానని చెబుతాడు. ఈ అంశాలపై సినిమా నడుస్తుంటుంది. సోషల్ మీడియా వలన ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ సినిమాలో చూపించాం. 

సినిమాలో చాలా గ్లామర్ గా కనిపించినట్లున్నారు..?

నా నిజ జీవితంలో గ్లామరస్ గా ఉండడానికి ఇష్టపడను. కేవలం జీన్స్, టీషర్ట్ మాత్రమే వేసుకుంటాను. నా మొదటి సినిమా ఎస్ ఎం ఎస్ లో రెజీనా ఇంకా గ్లామర్ గా ఉంటే బావుండేదని మీడియా వారే చెప్పారు. సో.. అప్పటినుండి కొంచెం గ్లామర్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఈ సినిమాలో హరీష్ శంకర్ నన్ను కాస్త గ్లామర్ గానే చూపించారు. కాని వల్గర్ గా అయితే ఎక్కడా ఉండదు. సినిమాలో గ్లామర్ అనేది క్యారెక్టర్ లో లింక్ అయి ఉంటుంది. 

కాస్ట్యూమ్స్ విషయంలో ఏమైనా సజెషన్స్ ఇస్తారా..?

కేవలం కాస్ట్యూమ్స్ విషయంలోనే కాదు. హెయిర్ స్టైల్, మేకప్ ఇలా చాలా విషయాల్లో కేర్ తీసుకుంటాను. బెస్ట్ కావాలంటే హార్డ్ వర్క్ చేయాలి. ఈ కాస్ట్యూమ్స్ వద్దు అని నేను చెప్పిన కొన్ని సందర్బాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేనొక సెలబ్రిటీని. సో.. నన్ను జడ్జ్ చేసేవారు, ఫాలో చేసేవారు చాలా మంది ఉంటారు. కాబట్టి నేను డిగ్నిటీ, ఇమేజ్ మెయిన్టెయిన్ చేయాలి. 

రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి ఇబ్బంది పడలేదా..?

పిల్లా నువ్వు లేని జీవితం నుండి నేను తేజ మంచి స్నేహితులం. తను చాలా మెచ్యూర్డ్ యాక్టర్. ఆ సినిమాలో మా ఇద్దరికీ ఎలాంటి రొమాంటిక్ సీన్స్ ఉండవు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో అన్ని రకాలా ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్, రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. షూట్ రోజు ఏం చేయాలో తేజ కు నాకు క్లారిటీ ఉంటుంది. డైరెక్టర్ సీన్ చెప్పగానే రిహార్సల్స్ చేసి పెర్ఫార్మ్ చేసేవాళ్ళం. అంతేకాని రొమాంటిక్ సీన్స్ లో నటించాలని ఎక్కువగా ఆలోచించేవాళ్ళం కాదు. 

షూటింగ్ టైంలో ఏమైనా మెమొరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా..?

అందరూ యాక్టర్స్ జాబ్ చాలా ఈజీ అనుకుంటారు కాని అసలు కాదు. న్యూజెర్సీ లో ఒక ప్రాంతంలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలో రివర్ దగ్గర షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ కండిషన్స్ లో నేను సరిగ్గా మాట్లడలేకపోతున్నాను. కాని నా డైలాగ్స్ గుర్తుంచుకొని పెర్ఫార్మ్ చేయాలి. నాకు ఏడుపు వస్తుంది కాని చాలా కంట్రోల్ చేసుకున్నాను. సుమారుగా ఆ సన్నివేశం కోసం 34 టేక్స్ తీసుకున్నాను. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

సందీప్ కిషన్ తో తమిల్ లో ఓ సినిమాలో నటిస్తున్నాను. అది డిసెంబర్ లేదా జనవరి లో రిలీజ్ అవుతుంది. కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ లో ఉన్నాయి.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs