'యజ్ఞం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకు దర్శకునిగా పరిచయమయిన డైరెక్టర్ ఏ.ఎస్.రవి కుమార్ చౌదరి. ఆ తరువాత ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్టు సినిమా పడలేదు. దాదాపు పది సంవత్సరాల తరువాత 'పిల్లా నువ్వు లేని జీవితం' చిత్రంతో మరలా ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్ 25 న రవికుమార్ చౌదరి పుట్టినరోజు సందర్భంగా చిత్ర విశేషాల గురించి విలేకర్లతో ముచ్చటించారు.
గోపీచంద్ తో మరోసారి..
'యజ్ఞం' చిత్రం తరువాత మరలా గోపీచంద్ తో పని చేసే అవకాశం వచ్చింది. జూలై 19 న ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. ఇప్పటికే ఈ చిత్రం మొదటి భాగం టాకీ పార్ట్, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. 'యజ్ఞం' సినిమా యాక్షన్ ఎంటర్టైనింగ్ అయితే ఇది ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ చిత్రం. కథలో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉంటాయి. నేను ఇప్పటివరకు ఎమోషనల్ చిత్రాలే తెరకెక్కించాను. మొదటిసారిగా ఎంటర్టైనింగ్ సినిమా తీస్తున్నాను. బడ్జెట్ పరంగా, కాస్టింగ్ పరంగా నా కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ ఇది. డిసెంబర్ 25 న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం.
డైరెక్టర్ కు గౌరవాన్నిచ్చే హీరో..
డైరెక్టర్ ను ప్రేమగా చూసే విధానం గల హీరో గోపీచంద్. సినిమాలో తన క్యారెక్టర్ ఏంటి..? ఎలా నటించాలి..? అనే విషయాలను తప్ప మిగిలిన విషయాలను పట్టించుకోడు. 'యజ్ఞం' సినిమా సమయంలో నటనపై ఉన్న కసి ఈరోజుకు కూడా తనలో ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమాలో చలాకీగా గా ఉండే పాత్రలో గోపీచంద్ కనిపిస్తాడు. చాలా స్టైలిష్ ఉంటాడు.
బర్త్ డే రిసల్యూషన్స్..
ఇప్పటివరకు నేను చేసే ప్రతి సినిమాకు మధ్య రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాను. ఇకపై అలా కాకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని భావిస్తున్నాను. అలానే సినిమాల్లో నేను చేసిన తప్పులు ఇంక రిపీట్ కాకుండా చూసుకుంటాను.
కథ కంటే కథనం ముఖ్యం..
'యజ్ఞం' తరువాత నేను చేసిన 'ఆటాడిస్తా', 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రాలకు ప్రేక్షకాదరణ లభించలేదు. టివి లో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ చిత్రాల తరువాత ఇలా కాదు డిఫరెంట్ గా చేయాలనుకున్నాను. కథ కంటే కథనం అనేది ముఖ్యమని తెలుసుకున్నాను. ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ చేసిన 'పిల్లా నువ్వు లేను జీవితం' సినిమాతో విజయాన్ని అందుకున్నాను.
డైరెక్టర్ గానే ఉంటా..
కొంతమంది దర్శకులు సినిమాలో నటించమని అడిగారు. ట్రైన్ లో ఇంజన్ ఉంటుంది. భోగీలు ఉంటాయి. నాకు ట్రైన్ లో ఇంజన్ లా ఉండడమే ఇష్టం. అందుకే డైరెక్టర్ గానే ఉండాలని ఫిక్స్ అయ్యాను.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
కళ్యాన్ రామ్ బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా సినిమా చేస్తున్నాం. జనవరి లో సినిమా షూటింగ్ మొదలు పెట్టి జూన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు.