Advertisement
Google Ads BL

చెన్నై స్టార్స్ కు బదులుగా ఆంధ్ర స్టార్స్!


తెలంగాణా సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు సి.ఎం రిలీఫ్ ఫండ్ కొరకు తెలంగాణా స్టార్స్ వర్సెస్ చెన్నై హీరోస్  స్టార్ క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించనున్నారని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వలన చెన్నై స్టార్స్ కు బదులుగా తెలంగాణా స్టార్స్ వర్సెస్ ఆంధ్ర స్టార్స్ తో ఈ క్రికెట్ మ్యాచ్ ను నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ లో విజేతలుగా నిలిచిన వారికి 'కాకతీయ కప్' ను ప్రెజెంట్ చేయనున్నారు. ఈ మ్యాచ్ ఆగస్ట్ 23, 2015 న ఎల్.బి. స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో..

Advertisement
CJ Advs

ఎమ్.ఎస్.నాగరాజు మాట్లాడుతూ "ఆగస్ట్ 23న ఎల్.బి. స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు చెందిన ప్రజలు  ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చి విజయవంతం చేస్తారని భావిస్తున్నాను. ఇప్పటికే ఇరవై వేల పాసులను ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేసాం." అని చెప్పారు. 

సంగకుమార్ మాట్లాడుతూ "ఈ అసోసియేషన్ స్థాపించినప్పటి నుండి అందరూ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ముందు మేము అనుకున్నట్లుగా తెలంగాణా స్టార్స్ వర్సెస్ చెన్నై స్టార్స్ తో ఈ క్రికెట్ మ్యాచ్ నిర్వహించవల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వలన చెన్నై హీరోస్ కు బదులుగా ఆంద్ర స్టార్స్ తో ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నాం" అని చెప్పారు.

ఆకాష్ మాట్లాడుతూ "ఆగస్ట్ 23న ఈ క్రికెట్ మ్యాచ్ ఎల్.బి. స్టేడియంలో జరగనుంది. తెలంగాణా స్టార్స్ కు కెప్టెన్ గా నేను వ్యవహరిస్తుండగా ఆంధ్రప్రదేశ్ స్టార్స్ కు కెప్టెన్ మనోజ్ నందం వ్యవహరిస్తారు" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నరసింహా రెడ్డి, సంపత్, మనోజ్ నందం, సాంబశివ తదితరులు పాల్గొన్నారు.

 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs