Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ- హీరో ఉపేంద్ర


'ఏ' , 'రా' , 'ఉపేంద్ర' వంటి విభిన్న చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కన్నడ స్టార్ హీరో 'ఉపేంద్ర'. తను నటించిన చిత్రాలను తెలుగులో అనువదించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు సైతం అందుకున్నాడు. రీసెంట్ గా 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం ఆయన కన్నడంలో నటించిన 'ఉప్పి 2' చిత్రాన్ని భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి) ‘ఉపేంద్ర`2’ అనే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర తో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

సినిమా ఎలా ఉండబోతోంది..?

'ఉపేంద్ర' చిత్రాన్ని డైరెక్ట్ చేసినప్పుడే నాకొక ఆలోచన వచ్చింది. ఉపేంద్ర సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ను మూడు సీజన్స్ లో ఒకడు లవ్ చేసి చివరగా ముగ్గురుని వదిలేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తరువాత ఏం జరుగుతుందనేది ఈ సినిమాలో చూపించాం. 'ఉపేంద్ర' చిత్రాన్ని నేను అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తే 'ఉపేంద్ర2' సినిమాని నువ్వు అనే కాన్సెప్ట్‌తో చిత్రీకరించాను.

విభిన్న చిత్రాలను తెరకెక్కించడం వెనుక ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారా..?

నా కథలకు ఇన్స్పిరేషన్ అంటూ ఎవరు లేరు. కాని 'జయకృష్ణ మూర్తి' గారి పుస్తకాలు బాగా చదువుతాను. ఆయన పుస్తకాలలో చాలా డెప్త్ ఉంటుంది. అందరూ మనసులో అనుకునే విషయాలను బయటకు చెప్పలేరు. వారందరి ఫీలింగ్స్ ను నేను సినిమాగా చూపిస్తాను. నేను డైరెక్ట్ చేసే చిత్రాల్లో నా ఇన్నర్ ఫీలింగ్స్ కూడా ఉంటాయి. పర్టిక్యులర్ గా 'ఉపేంద్ర2' ను తెరకెక్కించడానికి కారణం మాత్రం 'ఉపేంద్ర' సినిమానే. ఈ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. సాంగ్స్, యాక్షన్ ఇలా అన్ని అంశాలు ఉంటాయి కాని రెగ్యులర్ సినిమాల మాత్రం ఉండదు. వేరే స్టైల్ లో ఉంటుంది. సినిమాలో ఒక ట్రిక్ ఉంటుంది. చాలా క్యూరియస్ గా నడుస్తుంటుంది.

మీతో పాటు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. వారి రోల్స్ ఎలా ఉంటాయి..?

నా సినిమాలో నటించే ప్రతి ఒక్కరికి ఇంపార్టన్స్ ఉంటుంది. సబ్జెక్టు లో భాగంగానే పాత్రలను డిజైన్ చేస్తాను. నా మూవీస్ లో హీరోయిన్స్ కేవలం పాటలకు, రోమాన్స్ కు పరిమితం కాకుండా వారి పాత్రలను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేస్తాను. 

నల్లమలుపు బుజ్జి గారి గురించి..?

'రా' నా జీవితంలో మర్చిపోలేని సినిమా. ఆ సమయంలో నాతో ఆ సినిమా చేసి హిట్‌ ఇచ్చిన బుజ్జిగారు  'ఉపేంద్ర2' ను తెలుగులో కూడా రిలీజ్ చేద్దామని అడిగారు. కన్నడంలో ‘ఉప్పి`2’ రిలీజ్‌ అయ్యే రోజునే తెలుగులో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. స్టార్ ప్రొడ్యూసర్ గా ఆయన ఎంత బిజీ గా ఉన్నా ఉపేంద్ర సినిమాను నేను చూసాను 'ఉపేంద్ర2' ను నేను చూడకర్లేదు. తెలుగులో నేనే రిలీజ్ చేస్తానని ముందుకొచ్చారు. ఆయన ఈ చిత్రాన్ని తీసుకోవడం వలన ఈ సినిమాకి హైప్ ఇంకాస్త పెరిగింది. 

ఆఫ్ స్క్రీన్ ఉపేంద్ర ఎలా ఉంటారు..?

నిజజీవితంలో ఎక్కువగా ఎవరితో మాట్లాడను. నాలో నేను ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాను. నేను ఎవరు, ఏం చేస్తున్నాను, దేవుడంటే ఎవరు, నిజం అంటే ఏంటి అనే విషయాలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. అలా ట్రావెల్ చేయడం నాకు ఇష్టం.

మీరు ఫిలాసిఫికల్ గా ఆలోచించడం వలన క్రియేటివ్ థాట్స్ వస్తాయా..?

ఇండస్ట్రీకు ఏం లేకుండా వచ్చాను. నా దగ్గర పెద్ద హీరోలు లేరు, పెద్ద బడ్జెట్ కూడా లేదు. కాబట్టి నాకున్న బడ్జెట్ లో ఆడియన్స్ ను ఆకర్షించేలా సినిమాలు తీయాలి. అప్పుడే మనలో క్రియేటివిటీ మొదలవుతుంది. నా సినిమా టైటిల్ తోనే ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయాలి. అందుకే టైటిల్స్ అన్ని డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటాను.

డైరెక్టర్ అవుదామని వచ్చిన మీరు అతి తక్కువ సినిమాలను డైరెక్ట్ చేయడానికి కారణం..?

దర్శకునిగా రొటీన్ గా ఉండే చిత్రాలు తెరకెక్కించడం నాకు నచ్చదు. డిఫరెంట్ గా ఉండే కాన్సెప్ట్స్ ఉంటేనే సినిమాలు చేయాలనిపిస్తుంది. ఆ ఐడియాస్ నాకు రావడానికి సమయం పడుతుంది. అందుకే డైరెక్టర్ గా చాలా తక్కువ సినిమాలు చేసాను. హీరోగా నటించినపుడు కంటే డైరెక్ట్ చేసినపుడు చాలా ఎంజాయ్ చేస్తాను.

కన్నడ ఇండస్ట్రీ ఎలా ఉంది..?

ఒకప్పటి కంటే ఇప్పుడు బాగా పికప్ అవుతుంది. బడ్జెట్ పరంగా, ఫారెన్ రిలీజ్ అయ్యే విషయాలలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. వేరే రాష్ట్రాల్లో కూడా కన్నడ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలానే కన్నడలో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. రీసెంట్ గా అక్కడ రిలీజ్ అయిన 'బాహుబలి' బిగ్గెస్ట్ హిట్ అయింది. కర్ణాటక చరిత్రలో అంత పెద్ద హిట్ లేదు.

చాలా గ్యాప్ తరువాత హీరోగా తెలుగులో మీ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నారా..?

తెలుగు ఆడియన్స్ కు సినిమా పట్ల ఉన్న అభిమానం నేను ఏ ఆడియన్స్ లో చూడలేదు. ఓ మంచి సినిమాను తీస్తే వారు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇప్పటివరకు నేను నటించిన చిత్రాలు మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుందనుకుంటున్నాను. 

ఎలాంటి సినిమాలు ఎక్కువగా చూస్తారు..?

నేను అన్ని రకాల సినిమాలు చూస్తాను. ఓ టెక్నీషియన్ లా కాకుండా ప్రేక్షకుడిలా సినిమా చూస్తాను. నా పక్కన ఉన్నవారు ఇక్కడ ల్యాగ్ ఉంది. ఈ సీన్ బాలేదని చెప్తారు. కాని నేను సినిమాలో ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తూ చూస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs