Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ- శ్రుతిహాసన్


మహేష్ బాబు, శ్రుతిహాసన్ జంటగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శ్రీమంతుడు'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 7న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రుతిహాసన్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

'శ్రీమంతుడు'లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది..?

ఈ సినిమాలో నా పాత్ర పేరు చారుశీల. బోల్డ్ గా డైనమిక్ గా, ఇండిపెండెంట్ గా ఉండే అమ్మాయి. డైరెక్టర్ గారు నా పాత్రను చాలా సెన్సిబుల్ గా డిజైన్ చేసారు. నేను ఏ సినిమాలో ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో కనిపించలేదు. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 

మహేష్ బాబుతో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?

'ఆగడు' సినిమాలో మహేష్ బాబు గారితో ఐటెం సాంగ్ లో నటించాను. మొదటిసారి ఆయనతో ఫుల్ లెంగ్థ్ ఉండే పాత్రలో నటించాను. సినిమాల పట్ల కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం  గలవారు. ఇండస్ట్రీలో టాప్ హీరో అనే యాటిట్యూడ్ లేదు. సెట్స్ లో చాలా క్రమశిక్షణగా ఉంటారు. అందుకే ఈరోజు ఆయన ఈ స్థాయిలో ఉన్నారు. అలానే జగపతిబాబు, సుకన్య వంటి సీనియర్ యాక్టర్స్ తో నటించాను. సెట్స్ లో వారితో ఫ్రెండ్లీ నేచర్ ఉండేది. వారి నుంచి చాలా నేర్చుకున్నాను.

ఆడియోకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది..?

ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా పాటలను ఇష్టపడుతున్నారు. దేవి మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాకు 'జతకలిసే' సాంగ్ చాలా నచ్చింది. పిక్చరైజేషన్ కూడా బావుంటుంది. సినిమా చూసినప్పుడు ఆడియన్స్ కు సాంగ్స్ ఇంకా బాగా నచ్చుతాయి. సినిమాలో రొమాన్స్ ను కూడా డిఫరెంట్ గా చూపించారు. 

సక్సెస్ హీరోయిన్ అయ్యారు కదా.. దీనిపై మీ స్పందన..?

సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లో నేను నటించిన చిత్రాలు కొన్ని ఫ్లాప్స్ గా నిలిచాయి. కాని ఇప్పుడు హిట్స్ రావడంతో అందరూ గోల్డెన్ లెగ్ అంటున్నారు. నాకు ఫ్లాప్స్ వచ్చినపుడు ఎలా నటించానో ఇప్పుడు కూడా అలానే నటిస్తున్నాను. నా నటనలో ఎలాంటి మార్పు లేదు. ప్రేక్షకులు చూసే దృష్టిలో మార్పుంది. దేవుడి అనుగ్రహం వలన తెలుగు ప్రేక్షకులు నన్ను బాగా ఆదరిస్తున్నారు.

డైరెక్టర్ గురించి..?

కామ్ గా, కూల్ గా ఉండే మంచి గురువు. సినిమాపై చాలా ఫోకస్ద్ గా ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. నేను డైరెక్టర్ గారి హీరోయిన్ ని. ఆయన ఎలా చెప్తే అలా నటించాను.

నాన్నగారు మీ సినిమాల విషయంలో ఏమైనా సజెషన్స్ ఇస్తారా..?

నా సినిమాల విషయంలో నాన్నగారు అసలు ఇన్వాల్వ్ అవ్వరు. నువ్వు నటించే సినిమా నీ ఇష్టం నీ లైఫ్ అని మాత్రమే చెప్తారు. ప్రతి ఆర్టిస్ట్ జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. నాన్నగారు ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారంటే ఆయనే కష్టమే దానికి కారణం. ఆయన కూతురిని కాబట్టి ఇండస్ట్రీలోకి రావడం నాకు సులువే. కాని ఇక్కడకి వచ్చిన తరువాత మన టాలెంట్ మీదే కెరీర్ ఆధారపడి ఉంటుంది. ఫేమ్ ఈరోజు ఉంటుంది. రేపు పోతుంది. కాని మన వర్క్ మనతోనే ఉంటుంది. పనిని నమ్ముకుంటే ఏదైనా సాధించొచ్చు. 

సింగర్ గా, నటిగా సినిమాల్లో పని చేసారు. డైరెక్టర్ గా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా..?

దర్శకత్వం మీద నాకు అంత ఆసక్తి లేదు. ఇంట్రెస్ట్ లేదని కాదు కాని అది చాలా పెద్ద బాధ్యత. అది హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు.

స్క్రిప్ట్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..?

నేను చేసే ప్రతి పాత్ర భిన్నంగా ఉండాలనుకుంటాను. బ్యాక్ టు బ్యాక్ ఒకేలాంటి పాత్రల్లో నటించడం నచ్చదు. అలాంటి రోల్స్ చేసిన ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు కాబట్టి సినిమా సినిమాకు నా రోల్ డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటాను. రేసుగుర్రంలో ఫన్ క్యారెక్టర్ చేసాను. ఈ సినిమా విషయానికొస్తే కంప్లీట్ డిఫరెంట్ గా ఉండే రోల్ లో నటించాను. యూనిక్ సబ్జెక్టు ఇది.

ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు..?

టివి చూస్తాను. బాగా తింటాను. స్నేహితులను కలుస్తుంటాను. పుస్తకాలు ఎప్పుడు చదువుతూనే ఉంటాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs