Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ :నారా రోహిత్(బర్త్ డే స్పెషల్)


బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ ఫెలో వంటి వైవిధ్యమైన చిత్రాలలో నటించి తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న హీరో నారా రోహిత్. రీసెంట్ గా అసుర చిత్రంలో నటించి మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. శనివారం(జూలై 25)న ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి, భవిష్యత్ ప్రణాళికల గురించి విలేకరులతో ముచ్చటించారు.  

Advertisement
CJ Advs

సామాజిక సమస్యలను ప్రశ్నించే చిత్రాల్లోనే ఎక్కువగా నటించడానికి కారణం..?

చిన్నప్పటి నుండి రాజకీయ వాతావరణంలో పెరగడం వలన ఆ ప్రభావం ఉందేమో. అందుకే, ఆ తరహ కథలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కానీ నాకు అన్ని రకాల చిత్రాల్లోని నటించాలనుంది. 

ఎటువంటి చిత్రాల్లో నటిస్తే మీకు సూట్ అవుతుందనుకుంటున్నారు..?

ఆ విషయంలో నాకు, ప్రేక్షకులకు కన్ఫ్యూజన్ ఉంటుంది. నాకు ఎలాంటి కథలు బాగుంటాయో మీరే చెప్పాలి. సోలో ఎంతమందికి నచ్చిందో.. బాణం కూడా అంతేమందికి నచ్చింది. నాకు నచ్చిన కథల్లో నటిస్తూ వెళ్తున్నాను. ఏదోక రోజు ప్రేక్షకులు చెప్తారు. నాకు ఏ తరహా కథలు సూట్ అవుతాయో.

ఎలాంటి చిత్రాలు ఎక్కువగా చూస్తారు..?

వార్, స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. వాటిని చూసి స్ఫూర్తి పొందుతాను. పర్సనల్ గా రొమాంటిక్ కామెడీ సినిమాలంటే ఇష్టం.  

నటిస్తూ.. ప్రొడక్షన్ చేయడం కష్టంగా అనిపించడం లేదా..?

లేదు. చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. నిర్మాతగా మారడానికి ప్రధాన కారణం.. రెండు భాద్యతలు ఉంటే సినిమాపై మనం ఎక్కువ ఫోకస్ చేయగలం. ఇతర నిర్మాణ సంస్థలతో కలసి సినిమాలు నిర్మించే ఆలోచన కుడా ఉంది.

దర్శకుడిగా మారే ఆలోచన ఉందా..?

ఎవరైనా ఓ కథ చెబితే హిట్, ప్లాప్ అని చెప్పలేను. మంచిదో..? కాదో..? నిర్ణయించే ప్రతిభ ఉంది. దర్శకత్వం చేయడం నా వల్ల కాదు. అటువంటి ఆలోచన కూడా లేదు. 

మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తారా..?

ఎవరైనా అలాంటి తరహా కథలు చెప్తే నాకు నచ్చితే ఖచ్చితంగా నటిస్తాను. బాలకృష్ణ గారితో అవకాసం వస్తే మల్టీ స్టారర్ చిత్రంలో నటించాలనుంది.

అసుర విడుదల తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది..? 

విమర్శకులు, ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. 'అసుర విడుదల తర్వాత బాధ్యత పెరిగింది. మంచి చిత్రాలు చేయాలనుకుంటున్నాను. ఇక నుండి వైవిధ్యభరిత చిత్రాలతో పాటు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తాను. 

పూర్తిస్థాయి ప్రేమకథలో నటించే ఆలోచన ఉందా..?

"గీతాంజలి" వంటి స్క్రిప్ట్ ఎవరైనా చెప్తే చేయడానికి రెడీ. కానీ, ఎవరూ అటువంటి కథలను నాకు చెప్పడం లేదు. 

ఈ పుట్టినరోజుకు కొత్త నిర్ణయాలు ఏవైనా తీసుకున్నారా..?

హీరోగా పరిచయమైన ఆరేళ్ళలో ఆరు చిత్రాల్లో మాత్రమే నటించాను. ఇక నుండి ఎక్కువ చిత్రాల్లో నటించాలి. కథలు ఎంపిక, చిత్రీకరణలో వేగం పెంచాలి. నా లుక్ మార్చాలనుకుంటున్నాను.         

బ్రహ్మచారిగా ఇదే చివరి పుట్టినరోజు అనుకోవచ్చా..?

నాకంటే పెద్దవాడు ఇంట్లో అన్నయ్య ఉన్నాడు కదా. ప్రస్తుతం అన్నయ్యకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. తనకు ఈ ఏడాది పెళ్ళయితే, వచ్చే యేడాది నా పెళ్లి ఉంటుంది.   

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

పండగలా వచ్చాడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అందులో గోదావరి యాసతో డిఫరెంట్ గా కనిపించనున్నాను. సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అదే నెలలో పవన్ సాధినేని దర్శకత్వంలో 'సావిత్రి' షూటింగ్ ప్రారంభిస్తాం. అవి కాకుండా 'శంకర' ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ఆగష్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పాతబస్తీ నేపధ్యంలో "అప్పట్లో ఒకడుండేవాడు" చిత్రం త్వరలో ప్రారంభమవుతుంది. శ్రీవిష్ణు హీరోగా నేను నిర్మించబోయే చిత్రం మరో రెండు నెలల్లో మొదలవుతుంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs