Advertisement
Google Ads BL

ఆగస్ట్ 23న తెలంగాణా స్టార్ క్రికెట్ మ్యాచ్!


తెలంగాణా సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు సి.ఎం రిలీఫ్ ఫండ్ కొరకు తెలంగాణా స్టార్స్ వర్సెస్ చెన్నై హీరోస్  స్టార్ క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించనున్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ లో విజేతలుగా నిలిచిన వారికి 'కాకతీయ కప్' ను ప్రెజెంట్ చేయనున్నారు. ఈ మ్యాచ్ ఆగస్ట్ 23, 2015 న ఎల్.బి. స్టేడియంలో జరగనుంది. గురువారం హైదరాబాద్ లోని తెలంగాణా స్టార్స్ డ్రెస్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా.. 

Advertisement
CJ Advs

రసమయి బాలకిషన్ మాట్లాడుతూ "కళలకు, కళాకారులకు కుల, మత, ప్రాంతీయ భేదాలు లేవు. కష్టపడి ప్రయత్నిస్తే ఎవరైనా స్టార్ లుగా ఎదగవచ్చు. ఆకాష్ స్వయంకృషితో ఎదిగాడు. ఇక్కడ పుట్టకపోయినా ఈ ప్రాంతంపై మమకారాన్ని పెంచుకున్నాడు. ఈ ప్రాంతానికి ఏమైనా చేయాలనే ఉద్దేశ్యంతో స్టార్ క్రికెట్ ను ప్రారంభించాడు. కాకతీయ కప్ తెలంగాణా కళాకారుల ఎదుగుదలకు తోడ్పడాలి. వారిలో స్పూర్తిని నింపేందుకు ఉపయోగపడాలి" అని చెప్పారు.

నాగరాజు మాట్లాడుతూ "నాయిని నరసింహారెడ్డి చేస్తుల మీదుగా ఈ పోటీ ప్రారంభం కానుంది. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్యమంత్రి కెసిఆర్ అవార్డు ప్రధానోత్సవం చేస్తారు. బోనాల panduga కారణంగా ఆగస్ట్ 9న నిర్వహించవల్సిన ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ 23న జరుపుతున్నాం" అని చెప్పారు.

హీరో ఆకాష్ మాట్లాడుతూ "ఈ కాకతీయ కప్ తో ప్రతి తెలంగాణా కళాకారుడు స్టార్ గా ఎదుగుతాడు. నటన ప్రతిభ ఉంది వెలుగులోకి రానటువంటి కళాకారులకు ఈ క్రికెట్ మ్యాచ్ ఓ వేదిక కానుంది" అని చెప్పారు.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs