Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ- వైభవ్(పాండవుల్లో ఒకడు)


'గొడవ' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమయ్యి 'సరోజ' , 'బిరియాని' , 'అనామిక' వంటి హిట్ చిత్రాల్లో నటించిన హీరో వైభవ్. రీసెంట్ గా తమిళంలో శంకర్ సమర్పణలో కార్తిక్ దర్శకత్వంలో ఆయన నటించిన కప్పల్ అనే చిత్రాన్ని తెలుగులో దర్శకుడు మారుతి 'పాండవుల్లో ఒకడు' అనే టైటిల్ తో అనువదించారు. ఈ చిత్రం జూలై 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో వైభవ్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

సినిమా ఎలా ఉండబోతోంది..?

ఐదుగురు స్నేహితులకు చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన వలన పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అవుతారు. అందులో ఒకడు మాత్రం ప్రేమించి, పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతోనే సిటీ కు వస్తాడు. తన ప్రేమకు స్నేహితులే అడ్డంకిగా మారతారు. చివరకు ఆ స్నేహితులే హీరో ప్రేమను ఎలా గెలిపించారనేదే ఈ సినిమా కథ. రెగ్యులర్ లవ్ స్టోరీస్ కు భిన్నంగా ఉండే ప్రేమకథ ఇది. సినిమాలో నా పాత్ర పేరు వాసు. నాతో పాటు కరుణాకరన్, అర్జున్, సుందర్, వెంకట్ అనే మరో నలుగురు కలిసి నటించారు. ప్రేమ, పెళ్ళే లక్ష్యం అనుకోని బ్రతికే ఓ యువకుడి పాత్రలో కనిపిస్తాను. 

ఈ చిత్రాన్ని టాప్ డైరెక్టర్ శంకర్ సమర్పణలో తీయడం ఎలా అనిపించింది..?

ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కార్తిక్ గారు శంకర్ గారి శిష్యుడు. ఈ సినిమా మొదటి కాపీ రెడీ అయిన తరువాత ఆయన శంకర్ సర్ ఫ్యామిలీకు చూపించారు. సినిమా చూసిన తరువాత శంకర్ గారి భార్య ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిద్దామని నిర్ణయించుకున్నారు. తమిళంలో ఈ సినిమా హెవీ కాంపిటీషన్ మధ్యలో రిలీజ్ అయింది. శంకర్ గారు లేకపోతే మాకు థియేటర్స్ దొరకడానికి కూడా చాలా కష్టమయ్యేది.

సినిమాలో హైలైట్స్ ఏంటి..?

తమిలలో సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం కామెడీనే. స్క్రీన్ ప్లే అధ్బుతంగా ఉంటుంది. తమిళంలో కామెడీ పంచ్ డైలాగ్స్ ను ఏమాత్రం మార్చకుండా తెలుగు నేటివిటీ కు దగ్గరగా రాయడంలో మారుతి గారు ఎంతో కృషి చేసారు. 

ఈ సినిమా మీ కెరీర్ కు ఎలా హెల్ప్ అవుతుందనుకుంటున్నారు..?

తమిళంలో సెట్ అయిన విధంగా నాకు తెలుగులో ప్రాజెక్ట్స్ సెట్ కావట్లేదు. ఈ సినిమాకు తెలుగులో డబ్బింగ్ నేనే చెప్పాను. ఈ చిత్రంతో మరలా తెలుగులో స్ట్రెయిట్ సినిమాలలో నటించే అవకాశాలు వస్తాయానుకుంటున్నాను. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను.

బైలింగ్వల్ చిత్రాలలో నటించొచ్చు కదా..?

నాకు బైలింగ్వల్ చిత్రాలలో నటించాలంటే కాస్త భయం. ఎందుకంటే తమిళంలో రూరల్ గా ఉన్న సినిమాలు చూస్తారు. అదే చిత్రాన్ని తెలుగులో చూడడానికి తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. తెలుగులో సాంగ్స్, ఫ్రేమ్స్ కలర్ ఫుల్ గా ఉంటేనే ప్రేక్షకులు చూడడానికి ఇష్టపడుతున్నారు. అందుకే బైలింగ్వల్ చిత్రాలలో నటించడానికి వీలైనంత దూరంగా ఉంటాను.

డైరెక్షన్ చేసే ఆలోచన ఉందా..?

నేను నటుడ్ని కాకముందు పూరిజగన్నాథ్ గారి దగ్గర అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాను. ప్రస్తుతం నాకు వరుసగా మూడు నుండి నాలుగు సినిమాలు కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ అవ్వడానికి రెండు సంవత్సరాల సమయం పడుతుంది. దాని తరువాత దర్శకత్వం వహించడం గురించి ఆలోచిస్తాను. డైరెక్షన్ చేసే ఆలోచన అయితే ఉంది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్..?

ప్రస్తుతం తమిళంలో సుందర్ సి ప్రొడక్షన్ లో ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నాను. షార్ట్ ఫిల్మ్ ను డైరెక్ట్ చేసే ఓ దర్శకుడు ఆ సినిమాకు పని చేస్తున్నాడు.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs