Advertisement
Google Ads BL

వామ్మో.. బాబుపైనే మంత్రి ఫైర్‌ అయ్యాడు..!!


టీడీపీ పార్టీ రాజకీయాల్లో చాలా క్రమశిక్షణ గల పార్టీగా పేరుంది. ఇక ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని పల్లెత్తు మాట అనడానికి కూడా తెలుగు తమ్ముళ్లు సాహసించారు. అయితే ఏపీ క్యాబినెట్‌ మంత్రి చంద్రబాబుపై మంత్రుల సమక్షంలోనే ఫైర్‌ అయ్యి షాకిచ్చారు. దీంతో అవాక్కైన మిగితా మంత్రివర్యులు ఆయన్ను శాంతపరిచి విషయాన్ని దాటవేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Advertisement
CJ Advs

ఏపీ క్యాబినెట్‌ సమావేశంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని, దేవాదాయశాఖ మంత్రి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా మంత్రి మాణిక్యాలరావు ఆగ్రహంతో.. పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా, మిగితా వారికి అప్పగించి ఇప్పుడు తనను ప్రశ్నిస్తే ఉరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అవాక్నై మిగితా మంత్రులు విషయాన్ని దాట వేశారు. త్వరలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందన్న ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో మాణిక్యాలరావు తొందరపడి మాట్లాడినట్లు తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. చంద్రబాబు ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెడతారా.. ? లేక మాణిక్యాలరావుపై చర్యలు తీసుకుంటారా..? అనే చర్చలు టీడీపీలో కొనసాగుతున్నాయి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs