తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంగళవారం జ్వరం వచ్చినట్లు సమాచారం. దీంతో మంగళవారం నిర్ణయించిన ముఖ్యమంత్రి అప్పాయింట్‌మెంట్స్‌ను సీఎమ్‌ఓ కార్యాలయం రద్దు చేసింది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.
కాగా ఈ రోజు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి గౌరవార్థం ప్రత్యేక విందును ఇస్తున్నారు. మంగళవారం సాయంత్రం జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది తెలియకుండా ఉంది. సాయంత్రంలోపు కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడితే ఆయన తప్పకుండా విందుకు హాజరవుతారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరవుతున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎదురెదురు పడితే ఎలా స్పందిస్తారోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ భేటీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది.