Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ-యంగ్ విలన్ చరణ్ దీప్


ఇండస్ట్రీకి వచ్చే వారిలో వందకి 99 శాతం మంది హీరోలై పోదామనే వస్తారు. అయితే నేను మాత్రం విలన్ అవుదామనే ఇండస్ట్రీలోకి వచ్చాను. రాగానే పెద్ద పెద్ద సినిమాలు చేసేయాలని కాకుండా, ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్లకుండా మంచి పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ, ఆ పాత్రలకు న్యాయం చేసుకుంటూ వెళ్లాలనేదే నా ఆలోచన, ఎందుకంటే నేనెప్పుడూ లాంగ్ రన్ నే చూస్తానని అంటూ యంగ్ విలన్ చరణ్ దీప్. అరుడుగుల విగ్రహం, చూపరులను ఆకట్టుకునే దేహధారుడ్యంతో విలనిజాన్ని కళ్లతో పలికించే రూపం చరణ్ దీప్ సొంతం. సినిమా రంగంలోకి ఇప్పుడున్న యంగ్ విలన్స్ లో తనదైన స్టయిల్ లో పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకెళుతున్న ఈ యంగ్ విలన్ తో సినీ ముచ్చట్లు...

Advertisement
CJ Advs

నేపథ్యం...

మాది కడప, అయితే నేను పుట్టి పెరిగిందంతా హైద్రాబాద్ లోనే. బి.టెక్ చదివిన తర్వాత సినిమాల్లో ట్రై చేశాను. ఐదేళ్లుగా సినీ ప్రయత్నాలు చేస్తున్నాను. మధ్యలో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని సిక్స్ ప్యాక్, మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుని మళ్లీ సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాను. ముందు నాకు తమిళంలో ‘జిల్లా’ చిత్రంలో విలన్ మంచి అవకాశం వచ్చింది. ఆ  సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశాను. అంతకు ముందు రెండు మూడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాను. అయితే ఇది కరెక్ట్ కాదనే నేను గ్యాప్ తీసుకున్నాను. తర్వాత ‘సిగరం తొడు’ సినిమా చేశాను. అలా నేను చేస్తున్న పాత్రలకు మంచి పేరు రావడంతో మంచి అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.  

సినిమా ఇండస్ట్రీలోకి రావాలనే ఆసక్తి...

సినిమాల్లోకి నటుడవుదామని రాలేదు, సినిమాల్లో ఏదో ఒక డిపార్ట్ మెంట్ లో పార్ట్ అవుదామనే వచ్చాను. అయితే చాలా మంది మంచి ఫిజిక్ ఉంది కదా, అని అనడంతో ఫిజిక్ విషయంలో, నటన విషయంలో ట్రైనింగ్ తీసుకుని ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఐదేళ్లుగా ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడలో సినిమాలు చేశాను. కన్నడలో బాక్సర్ అనే సినిమా చేశాను. రిలీజ్ కి రెడీగా ఉంది. అలాగే నెక్స్ ట్ నెల మరో సినిమాలో నటించనున్నాను.

విలన్ అవుదామనే వచ్చాను...

-నేను ఇండస్ట్రీలోకి విలన్ అవుదామనే వచ్చాను. నూటికి తొంబై తొమ్మిది శాతం మంది హీరో అవుదామనే ఇక్కడకు వస్తారు. అయితే నేను మాత్రం విలన్ అవుదామనే వచ్చాను. ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ మెయిన్ విలన్ గా చేస్తున్నవే.

ఆయనే నాకు ఇన్ స్పిరేషన్..

-కోటగారే నాకు ఇన్ స్పిరేషన్. ఆయన విలన్ గానే కాదు అన్నీ రకాల పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. నేను కూడా విలన్ గానే కాదు, అన్నీ  రకాల పాత్రలు కూడా చేయగలను, నేను అలాగే ప్రిపేర్ అయ్యాను.

ఫోటోస్ చూసి పిలిచారు..

-‘బాహుబలి’ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో నటీనటుల ఎంపిక జరుగుతున్నప్పుడు ‘బద్రినాథ్’ లో విలన్ గా చేసిన రాకేష్ నా పిక్చర్స్ ను రాజమౌళిగారికి చూపించారు. ఆయనకి నచ్చడంతో ఆయన పిలిపించారు. అప్పుడే సిక్స్ ప్యాక్ అవన్నీ చేసి ఉన్నాను. నాలా సెలక్ట్ చేసిన కొంత మందికి ఒక నెల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. మార్షల్ ఆర్ట్స్, కత్తియుద్ధం, గుర్రపు స్వారీలో అందరికీ తర్ఫీదునిచ్చారు. వంద, రెండు వందల మందికి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే చివరకు ఫిల్టర్ అవుతూ వచ్చి ఎడెనిమిదిమంది మిగిలాం.

ఇద్దరితో చేయడం నా డ్రీమ్...

నేను ప్రభాస్ అన్నకి పెద్ద ఫ్యాన్. ‘చత్రపతి’ సినిమా చూసి ఆయనకి ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. రాజమౌళిగారి సినిమాలో నటించాలనేది నా డ్రీమ్. అలాంటిది ఇద్దరితో కలిసి ఒకే సినిమాలో చేయడం మరచిపోలేని అనుభూతి.

గెటప్ చూసి..చాలా భయంకరంగా ఉందన్నారు...

-‘బాహుబలి’లో కాళకేయ రాజ్యానికి రాజు ప్రభాకర్, అతని తమ్ముడిగా నటించాను. ఆ గెటప్ కోసం చాలా కాస్ట్యూమ్స్ వాడాం. చివరికి ఒకటి సెట్ అయింది. ఆ గెటప్ లో రాజమౌళిగారి తర్వాత ప్రభాస్ అన్ననే మమల్ని ముందు చూసి వీరేంటి చూడ్డానికే ఇంత భయపెడుతున్నారు. నాకే ఇలా ఉంటే..రేపు ఆడియెన్స్ కి ఎలా ఉంటుందోనన్నారు. అలాగే ఓ సందర్భంలో నన్ను దగ్గరకి పిలిచి దూరంగా చూడ్డానికి లుక్ చాలా బావుంది. నీ కళ్లు బావున్నాయని మెచ్చుకున్నారు కూడా.

కామెడి విలన్ గా చేయడం డిఫరెంట్  ఎక్స్ పీరియెన్స్ ...

-ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ సీరియస్ విలన్ గా చేసినవే. అయితే ‘వినవయ్యా రామయ్యా’ చిత్రంలో కామెడి టచ్ ఉన్న విలన్ గా చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియెన్స్. చాలా మంది ఇలా కామెడి కూడా చేస్తానని తెలియడంతో మెచ్చుకున్నారు. ప్రకాష్ రాజ్ గారు మంచి ఇన్ పుట్స్ ఇచ్చారు. అవి ఎప్పటికీ మరచిపోలేను.

నేను డైరెక్టర్స్ యాక్టర్...

-నాకు పాత్రలు, వాటి పరమైన నటన అంటే సదరు డైరెక్టర్ నే ఫాలో అయిపోతాను. వారేం చెబితే నేను అదే చేస్తాను. డైరెక్టర్స్ యాక్టర్ గా ఉండటానికే ఇష్టపడతాను.

ఈ ఇయర్ రెండు వంద కోట్ల ప్రాజెక్ట్స్ చిత్రాల్లో నటించడం హ్యాపీగా ఉంది...

-తెలుగులో ‘బాహుబలి’, అలాగే తమిళంలో విజయ్ ‘పులి’ చిత్రాలు రెండు వందకోట్ల పైచిలుకువే. ఈ ఇయర్ అలాంటి రెండు ప్రాజెక్ట్స్ చేయడం హ్యాపీగా ఉంది. విజయ్ గారు నన్ను చూసి నీ కళ్లు బావున్నాయి. డైవర్ట్ కాకుండా ట్రై చెయ్, తమిళంలో ఇప్పుడు యంగ్ విలన్స్ ఎవరూ లేరు. మంచి ఫ్యూచర్ ఉంటుందని అన్నారు. జూలైలో ‘బాహుబలి’ విడుదలవుతుంటే, ఆగస్టు లేదా సెప్టెంబర్ లో విజయ్ ‘పులి’ విడుదలయ్యే అవకాశం ఉంది. రెండు పెద్ద చిత్రాలు వరుసగా రిలీజ్ అవుతుండటం నాకు చాలా ప్లస్ అవుతుండనడంలో సందేహం లేదు. ‘పులి’ చిత్రంలో శృతిహాసన్ బావ రోల్ చేశాను.

నెక్స్ ట్ ప్రాజెక్ట్..

-పూరిజగన్నాథ్ గారి సినిమాలో మెయిన్ విలన్ గా చేయబోతున్నాను. కన్నడలో ‘బాక్సర్’ రిలీజ్ కానుంది. అదీ కాకుండా మరో సినిమా చేయబోతున్నాను.  తమిళంలో విజయ్ సరసన ‘పులి’ విడుదలకు సిద్ధమవుతుంది. అట్లీ డైరెక్షన్ లో విజయ్ హీరోగా చేయబోతున్న సినిమాకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. తమిళంలో విజయ్ గారు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. నేను, రష్మీ కలసి చేసిన ‘వ్యూహం’ అనే థ్రిల్లర్ మూవీలో హీరోగా చేశాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుంది. అది కూడా త్వరలోనే రిలీజ్ కి అవుతుంది.               

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs