Advertisement
Google Ads BL

అమ్మకానికి పుట్టపర్తి విమానాశ్రయం..!!


పుట్టపర్తి విమానాశ్రయం ఒకప్పుడు రద్దీగా ఉండేది. బాబా బతికున్న కాలంలో దేశ, విదేశాలనుంచి ఇక్కడికి విమానాల్లో భక్తులు వచ్చేవారు. అయితే ఆయన మరణాంతరం ఈ విమానాశ్రయం పూర్తిగా బోసిపోయింది. అంతేకాకుండా ఈ విమానాశ్రయాన్ని నడపటం పుట్టపర్తి ట్రస్ట్‌కు అదనపు భారంగా మారినట్లు సమాచారం. దీంతో ఈ విమానాశ్రయాన్ని ప్రభుత్వానికి విక్రయించాలనే ఆలోచనలో ట్రస్ట్‌ ఉంది.

Advertisement
CJ Advs

ఇక రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 450 ఎకరాల్లో ఉన్న పుట్టపర్తి విమానాశ్రయాన్ని కొనుగోలు చేసి మరింత విస్తరిస్తే మంచిదని అనంతపురం నాయకులు సూచిస్తున్నారు. దీంతో అనంతపురం జిల్లా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని వారంటున్నారు. ప్రభుత్వం కూడా ఈ విమానాశ్రయం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs