Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ-ప్రదీప్ కుమార్ అర్ర


సంబిత్, మౌసుమి, స్నేహ ప్రధాన పాత్రల్లో అర్ర మూవీస్ సమర్పణలో తపస్ జేనా, ప్రదీప్ దాష్ దర్శకత్వంలో ప్రదీప్ కుమార్ అర్ర నిర్మిస్తున్న సినిమా 'ప్రమాదం'. చావు 100% అనేది ఉపశీర్షిక. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని జూన్ 26న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ప్రదీప్ కుమార్ అర్ర తో సినీజోష్ ఇంటర్వ్యూ..

Advertisement
CJ Advs

సినిమా ఎలా ఉండబోతోంది..?

ఫుల్ లెంగ్థ్ హారర్ సినిమా ఇది. సినిమా మొదలయినప్పటి నుండి క్లైమక్స్ వరకు హారర్ నేపధ్యంలోనే సాగుతుంది. రెగ్యులర్ హారర్ చిత్రలాకు కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రంలో కామెడీ, పాటలు, రొమాన్స్ లు ఉండవు. ఫుల్ లెంగ్థ్ హారర్ మూవీ. సినిమాలో ఏడు పాత్రలుంటాయి. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. జూన్ 26 విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.

హారర్ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి..?

తెలుగులో సినిమాలను నిర్మించాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఓ మంచి లవ్ స్టొరీ ను నా  మొదటి చిత్రంగా నిర్మించాలనుకున్నాను. కాని మాకున్న లిమిటెడ్ బడ్జెట్ లో హారర్ కథ అయితే బావుంటుందని ఈ సినిమా చేసాం. అంతేకాకుండా ప్రస్తుతం హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. హారర్ చిత్రాలలో 'ప్రమాదం' ఓ కొత్త ట్రెండ్ ను సృష్టించబోతోంది.

షూటింగ్ టైమ్ లో మరచిపోలేని ఏమైనా అనుభవాలు ఉన్నాయా..?

ఈ సినిమా చిత్రీకరనంతా అరకు పరిసర ప్రాంతాల్లో నిర్వహించాం. షూటింగ్ సమయంలో జరిగిన ఓ రెండు మూడు సంఘటనలు ఆర్టిస్టులను ప్రమాదానికి గురిచేశాయి. కె.కె అనే ఆర్టిస్ట్ జంప్ చేసి గ్లాస్ బ్రేక్ చేయాలి. ఆ గ్లాస్ విండో కింద పది అడుగుల లోతు ఉంది. ఆ సీన్ షూట్ చేసేప్పుడు ఆయనకు కొన్ని దెబ్బలు తగిలాయి. అది కాకుండా యాక్ట్రస్ ఓ అమ్మాయి కాళ్ళ మీద లైట్ పడింది. హాస్పిటల్ లో జాయిన్ చేసేంత సీరియస్ అయింది. 

డైరెక్టర్ గురించి..?

తపస్ కు ఇది మొదటి సినిమా అయిన బాగా డైరెక్ట్ చేసాడు. నాకు కథ నేరేట్ చేసినప్పుడు ఏమయితే చెప్పాడో దానినే తెరకెక్కించాడు. సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటే నేచురల్ గా ఉండదని భావించి ప్రేక్షకులకు నచ్చే విధంగా చిత్రీకరించారు. కొత్త నటీనటులైనా అందరు అధ్బుతంగా నటించారు. అలానే మ్యూజిక్ డైరెక్టర్ సామ్ ప్రసన్ సన్నివేశాలకు తగ్గట్లుగా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. 

ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు..?

ఈ చిత్రాన్ని రెండు రాష్ట్రాల్లో సుమారుగా 75 నుండి 100 థియేటర్లలో శ్రేయాస్ మీడియా ద్వారా విడుదల చేయనున్నాం. అలానే కర్ణాటకలో, చెన్నై ప్రాంతాలలో రిలీజ్ చేస్తున్నాం.

ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా..?

హారర్ సినిమా లవర్స్ కు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. సెన్సార్ బోర్డు వారు కూడా సినిమా చూసి భయపడ్డారు. విజువల్ గా, యాక్టింగ్ పరంగా, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమాలో తరువాత ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ అందరిలో కలుగుతుంది. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

ఈ సినిమాతో మంచి ఎక్స్ పీరియన్స్ కలిగింది. ప్రమాదం పార్ట్ 2 ను నిర్మించడానికి కథ ను సిద్ధం చేసుకున్నాం. అలానే ఓ లవ్ స్టొరీ సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాను. 

 

 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs