ఎట్టకేలకు కడియం శ్రీహరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆరునెలలపాటు లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతూ.. రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా కడియం కొనసాగారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ కోటాలో ఆయన పెద్దల సభకు ఎన్నికవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
రాజయ్యను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయడంతో అప్పటికప్పుడు ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని కేసీఆర్ డిప్యూటీ సీఎం చైర్ ఎక్కించారు. విధానసభనుంచిగాని శాసనసభనుంచిగాని ఆయన ఎన్నికవడానికి మంత్రి అయినే తర్వాత ఆరు నెలల సమయం ఉండింది. అంతలోనే ఎన్నికలు రావడంతో గట్టెక్కిన కడియం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇక ఒకే సమయంలో అటు ఎంపీ.. ఇటు ఎమ్మెల్సీ పదవుల్లో కొనసాగే వీలు లేకపోవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు వరంగల్ స్థానం నుంచి కేసీఆర్ ఎవర్ని బరిలోకి దింపుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేసే ఆశావహుల సంఖ్య అధికంగానే ఉండటం కేసీఆర్‌కు పరీక్షలా మారింది. మరోవైపు ఉద్యోగాల నోటిఫికేషన్, డబుల్ బెడ్‌రూం ఇళ్ల హామీని నెలరవేర్చకుండా బరిలోకి దిగితే టీఆర్‌ఎస్‌కు కష్టాలు తప్పకపోవచ్చన వాదనలు వినిపిస్తున్నాయి.