ఒకప్పటి బ్యూరోక్రాట్ ఇప్పటి గవర్నర్ నరసింహన్ రాజకీయాల్లో ఆరితేరినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి, గవర్నర్‌కు పడటం లేదన్నది బహిరంగ రహస్యమే. గవర్నర్ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడనేది టీడీపీ నాయకుల ఆరోపణ. అయితే ఒకే సమయంలో అటు గవర్నర్.. ఇటు చంద్రబాబు కూడా ఢిల్లీ టూర్‌లో ఉన్నారు. ఈ టూర్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.
రాష్ట్ర విభజన జరిగి ఏడాది గడిచిన సందర్భంగా ఇరు రాష్ట్రాల్లోని పరిస్థితులపై గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇవ్వడానికి వచ్చాడు. హోంమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయి ఇరు రాష్ట్రాల్లోని పరిస్థితులను వివరించాడు. అదే సమయంలో అక్కడికి చంద్రబాబు రావడంతో రాజ్‌నాత్ గవర్నర్‌తో భేటీ ముగించి బాబుతో సమావేశానికి సిద్ధమయ్యాడు. ఇక హోంమంత్రి కార్యాలయంనుంచి బయటకు వస్తుండగానే గవర్నర్‌కు బాబు తారసపడటంతో కరచాలనం చేశారు. అంతటితో ఆగకుండా బాబుతో ఓ ఫొటో దిగాలని ఉందంటూ కొన్ని ఫొటోలు కూడా దిగారు. సాధారణంగా బాబు, గవర్నర్ అనేక కార్యక్రమాల్లో లుసుకొని ఫొటోలకు ఫోజులిస్తుంటారు. అలాంటిది ఢిల్లీలో.. ప్రస్తుత పరిస్థితుల్లో.. బాబును అడిగి మరి నరసింహన్ ఫొటో దిగడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉండి గవర్నర్‌కు రాజకీయాలు బాగానే ఒంటబట్టాయని మీడియా ప్రతినిధులు గుసగుసలాడారు. అందుకే మోడీ హయాంలో కూడా యూపీఏ నాటి గవర్నర్‌గా ఇంకా కొనసాగగలుగుతున్నారన్న వాదనలు కూడా వినిపించాయి.