రోజురోజుకి యానిమేషన్ రంగం పట్ల యూత్ లో క్రేజ్ పెరుగుతోంది. అదే కారణంతో హైదరాబాద్ నగరంలో ఎన్నో యానిమేషన్ సంస్థలు నెలకొల్పబడ్డాయి. అదే క్రమంలో 'క్రియేటివ్ మెన్టోర్స్' అనే యానిమేషన్ స్టూడియో హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు. ఈ యానిమేషన్ స్టూడియోను గురువారం హైదరాబాద్ లో కె.విశ్వనాథ్ లాంచనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ "నా జీవితంలో మొదటిసారిగా ఇలాంటి ఓ క్రియేటివ్ యానిమేషన్ స్టూడియోను చూసాను. నేను చేసిన సినిమాలలో గ్రాఫిక్స్ కు చోటు లేదు. అందుకే నాకు టెక్నాలజీ పట్ల అంత అవగాహన లేదు. ఈ స్టూడియోను చూశాక టెక్నాలజీలలో ఇంత మార్పు వచ్చిందా అనిపిస్తుంది. ఈ టెక్నాలజీ అధ్బుతంగా ఉంది. అపరబ్రహ్మ విశ్వ మిత్ర సృష్టిలా ఉంది. ఈ సంస్థ వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. నిర్మాతలు, దర్శకులు ఈ స్టూడియోను వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. ఈ స్టూడియో హాలీవుడ్ స్టూడియోలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని భావిస్తున్నాను" అని చెప్పారు.
ప్రభాకర్ మాట్లాడుతూ "లేటెస్ట్ టెక్నాలజీను ఇండియాకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ యానిమేషన్ స్టూడియో ప్రారంభించాం. ఈ టెక్నాలజీను ఫారెన్ లో చూసాం. అక్కడ మోషన్ కాప్చర్ చాలా పాపులర్. అదే టెక్నాలజీను మేము మార్కర్స్ లేకుండా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. గేమింగ్ లో, యానిమేషన్ లో ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది" అని చెప్పారు.
క్రియేటివ్ మెన్టోర్స్ డైరెక్టర్ సురేష్ మాట్లాడుతూ "ఈ టెక్నాలజీ ద్వారా తక్కువ సమయంలో 'లో' బడ్జెట్ సినిమాలను నిర్మించవచ్చు" అని చెప్పారు.