Advertisement

కేంద్రం శరణు కోరిన చంద్రబాబు..!!


తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో రోజుకో మలుపుతిరుగుతున్నాయి. చంద్రబాబును బద్ధ శత్రువుగా పరిగణిస్తున్న కేసీఆర్‌ ఆయన్ను ఓటుకు నోటు కేసులో పూర్తిగా ఇరికించినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఆడియో, వీడియో టేపులకుతోడు తమ వద్ద మరిన్ని ఆధారాలున్నాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తుండటం టీడీపీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక చంద్రబాబు అరెస్టు గురించి కేసీఆర్‌ గవర్నర్‌తో భేటీ కావడంతో ఇరు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రగులుకుంది. దీనిపై ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి కూడా కేంద్ర మంత్రులను కలిసి చంద్రబాబు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు.

Advertisement

ఇక పద్మవ్యూహంలో చిక్కుకుపోయిన చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లారు. అక్కడ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో భేటీ అయి ప్రస్తుత పరిస్థితుల గురించి పూర్తిగా వివరించారు. అనంతరం చంద్రబాబు ప్రధాని మోడీతో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశం ఏకంగా గంటపాటు సాగడం విశేషం. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చంద్రబాబు ఇంతకుముందెన్నడూ మోడీతో గంటకుపైగా సమావేశమైన దాఖలాలు లేవు. ఈ సమావేశంలో చంద్రబాబు ఓటుకు నోటు కేసు గురించి పూర్తిగా వివరించి తనకు మద్దతుగా నిలవాలని మోడీని కోరినట్లు తెలుస్తోంది. మరి మోడీ బాబును ఏమేర ఆదుకుంటారో వేచిచూడాలి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement