ఓటుకు నోటు కేసులో అరెస్టు అయిన రేవంత్‌రెడ్డికి బెయిల్ దొరికింది. తన కుమార్తె ఎంగేజ్‌మెంట్ కోసం రెండు రోజుల బెయిల్ కావాలని రేవంత్‌రెడ్డి కోరగా కోర్టుకు అందుకు అంగీకరించలేదు. కేవలం 12 గంటల బెయిల్ మాత్రమే మంజూరుచేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు రేవంత్‌రెడ్డికి బెయిల్ దొరికింది. ఈ సమయంలో మీడియాతోగానీ రాజకీయనాయకులతోగానీ మాట్లాడవద్దని కోర్పు స్పష్టం చేసింది.
నిజానికి రేవంత్‌రెడ్డి తరఫున న్యాయవాదులు రెండురోజుల బెయిల్ కోరారు. దీనికి ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాదులు స్పందిస్తూ 24 గంటలపాటు బెయిల్ ఇవ్వడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. అయితే కోర్టు మాత్రం కేవలం 12 గంటల బెయిల్ మాత్రమే మంజూరుచేయడంపై అటు రేవంత్‌రెడ్డి వర్గం.. ఇటు ప్రాసిక్యూషన్ న్యాయవాదులకు కూడా జలక్ ఇచ్చింది. ఇక రేవంత్‌రెడ్డికి సంబంధించి బెయిల్ పిటీషన్‌పై ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ కొనసాగుతోంది.