Advertisement
Google Ads BL

రామ్‌ని దారుణంగా మోసేస్తున్నారు!


రామ్‌ కథా నాయకునిగా నటించిన ‘పండగచేస్కో’ కథ ఫార్ములా చట్రంలో బిగించబడివుండవచ్చు. కానీ ఆర్టిస్టుగా రామ్‌ మెయిన్‌టెయిన్‌ చేసిన టైమింగ్‌ని మెచ్చుకోకుండా వుండలేం. క్యూట్‌గర్ల్‌ రకుల్‌ప్రీత్‌ కులుకులు, సమీర్‌రెడ్డి విజువల్‌ బ్యూటీ, ‘వీకెండ్‌ వెంకట్రావు’గా బ్రహ్మానందం అడల్ట్‌ కామెడీ, కోన వెంకట్‌ డబుల్‌ డెక్కర్‌ డైలాగులు ఏ సెక్షన్‌కి ఆ సెక్షనుగా ఎక్సలెంట్‌. ఈ సినిమాలో చూడాల్సింది కథకాదు, కాన్సెప్టు. సోనాల్‌ చౌహాన్‌, ఎమ్మెస్‌ నారాయణ, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, బ్రహ్మాజీ, శ్రవణ్‌ తదితరులు నటించిన ఈ సినిమాకి గోపీచంద్‌ దర్శకుడు, తమన్‌ సంగీత దర్శకుడు. సగటు ప్రేక్షకునికి వినోదాన్ని పంచుతున్న ఈ సినిమా గురించి పనిగట్టుకుని ప్రచారం జరగడానికి కారణమేమిటో రామ్‌ విశ్లేషించుకోవడం చాలా అవసరం.

Advertisement
CJ Advs

అలాగే ‘రాక్షసుడు’. సూర్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా కాన్సెప్టు పై ఆడియన్స్‌కి కనెక్ట్ వీటి కరక్ట్ గా కుదరలేదు. ఈ హారర్‌ కామెడీ రివెంజ్‌లో నయనతార, ప్రణీతవంటి సీజన్డ్‌ హీరోయిన్స్‌ వున్నా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడానికి కారణం : ఆత్మల కథ కావడమే. లారెన్స్‌ వరుసగా ఎక్కడ విజయాలు సాధించాడో వెంకట్‌ ప్రభు అక్కడ పబ్లిక్‌ పల్స్‌ పట్టుకోలేకపోయాడు. ఇమేజ్‌వున్న హీరో హీరోయిన్లతో చేసే ప్రయోగాలు కొన్నిసార్లు వికటిస్తాయి. కానీ కమ్మర్షియల్‌గా కొనుగోలుదార్లను సూర్య ఇమేజ్‌ ఆదుకుందనే చెప్పాలి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs