Advertisement
Google Ads BL

అమ్మ లేక అన్నార్తులు ఎంతగా అలమటించారో!


ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లుకి ఆమోదముద్ర పడీపడగానే, కొత్త రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే తమిళనాడుకి నష్టం జరుగుతుందా అని ఆరాతీసిన ముఖ్యమంత్రి జయలలితకు తన రాష్ట్ర సంక్షేమంపట్ల వున్న కమిట్‌మెంట్‌ని అభినందించి తీరాల్సిందే. అదే సందర్భంలో అమ్మ క్యాంటీన్ల ద్వారా కారు చౌక ధరలకు ఆహారం అందించడం, చౌక దుకాణాల ద్వారా వంట సామాగ్రి, కూరగాయలు సబ్సిడీ ధరలకు సరఫరా చేయడం, రంజాన్‌ మాసంలో ముస్లింలకోసం 4,500 టన్నుల బియ్యం సరఫరా చేయడం బడుగుల పట్ల అన్నార్తులపట్ల ఆమెకున్న అభినాన్ని మాటలలో చెప్పలేం. 

Advertisement
CJ Advs

జయలలిత అధికారంలో లేని ఈ ఎనిమిది నెలల్లో తమిళనాడులో పారిశ్రామిక అభివృద్ధికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. విధానపరమైన నిర్ణయాలేవీ జరగలేదు. ప్రతిపక్షంలోనున్న డిఎంకె, కాంగ్రెసు తదితర చిన్న చిన్న పార్టీలలో కూడా స్తబ్ధత ఆవరించింది. టోటల్‌గా తమిళనాట నిశ్శబ్దం ఘనీభవించింది. రాజకీయ, సాంఘిక చైతన్య వేదిక అయిన తమిళనాడు మూగబోవడం ఈ భరత జాతికి శుభసూచకంకాదు, ప్రత్యేకించి బడుగులకి. జయలలిత స్ఫూర్తితో ఎందరో ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనచేయడం శుభసూచకం. జయలలిత తిరిగి ఆధికారాన్ని చేపట్టడంతో మళ్ళీ తమిళనాట సాంఘిక, రాజకీయ జీవితం చైతన్యమయింది. శుభం భుయాత్‌.

- తోటకూర రఘు

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs