Advertisement
Google Ads BL

అమ్మ జగన్‌.. అన్నీ ఉత్త డైలాగులే..!!


జగన్‌, కేసీఆర్‌ల మధ్య ఉన్న దోస్తాన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వీరిద్దరూ బహిరంగంగా ఎప్పుడూ తమ మైత్రి బంధం గురించి మాట్లాడుకోనప్పటికీ అంతర్గతంగా మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోరు. ఇక జగన్‌ మరోవైపు కేసీఆర్‌తో ఎలాంటి సంబంధం లేదన్నట్లే వ్యవహరిస్తాడు. అయితే బయటకు ఎలా వ్యవహరించినా వారిమైత్రి బంధం ఎంత ధృడమైందో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మరోసారి బయటపడింది.

Advertisement
CJ Advs

తెలంగాణలో వైసీపీ మూడు ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొందింది. వారిలో ఇద్దరు ఇప్పటికే టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వారిద్దరిపై వేటు వేయాలని వైసీసీ నాయకులు స్పీకర్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేశారు. అంతటితో ఆ కథ ముగిసిపోయింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే వైసీపీ కచ్చితంగా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తుందని అందరూ భావించారు. అయితే వెంటనే మద్దతు ఇస్తే ఎక్కడ ఏపీలో ప్రజావ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళన వైసీపీలో కనిపించింది. దీంతో తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనబోమని, తమ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్‌లో పాల్గొనవద్దని విప్‌ జారి చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా విప్‌ ఉల్లంఘించి వారు ఓటు వేస్తే వేటు తప్పదని కూడా చెప్పారు. కాని ఇదంతా నాటకమని, వైసీపీ తప్పకుండా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తుందని ఇతర పార్టీల నాయకులు విమర్శించారు. ఇప్పుడు ఇదే నిజమని తేలింది. మంత్రి కేటీఆర్‌ ఫోన్‌ చేసి మద్దతు కోరగానే జగన్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. మరో రెండు రోజుల్లో తుది నిర్ణయం చెబుతామని చెప్పారు. దీన్నిబట్టి వైసీసీ కచ్చితంగా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు విప్‌లు, వేటు అంటూ కొత్త నాటకాలకు ఎందుకు తెర తీశారో..?.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs